Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై క్లారిటీ....సీట్ల త్యాగానికి సిద్దమే: కుంతియా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ తరపున పోటీకి దిగే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. నియోజకవర్గాలవారిగా సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులు కూడా ఖరారవడంతో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

congress telangana incharge kuntiya about candidates selections
Author
Hyderabad, First Published Oct 23, 2018, 4:19 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ తరపున పోటీకి దిగే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. నియోజకవర్గాలవారిగా సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులు కూడా ఖరారవడంతో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించి ప్రచార శంఖారావాన్ని ప్రారంభించారు. అయితే మహా కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాక ప్రచారానికి ఆంటంకం కలుగుతోంది. అంతేకాకుండా మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో క్షేత్ర స్థాయిలో ప్రచారం ప్రారంభంకాలేదు. ఇలా డైలామాలో వున్న అభ్యర్థులు, కార్యకర్తలు అధిష్టానం ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. 

దీన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. నవంబర్ మొదటివారంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున పొటీచేసే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా వెల్లడించారు. అయితే అన్ని స్థానాలకు ఒకేసారి కాకుండా విడతల వారిగా ఈ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.

 మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ...నవంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తొలిజాబితా విడుదల
చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో అత్యధికంగా వున్న బీసీలకు టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించి సీఎం  
కేసీఆర్‌ను గద్దెదించడానికి మహాకూటమిలో సీట్ల త్యాగానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని కుంతియా స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

 ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios