వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పివి సింధు... కేటీఆర్, హరీష్‌ల అభినందనలు
స్విట్జర్లాండ్ వేదికన జరిగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2019 మహిళా విభాగంలో తెలుగు తేజం పివి సింధు చరిత్ర సృష్టించింది. ఫైనల్లో జపాన్ షట్లర్ ఒకుహురా ను ఓడించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.
ఒలింపిక్ పతక విజేత పివి సింధు మరో ప్రతిష్టాత్మక విజయాన్ని అందుకుంది. స్విట్జర్లాండ్ వేదికన జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళా విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఇలా ఈ ఛాంపియన్‌షిప్ లో మొదటిసారి ఫైనల్ విజేతగా నిలిచిన భారత క్రీడాకారిణిగా సిధు చరిత్ర సృష్టించింది.
ఇలా భారతదేశ కీర్తిని మరోసారి ప్రపంచదేశాలకు చాటిన తెలుగు తేజం సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సింధుకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. '' శుభాకాంక్షలు పివి సింధు. వరల్డ్ బ్యాడ్మింటన్ షిన్ లో భారత్ కు మొదటి గోల్డ్ మెడల్ అందించిన నిన్ను చూసి మేమంతా ఎంతో గర్విస్తున్నాం. '' అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.
మరో మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా సింధును అభినందించాడు. '' బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ 2019 లో గోల్డ్ మెడల్ గెలిచిన పివి సింధు కి శుభాకాంక్షలు. ఎంతో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. నీ విజయాలు భారతదేశంలోని ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. భవిష్యత్ తరాలు పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని దేశ ప్రతిష్టను మరింత పెంచేలా చేయడానికి నీ ఈ విజయం ఎంతో స్పూర్తినిస్తుంది. '' అని కేటీఆర్ సింధును కొనియాడారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సింధు జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ఆరంభంనుండి సింధు దూకుడుగా ఆడుతూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దీంతో మొదటి రౌండ్ ను 21-7 పాయింట్ల తేడాతో గెలుచుకుంది. రెండో రౌండ్లో కూడా ఏ మాత్రం దూకుడు తగ్గించని సింధు సేమ్ ఫలితాన్ని రాబట్టింది. దీంతో 21-7, 217 తేడాతో ఓడించి మొదటిసారి వరల్డ్ ఛాంపియన్ షిప్ ను చేజిక్కించుకుంది. ఇలా కేవలం 36 నిమిషాల్లోనే సింధు విజయయాత్ర ముగియడం విశేషం.
సంబంధిత వార్తలు
చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం
2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)