చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం

ప్రపంచ బ్యాడ్మింటన్ విజేతగా తెలుగు తేజం పీవీ. సింధు నిలిచింది. ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ ఒకుహురాను ఓడించింది
 

World Badminton Championships 2019: PV Sindhu beats Nozomi Okuhara

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో తెలుగు తేజం తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది.  ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించి విజేతగా నిలిచింది. సింధు 21-7, 21-7 పాయింట్లతోఒకుహురాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస సెట్లను గెలుచుకుని విజయాన్ని అందుకుంది. కేవలం 36 నిమిషాల్లోనే సింధు విజయయాత్ర ముగియడం విశేషం. 

ఈ మ్యాచ్ ఆరంభంనుండి సింధు దూకుడుగా ఆడుతూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దీంతో మొదటి రౌండ్ ను 21-7 పాయింట్ల తేడాతో గెలుచుకుంది. రెండో రౌండ్లో కూడా ఏ మాత్రం దూకుడు తగ్గించని సింధు సేమ్ ఫలితాన్ని రాబట్టింది. దీంతో 21-7, 217 తేడాతో ఓడించి మొదటిసారి వరల్డ్ ఛాంపియన్ షిప్ ను చేజిక్కించుకుంది. 

ప్రస్తుతం వరల్డ్ ర్యాకింగ్స్ లో ఐదో స్థానంలో నిలిచిన సింధు వరల్డ్ ఛాపింయన్ గా నిలిచింది. ఇలా మొదటిసారి ఈ టోర్నమైంట్ లో  గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.  

ఈ విజయం అనంతరం సింధు మీడియాతో తన ఆనందాన్ని పంచుకుంది. ''ఈ మెడల్ ను మా అమ్మకు అంకితమిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఆమె పుట్టినరోజు.  తన విజయం ఆమెనెంతో ఆనందించేలా చేసింది. కాబట్టి పుట్టినరోజు గిప్ట్ గా ఈ మెడల్ ను అంకితమిస్తున్నా.'' అని సింధు వెల్లడించింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios