Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్: భారత్ సహా ప్రపంచదేశాలు ఉగ్రవాదంపై ఎలా వ్యవహరించాలి?

2019 ఏప్రిల్ 21న శ్రీలంకలో చోటుచేసుకున్న ఈస్టర్ బీభత్సం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో జరిగిన అడపాదడపా ఘటనలు మినహాయిస్తే మోసుల్, రక్కాలలో ఐఎస్‌ను ఓడించిన తర్వాత వ్యవస్థీకృత ఉగ్ర దాడులు జరగలేవు. ఈ కాలంలో ఇతర ప్రాంతాల్లో నెలకొన్న శాంతియుత వాతావరణం అందరిలో ఒక భావన తెచ్చింది. ఉగ్రవాదంపై పోరు ముగిసిందని, ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముఠాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించామనే అభిప్రాయం ఏర్పడింది. కానీ, జమ్ము కశ్మీర్ ప్రజలకు నేను ఎప్పుడూ ఒక పాతకాలపు సామెత చెబుతుండేవాడిని. హింస కనిపించడం లేదంటే శాంతి ఉన్నట్టు కాదని వివరించేవాడిని.

rapid changes in afghanistan made india and world need to worry more about terror
Author
New Delhi, First Published Sep 7, 2021, 3:11 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఉగ్రవాద సంస్థలపై చాలా ఏళ్లుగా పేపర్‌లపై అలాగే, క్షేత్రస్థాయిలో నేను చేసిన అధ్యయనం నాకో విషయాన్ని నేర్పింది. అవి ఎప్పుడూ అనూహ్యంగా ఒక భారీ సందేశాన్ని ఇవ్వాలని తహతహలాడుతుంటాయి.

సిరియా, ఉత్తర ఆఫ్రికా నుంచి వలసలను ప్రారంభించిన స్వల్ప వ్యవధిలోనే ఇస్లామిక్ స్టేట్ యూరప్ దేశాల్లో భారీగా ఉగ్రకార్యకలాపాలకు పూనుకుంది. ఇటీవలే కాబూల్ నుంచి యూఎస్, కెనడా, యూరప్‌ దేశాలకు పెద్దస్థాయిలో వలసలు జరిగాయి. ఇందులో చాలా మంది ఎలాంటి పరిశీలనలు చేసుకోకుండానే బయటి దేశాలకు వెళ్లారు. వీరిని పరిశీలించడానికి దీర్ఘకాలం నిర్బంధంలో ఉంచాల్సి రావొచ్చు. ఫలితంగా మానవ హక్కుల సంఘాలు వారిని విడుదల వెంటనే విడుదల చేయాలని నిరసనలు చేయవచ్చు. కొంతమంది ఎలాంటి పరీక్షలు ఎదర్కోకుండానే విడుదల కావొచ్చు. అంటే, భవిష్యత్‌లో విపత్కర పరిస్థితులకు అవకాశముందని ఇప్పుడే ఒక అంచనాకు రావచ్చునా? ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థల అదనపు వనరులు ఈ రూపకంగా విదేశీ గడ్డలకు చేరే అవకాశముందని భావించవచ్చునా? ఈ అనుమానాలను బలపరిచే కొన్ని హేతువులు ఉన్నాయి.

2019 ఏప్రిల్ 21న శ్రీలంకలో చోటుచేసుకున్న ఈస్టర్ బీభత్సం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో జరిగిన అడపాదడపా ఘటనలు మినహాయిస్తే మోసుల్, రక్కాలలో ఐఎస్‌ను ఓడించిన తర్వాత వ్యవస్థీకృత ఉగ్ర దాడులు జరగలేవు. ఈ కాలంలో ఇతర ప్రాంతాల్లో నెలకొన్న శాంతియుత వాతావరణం అందరిలో ఒక భావన తెచ్చింది. ఉగ్రవాదంపై పోరు ముగిసిందని, ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముఠాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించామనే అభిప్రాయం ఏర్పడింది.

కానీ, జమ్ము కశ్మీర్ ప్రజలకు నేను ఎప్పుడూ ఒక పాతకాలపు సామెత చెబుతుండేవాడిని. హింస కనిపించడం లేదంటే శాంతి ఉన్నట్టు కాదని వివరించేవాడిని. బయటికి హింస కనిపించకున్నా అంతర్గతంగా దాని కార్యకలాపాలు జరుగుతూనే ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే సామెత వర్తిస్తుంది. ఉగ్రవాద సంస్థలకు అపారమైన శక్తి, ఓపికలున్నాయి. స్లీపర్ సెల్స్ అండర్ కవర్‌లో సురక్షితంగా ఉన్నంతవరకు, అవి ఉగ్రవాద సంబంధాలను కాపాడినంత కాలం ఉగ్రవాద సంస్థలు ఏళ్ల తరబడి నిద్రాణంగా ఉండగలవు. మళ్లీ అవి తమ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఎంతో కాలం పట్టదు. ఇందులో నేటి ఎలక్ట్రానిక్ కనెక్టివిటీ వాటికి మరింత కలిసివస్తుంది.

ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్‌లోని గందరగోళ పరిస్థితులు నిద్రాణంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు పునరుత్తేజితం కావడానికి, వాటి నెట్‌వర్క్‌ను మరింత పెంచుకోవడానికి, పునరుజ్జీవనం గావించడానికి సరైన అవకాశాలను కల్పిస్తున్నది. అందువల్లే అల్‌ఖైదా మళ్లీ తెరమీద కనిపిస్తున్నది. తాలిబాన్ విజయంతో ఉత్తేజితం చెందుతున్నది. భారత్ నుంచి కశ్మీర్‌కు ‘విముక్తి’ కల్పించడానికి జిహాద్‌ను అక్కడి వరకు విస్తరించాలంటున్నది. తాలిబాన్, అల్ ఖైదా, అనేక పాకిస్తానీ గ్రూపులూ ఉచ్ఛస్థితికి రావాలని ఐఎస్ఐఎస్‌‌కు చెందిన ఐఎస్ ఖోరసాన్ భావిస్తున్నది. ఐఎస్ ఖోరసాన్ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) నుంచి దూరమైన కొన్ని శక్తులతో ఏర్పడింది. ఇప్పుడు టీటీపీతోనూ అనుసంధానంలో ఉన్నది.

ఐఎస్ఐ పర్యవేక్షణలో తాలిబాన్లకు సహకరించిన పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలు లష్కర్ ఈ తాయిబా, జైష్ ఈ మొహమ్మద్‌‌లు మరల తమ ప్రాముఖ్యతను పెంచుకున్నాయి. జైష్ ఈ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లారు. అధికారంలో ప్రాతినిధ్యం దక్కించుకోవడానికి తాలిబాన్ ఉన్నతులతో చర్చల్లో ఉన్నారు. 

ఒక ఉగ్రవాద శిబిరాన్ని నడపడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఈ వాతావరణం కల్పిస్తున్నది. విభిన్న విధాల విశ్వాసాలతో భావజాలం పొలిటికల్ ఇస్లాంను ప్రభావితం చేస్తుంది. మాదక ద్రవ్యాలపై స్వల్ప నియంత్రణతో వీటి ద్వారా ఆదాయాలనూ సులువుగా సంపాదించుకోవచ్చు. పొలిటికల్ ఇస్లాం ఉత్తేజితమవుతుండటంతో మానవ వనరులకూ కొదవ ఉండదు. ఇవన్నీ అనూహ్యస్థాయిలో కలిసివస్తాయి.

నిజానికి అసలైన లాభం మిలిటరీ హార్డ్‌వేర్ ద్వారా సమకూరనుంది. ముఖ్యంగా ఆధునిక రైఫిల్స్‌లు. ఇవి ఆరు లక్షల వరకు ఉండవచ్చు. హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హమ్వీలు, ఇతర పేలుడు సామగ్రిని తాలిబాన్లు వినియోగించుకోవచ్చు. కానీ, ఇందులో చాలా వంతు అక్రమ ఆయుధ వ్యాపారంలోకి చేరే అవకాశముంది. ఈ గ్రూప్‌నకు ఇదొక ఆదాయవనరుగా మారనుంది. నైట్ విజన్ డివైజ్‌లు, స్నైపర్ రైఫిళ్లు, 20వేల గ్రెనేడ్లు వారి అమ్ములపొదిలో అదనపు బలం. తాలిబాన్లు ప్రభుత్వ ఏర్పాటు, కాబూల్ రక్షణ, పంజ్‌షిర్ ప్రతిఘటనను ఎదుర్కోవడంపై ఫోకస్ పెట్టడంతోపాటు దాని నిర్హేతుకత్వ లక్షణం వంటి అంశాలు దాని పరిధికి ఆవల ఇతర ఉగ్రవాద సంస్థలు మరింత పుంజుకోవడానికి వీలుకలుగజేస్తాయి. 

స్వల్పస్థాయిలోనైనా సుస్థిరత సాధించేవరకు తాలిబాన్లు తమ ఉగ్రవాద కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేయవచ్చు. అమెరికాపై ఉగ్రదాడికి, అందుకు ప్రణాళికలు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్‌ను వినియోగించుకున్నందుకే అమెరికన్లు ఈ గడ్డపైకి వచ్చారన్న కారణాన్ని బహుశా వారు తెలుసుకోవచ్చు. అది సరిపోదు. అదే ముప్పు మరోసారి అమెరికా మిలిటరీ జోక్యాన్ని కొనితేవచ్చునని, వైమానిక దాడులకు పురికొల్పవచ్చని తెలుసుకుంటేనే ఫలవంతమైన అవగాహనగా అనవచ్చు. అమెరికన్లు మళ్లీ పరుగును ఆ దేశానికి వచ్చే అవకాశం లేదు. కానీ, అమెరికాలో భద్రతకు సవాల్ విసిరితే వారినెవ్వరూ ఆపలేరు. మళ్లీ వైమానిక దాడులు చేసి తాలిబాన్లను రాతియుగానికి పంపడానికి వారు వెనుకాడరు.

