చిన్న పిల్లల కంటికి కాటుక పెట్టొచ్చా..?
బొట్టు వరకు ఒకే కానీ.. కళ్లకు అలా అంతంత కాటుక పెట్టడం కరెక్టేనా..? అలా రోజూ కాటుక పెట్టడం వల్ల పిల్లల కంటి చూపు బాగానే ఉంటుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతీయ ఇళ్లల్లో పిల్లలు పుట్టగానే కామన్ గా చేసే పని ఏమిటి అంటే... ముఖానికి, కళ్లకు, చేతులు, కాళ్లకు కాటుక పెట్టేస్తారు. దాని వల్ల.. వారిపై చెడు దృష్టి ఉండదు అని నమ్ముతారు. దీనిని ఎన్నో సంవత్సరాలుగా కామన్ గా చేస్తూ వస్తున్నారు. డాక్టర్స్ ఏమీ అలా పెట్టమని చెప్పరు. కానీ.. మన ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు మాత్రం పెట్టాల్సిందే అంటారు. పెట్టేస్తారు కూడా.
బొట్టు వరకు ఒకే కానీ.. కళ్లకు అలా అంతంత కాటుక పెట్టడం కరెక్టేనా..? అలా రోజూ కాటుక పెట్టడం వల్ల పిల్లల కంటి చూపు బాగానే ఉంటుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లో పెద్దవాళ్లు మాత్రం కాటుక పెట్టడం వల్ల పిల్లల కళ్లు చాలా పెద్దగా అవుతాయని నమ్ముతారు. కానీ డాక్టర్స్, పరిశోధకులు మాత్రం... ఇలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఇది పిల్లల కంటికి చాలా ప్రమాదం తెచ్చి పెడుతుందని వారు అంటున్నారు.
పిల్లల కళ్లకు కాటుక పెట్టే అలవాటు ఉంటే వెంటనే ఆపేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకు అంటే... ప్రస్తుతం మార్కెట్ లో లభించే అన్ని కాటుకలు, ఐలైనర్స్ కెమిక్సల్ తో తయారు చేసేవే. అప్పుడే పుట్టిన పిల్లలకు ఇవి రాయడం వల్ల... వారి కంటికి హాని కలుగుతుంది. ఎందుకంటే.. చిన్న పిల్లలకు కళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. అలాంటి సమయంలో ఈ కెమికల్స్ కారణంగా వారి కళ్లు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
బిడ్డ పుట్టినప్పటి నుంచి కంటికి కాటుక అప్లై చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు, ఎర్రగా మారడం, తరచూ కంటి వెంట నీరు కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో స్కిన్ కి కూడా డ్యామేజీ జరిగే అవకాశం ఉందట. చర్మంపై దద్దుర్లు, చికాకు లాంటివి కూడా సంభవించే అవకాశం ఉంది,
New Born
కొన్ని ఇళ్లలో, ఇంట్లో తయారుచేసిన కంటి ప్యాచ్‌లను శిశువులకు ఉపయోగిస్తారు. మరియు ఇది సహజమని వారు అంటున్నారు. కానీ ఇంట్లో తయారుచేసిన కాటుక కూడా సురక్షితం కాదు. కారణం ఇందులోని కార్బన్ పిల్లల కళ్లకు హానికరం. అదే సమయంలో, నేత్ర పిల్లల కళ్ళను వేలితో రుద్దడం వల్ల వారి కళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
నిజానికి శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చిన్నపాటి అజాగ్రత్త వల్ల కూడా పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు వేలి సహాయంతో పిల్లల కళ్ళకు కాటుకను రాస్తే.. ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది.
ఇక చాలా మంది పిల్లల కంటికి చిన్నప్పటి నుంచి కాటుక, మస్కారా లాంటివి రాస్తేనే కళ్లు పెద్దగా అవుతాయి అని నమ్ముతారు. కానీ.. అందులో ఎలాంటి నిజం లేదు. అంతేకాదు.. కాటుక పెడితే పిల్లలు ఎక్కువ సేపు నిద్రపోతారని అనుకుంటారు. కానీ... అందులో కూడా ఎలాంటి నిజం లేదు. అవిలేకపోయినా కూడా పిల్లలు నిద్రపోతారనే విషయం తెలుసుకోవాలి.