SRH vs RR : బ్యాటింగ్ చేయడం చాలా కష్టం... సిగ్గు లేకుండా తన డకౌట్ ను సమర్థించుకున్న సంజూ శాంసన్..
SRH vs RR Sanju Samson : థ్రిల్లింగ్ మ్యాచ్ రుచి అంటే ఎలా ఉంటుందో చూపించారు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు. నరాలు తెగే ఉత్కంఠరేపుతూ చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిచింది.
SRH vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ 50వ మ్యాచ్‌లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్, పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంది. కానీ, టాస్ ఓడిపోవడంతో మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ట్రెంట్ బౌల్ట్ తన మొదటి ఓవర్ వికెట్లు తీసే తీరును కొనసాగించలేదు కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌లను వేగంగా పరుగులు చేయకుండా ఆపగలిగాడు.
అయితే, మరోసారి ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. అలాగే, నితీష్ రెడ్డి నుండి 76 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 42 పరుగులతో అదరగొట్టడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 201/3 పరుగులు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సందీప్ శర్మకు ఒక వికెట్ లభించింది. భారీ టార్గెట్ లో బరిలోకి దిగిన రాజస్థాన్ కు తొలి ఓవర్‌లోనే జోస్ బట్లర్, సంజూ శాంసన్‌ల వికెట్లను కోల్పోయింది. అయితే, యశస్వి జైస్వాల్ (67 పరుగులు), రియన్ పరాగ్ (77 పరుగులు) సూపర్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపారు.
TEAM INDIA T20 WORLD CUP: రింకూ సింగ్, కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే.. !
అయితే, చివరలో షిమ్రాన్ హిట్మేయర్, ధ్రువ్ జురెల్, రోవ్‌మాన్ పావెల్ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ అనుకున్నది జరగలేదు. కేవలం ఒక్కపరుగు తేడాతో ఓడిపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు సాధించింది. హైదరాబాద్ హీరోలు టీ నటరాజన్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసారు. అయితే, ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఓటమి బాధతో నిరుత్సాహంగా కనిపించాడు. ఆర్ఆర్ వైపు మ్యాచ్ ఉన్న సమయంలో హైదరాబాద్ బౌలర్లు రాణించడాన్ని ప్రశంసించాడు.
సంజూ శాంసన్ మాట్లాడుతూ.. "మేము ఈ సీజన్‌లో గెలుపు దగ్గరగా వెళ్లిన మ్యాచ్ లను ఆడాము. వాటిలో రెండు గెలిచాము. ఇందులో ఒకటి ఓడిపోయాము.. ఇందులో హైదరాబాద్ బౌలర్లు పోరాడిన విధానానికి క్రెడిట్ దక్కుతుంది. ఐపీఎల్ ఓటమిలో మార్జిన్ చాలా తక్కువగా ఉంది. ఆట ఎప్పుడూ ఒకేలా జరగదని" పేర్కొన్నాడు. అలాగే, ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ తన డకౌట్ ను సమర్థించుకున్నాడు. కొత్త బంతికి ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైనదనీ, బంతి పాతది కావడంతో అది సులభమైందని చెప్పాడు. త్వరితగతిన వికెట్లు కోల్పోయిన తర్వాత ఆర్ఆర్ తిరిగి ఆటలోకి రావడానికి కృషి చేసిన యంగ్ జోడీ యశస్వి జైస్వాల్-రియాన్ పరాగ్‌లను సంజూ ప్రశంసించాడు.
SRH vs RR : థ్రిల్లింగ్ మ్యాచ్ అంటే ఇదే.. భువనేశ్వర్ మెరుపులు