ఇవి దృష్టిలో పెట్టుకుని తాలిబాన్లు కొంత జాగ్రత్తగా నడుచుకోవచ్చు. కానీ, పాకిస్తాన్ కూడా అలాగే వ్యవహరిస్తుందా? పొలిటికల్ ఇస్లామ్‌ను నియంత్రించి దాని ద్వారా అందరి లక్ష్యాన్ని ఒకటిగా మార్చి ఇస్లాం ప్రపంచానికి తానే సారథ్యం వహించాలని, తద్వారా చివరికి భారత్ నుంచి జమ్ముకశ్మీర్‌ను లాక్కోవాలని 1977-80ల అది రూపొందించుకున్న తన బృహత్ వ్యూహాన్ని వదులుకుంటుందా? ఈ వ్యూహాన్ని పాతరేసి ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ఉనికిని శూన్యం చేసి జమ్ము కశ్మీర్‌ను భారతే వియవంతంగా నిర్వహించడానికి ఒప్పుకుంటుందా? వీటిని పాకిస్తాన్ అనుసరించకపోవచ్చని రెండు కారణాలు తెలియజేస్తున్నాయి.

అమెరికా బలగాల ఉపసంహరణ ఇక జరుగుతుందని 2012 నుంచి ప్రబలంగా విశ్వాసాలు వచ్చాయి. అప్పటి నుంచి పాకిస్తాన్ ఓపికిగా ఈ క్షణం కోసం ఎదురుచూసింది. రెండోది, జమ్ము కశ్మీర్ భారత్ నియంత్రణలో ఉండటం పాకిస్తాన్ అంతరంగానికి ఒప్పకపోవడం. నిజానికి పలు అంశాలు సరైన తీరులో కలిసివస్తే కశ్మీర్‌లో వేర్పాటువాద చిచ్చును రగుల్చవచ్చు. పాకిస్తాన్ ఐఎస్ఐ సాధారణంగా ఈ నెట్‌వర్క్‌ బలాన్నే నమ్ముతుంది.

జమ్ము కశ్మీర్‌లో లొంగిపోయిన తీవ్రవాదులతో కలిసి ఉన్న స్లీపర్ ఏజెంట్లు ఇప్పుడు ఎవరి నియంత్రణలో లేరు. ఉన్మాదాన్ని, అసంతృప్తిని రగిల్చే శక్తులు ఇప్పుడు మతపరమైన వ్యాపకాల్లో నిమగ్నమై ఉన్నాయి. వీటికితోడు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సోషల్ మీడియా ఉపయోగించే చేసే దుష్ప్రచారం వెంటనే పునరుత్తేజం కల్పించవచ్చు. అయితే, ఆ శక్తులకు ఈ సారి డబ్బు అందుబాటులో ఉండకపోవచ్చు, స్థానిక నియామకాలు అంత సులభంగా సాధ్యపడకపోవచ్చు, సరిహద్దు గుండా చొరబాట్లు దాదాపు అసాధ్యమే. వీటికి తోడు జమ్ము కశ్మీర్ ప్రభుత్వం సానుకూల సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది. ప్రముఖ ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడానికి, జాతీయ గీతాన్ని ఆలపించడానికి, స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి చేసిన సుదీర్ఘ కార్యక్రమాలు కుటిల శక్తుల ఆశలకు గండికొడుతున్నాయి. అయితే, ఉగ్రవాదం మళ్లీ పూర్వస్థితికి వెళ్లడం క్లిష్టమే, కానీ, అసాధ్యమని చెప్పలేం. యూరప్, యూఎస్‌లకు కలిసొచ్చే అంశమొకటి ఉన్నది. వాటి భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకునే కొన్నిదేశాల అండ ఉన్న ఉగ్రవాదులు లేరు. 

కానీ, భారత్ పరిస్థితి వేరు. మనం మరింత జాగరూకతగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకటికి మించి పలువిధాల ఉగ్రవాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం జమ్ము కశ్మీర్‌లోనే కాదు, ఇతర ప్రాంతాల్లోనూ ఈ ముప్పు ఉంటుంది. అంతేకాదు, కొన్ని అండలతో ఉన్న ఉగ్రవాదులున్నారు. పరోక్ష యుద్ధానికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐ డీజీ కాబూల్‌కు ముందస్తుగానే చేసిన పర్యటన తాలిబాన్ ప్రయోజనాల కోసంకాదు, ముఖ్యంగా పాకిస్తాన్ ప్రయోజనాల కోసమే. వారు భావించే ఈ ‘ప్రయోజనాలు’ ఎక్కడ ఉంటాయో మనకు తెలుసు.

-సయ్యద్ అతా హస్నైన్

రచయిత లెఫ్టనెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్. శ్రీనగర్ కేంద్రంగా పనిచేసిన 15 కార్ప్స్‌లో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా కొనసాగుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios