తెలుగు తేజం పివి సింధును అభినందించిన ప్రధాని, రాష్ట్రపతి
స్విట్జర్లాండ్ వేదికన జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో పివి సింధు చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో ఆమె ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ల నుండి ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు.
స్విట్జర్లాండ్ లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో భారత క్రీడాకారిణి పివి సింధు సత్తా చాటింది. ఫైన్లలో జపాన్ క్రీడాకారిణి ఒకుహురాపై 21-7,21-7 పాయింట్ల తేడాతో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించి విజేతగా నిలిచింది. ఇలా గత రెండేళ్లుగా మిస్సవుతూ వస్తున్న గోల్డ్ మెడల్ ను సింధు ఒడిసిపట్టుకుంది. ఈ టోర్నీలో గోల్డ్ మెడల్ గెలుచుకోవడం సింధుకే కాదు భారత్ కే మొదటిసారి. ఇలా దేశ ప్రతిష్టను పెంచేలా అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శన చేసిన సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇప్పటికే రాజకీయ, సిసీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు సింధును కొనియాడుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లు కూడా సింధును అభినందిస్తూ ట్వీట్లు చేశారు.
ప్రధాని మోదీ:
''అద్భుత ప్రతిభ కలిగిన పివి సింధు మరోసారి దేశాన్ని గర్విచేలా చేసింది. బిడబ్యూఎఫ్ వరల్డ్ చాంఫియన్‌షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఆమెకు నా అభినందనలు. ఆమె తన ఆట పట్ల కలిగివున్న అంకితభావంతో ఆమె ఇప్పటివరకు సాధించిన విజయాలు ఎంతో స్పూర్తిధాయకమైనవి. ఈ తరానికి చెందిన ఆటగాళ్లందరికి సింధు విజయం ఎంతో స్పూర్తినిస్తుంది.'' అంటూ ప్రధాని సింధును ప్రశంసించారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్:
'' బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పివి సింధుకు అభినందనలు. యావత్ దేశానికి ఈ గెలుపు ఎంతో గర్వకారణం. నువ్వు కోర్టులో చేసిన మ్యాజిక్, కష్టానికి ప్రతిఫలమే ఈ విజయం. ఇది దేశంలోని కోట్లాదిమందికి స్పూర్తినిస్తుంది. భవిష్యత్ లో కూడా ఇలాంటి మరిన్ని విజయాలు అందుకొన్ని దేశకీర్తిని మరింత పెంచాలని కోరుకుంటున్నా'' అంటూ రాష్ట్రపతి భవన్ నుండి రాష్ట్రపతి పేరుతో ఓ ట్వీట్ వెలువవడింది.
ఇక తెలుగు క్రీడాకారిణి సింధు దేశానికి ఇంత గొప్ప విజయాన్ని అందివ్వడంతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు. ఇప్పటికే ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎంవో నుండి పివి సింధుకు అభినందనలు అందాయి. అంతేకాకుండా ఇరు రాష్ట్రాలను చెందిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సింధు ను కొనియాడుతూ సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు.
సంబంధిత వార్తలు
చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం
2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పివి సింధు... కేటీఆర్, హరీష్‌ల అభినందనలు
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)