Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణాలో భారీగా పదవుల పంపకం

తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు సోమవారం ఒకే సారి రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. నామినేటెడ్ పోస్టులను భర్తీచేయాలని చాలా కాలంగా పార్టీనేతలు కోరుతున్నారు. ఈరోజు అందరిని ఆశ్యర్యం పరుస్తూ పలు  ప్రభుత్వ రంగ సంస్థలకు చెయిర్ పర్సన్ లను నియమించారు.

kcr nominates party leaders to various public sector bodies

ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్ రావు సోమవారం ఒకే సారి రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. నామినేటెడ్ పోస్టులను భర్తీచేయాలని చాలా కాలంగా పార్టీనేతలు కోరుతున్నారు. ఈరోజు అందరిని ఆశ్యర్యం పరుస్తూ పలు  ప్రభుత్వ రంగ సంస్థలకు చెయిర్ పర్సన్ లను నియమించారు. వారి పేర్లు:


1.    తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి
2.    వుమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎంపి గుండు సుధారాణి (వరంగల్ జిల్లా)
3.    తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మడుపు భూమ్ రెడ్డి (మెదక్ జిల్లా)
4.    తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా గాంధి నాయక్ (వరంగల్ జిల్లా)
5.    తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్, టివి అండ్ థియేటర్ డెవలప్ మెంట్ చైర్మన్ గా పుష్కర్  రామ్మోహన్ రావు (ఆదిలాబాద్ – మందమర్రి)
6.    తెలంగాణ రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కె.వాసుదేవ రెడ్డి (కెయు విద్యార్థి నాయకుడు)
7.    మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ (గోషామహల్)
8.    తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ చిరుమిల్ల రాకేశ్ కుమార్ (ఓయు విద్యార్థి నాయకుడు –పెద్దపల్లి) 

-  మాజీ ఎంపి గుండు సుధారాణిని  టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా నియమించారు. అదేవిధంగా, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అధ్యక్షుడిగా ఓయు విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాసయాదవ్ (కరీంనగర్ జిల్లా)ను నియమించారు. మెదక్ డిసిసిబి మాజీ అధ్యక్షుడు ఎలక్షన్ రెడ్డి పేరును కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఖరారు చేశారు. ప్రస్తుతం ఎలక్షన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున కార్పొరేషన్  ప్రకటించలేదు. ఆయన తిరిగి హైదరబాద్ రాగానే చర్చించి ఏ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios