SRH vs RR : థ్రిల్లింగ్ మ్యాచ్ అంటే ఇదే.. భువనేశ్వర్ మెరుపులతో రాజస్థాన్ ను చిత్తుచేసిన హైదరాబాద్
SRH vs RR: ఐపీఎల్ 2024 లో నరాలు తెగే ఉత్కంఠరేపింది సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 1 పరుగు తేడాతో హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది.
Sunrisers Hyderabad vs Rajasthan Royals: థ్రిల్లింగ్ మ్యాచ్ రుచి అంటే ఎలా ఉంటుందో చూపించారు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు. నరాలు తెగే ఉత్కంఠరేపుతూ చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిచింది. చివరి బంది వరకు సాగిన ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దాదాపు మ్యాచ్ చేజారిపోయింది అనుకునే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత బౌలింగ్ తో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది.
ఐపీఎల్ 2024 50వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతున్నరాజస్థాన్ ఓడించింది. దీంతో ఆ జట్టు ఈ సీజన్ లో రెండో ఓటమిని అందుకుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి ఉంది. రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్ లు క్రీజులో ఉండగా, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి బంతికి రాజస్థాన్ 2 పరుగులు చేయాల్సి ఉండగా.. పావెల్ ను ఎల్బీడబ్ల్యూ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా భువనేశ్వర్
భువనేశ్వర్ చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్‌కు అద్భుతాలు చేయడమే కాకుండా, తన మొదటి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జోస్ బట్లర్, సంజూ శాంసన్‌లను పరుగులు చేయనియకుండా అడ్డుకుని పెవిలియన్ కు చేర్చాడు. చివరి ఓవర్ లోనూ అద్భుత బౌలింగ్ తో హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. భువనేశ్వర్ 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సన్‌రైజర్స్ ఆరంభం నెమ్మదించింది..
ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టే సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ లో ఆరంభం మంచిగా లభించలేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ ధనాధన్ ఇన్నింగ్స్ ను ఇవ్వలేకపోయారు. 10 బంతుల్లో 12 పరుగులు చేసి అభిషేక్ శరం ఔటయ్యాడు. అవేశ్ ఖాన్ ఐదో ఓవర్ తొలి బంతికి ధ్రువ్ జురెల్‌కి క్యాచ్ ఇచ్చాడు. అతని తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అన్మోల్‌ప్రీత్ సింగ్ కూడా ఎక్కువ సేపే క్రీజులో నిలవలేకపోయాడు. 5 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
క్లాసెన్‌ల మద్దతు లభించింది.
5.1 ఓవర్లలో 35 పరుగులకే 2 వికెట్లు పడిపోవడంతో ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ ను చేజిక్కించుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 57 బంతుల్లో 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 44 బంతుల్లో 58 పరుగులు చేసి ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. హెడ్ స్ట్రైక్ రేట్ 131.82గా ఉంది. అవేష్ ఖాన్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని తర్వాత నితీష్‌కు హెన్రిచ్ క్లాసెన్ మద్దతు లభించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 32 బంతుల్లో 70 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. నితీష్ 42 బంతుల్లో 76 పరుగులతో, క్లాసెన్ 19 బంతుల్లో 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. నితీష్ తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. కాగా, క్లాసెన్ 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అవేష్ ఖాన్ 2 వికెట్లు తీశాడు.
బట్లర్, శాంసన్ ఫ్లాప్ షో..
పరుగుల వేటలో రాజస్థాన్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లు తొలి ఓవర్‌లోనే ఔటయ్యారు. భువనేశ్వర్ కుమార్ జోస్ బట్లర్, సంజూ శాంసన్‌లను పెవిలియన్ పంపాడు. బట్లర్‌ను మార్కో యాన్సెన్ క్యాచ్ పట్టాడు. అదే సమయంలో అద్భుతమైన స్వింగ్ బంతికి శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
పరాగ్, యశస్వి సెంచరీ భాగస్వామ్యం..
తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడిపోవడంతో రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ జోడీ బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 78 బంతుల్లో 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో ఓవర్ తొలి బంతికే యశస్వికి లైఫ్ వచ్చింది. మార్కో జాన్సెన్ వేసిన బంతికి కెప్టెన్ పాట్ కమిన్స్ సులువైన క్యాచ్‌ను వదిలేశాడు. ఆ తర్వాత యశస్వి ఎలాంటి పొరపాటు చేయకుండా 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. అదే సమయంలో ఆరో ఓవర్ ఐదో బంతికి పరాగ్‌కి లైఫ్ వచ్చింది. ఈసారి నటరాజన్ వేసిన బంతికి అభిషేక్ శర్మ క్యాచ్ పట్టాడు. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న పరాగ్ 49 బంతుల్లో 77 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
హిట్మేయర్, జురెల్ ప్లాప్..
ఈ మ్యాచ్‌లో షిమ్రాన్ హిట్మేయర్, ధ్రువ్ జురెల్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. హిట్మేయర్ 9 బంతుల్లో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. నటరాజన్ ఓవర్‌లో సిక్సర్ కొట్టి ఔటయ్యాడు. మార్కో యాన్సెన్ అతని క్యాచ్ పట్టాడు. అతని తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి బంతికే ఔటయ్యాడు. పాట్ కమిన్స్ వేసిన బంతిని భారీ షాక్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద అభిషేక్ శర్మ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
MS Dhoni : ఏంది ధోని ఇలా చేశావ్.. అసలు నువ్వేనా ఇది.. ! వీడియో వైరల్