MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • నామినేషన్స్ లిస్ట్ లో టాప్ కంటెస్టెంట్స్, ఎవరు ఎలిమినేటైనా సంచలనమే!

నామినేషన్స్ లిస్ట్ లో టాప్ కంటెస్టెంట్స్, ఎవరు ఎలిమినేటైనా సంచలనమే!

12వ వారానికి టైటిల్ ఫేవరేట్స్ తో పాటు నలుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయినా సంచలనమే. ఆ లిస్ట్ ఏమిటో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 19 2024, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో 4 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, 6గురు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా హౌస్లో అడుగుపెట్టిన వారు. 11వ వారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది. నబీల్ తన వద్ద ఉన్న అవిక్షన్ షీల్డ్ అవినాష్ కోసం వాడాడు. దాంతో ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8


ఇక 12వ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ సోమవారం మొదలైంది. అనూహ్యంగా నామినేట్ చేసే బాధ్యత ఎలిమినేటైన కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు బిగ్ బాస్. బెజవాడ బేబక్క, సోనియా, శేఖర్ బాషా, మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు. 
 

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

కారణాలు చెప్పి ప్రతి ఒక ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఇద్దరు హౌస్ మేట్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేట్ చేసిన వారి తలపై షుగర్ బాటిల్ పగలగొట్టాలి. మెగా ఛీప్ గా ఉన్న అవినాష్ కి మినహాయింపు ఉంటుంది. అతన్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి గాను మోస్ట్ కాంట్రవర్సియల్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. ఆమె నిఖిల్, ప్రేరణలను నామినేట్ చేసింది. సోనియా నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది. ఆమె నిఖిల్ కి అత్యంత సన్నిహితురాలు. నిఖిల్, పృథ్విలతో ఆమె ప్రవర్తన నచ్చని ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు. 
 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

నిఖిల్ ని అంతగా అభిమానించే సోనియా బయటకు వెళ్లి వచ్చాక అతన్ని నామినేట్ చేయడం కొసమెరుపు. రెండో వారం ఎలిమినేటైన శేఖర్ బాషా.. యష్మి, ప్రేరణలను నామినేట్ చేశాడు. శేఖర్ బాషా పాయింట్స్ కి వారిద్దరి వద్ద సమాధానం లేకుండా పోయింది. వారి గేమ్ గమనిస్తున్న శేఖర్ బాషా స్ట్రాంగ్ పాయింట్స్ తో నామినేట్ చేశాడు. 


 

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బెజవాడ బేబక్క.. నిఖిల్, పృథ్విలను నామినేట్ చేసింది. ఇక మణికంఠ... నిఖిల్, నబీల్ లను నామినేట్ చేశారు. ఆదిత్య ఓం... ప్రేరణ, యష్మిలను నామినేట్ చేశారు. ఫైనల్ గా నైనిక... యష్మి, నబీల్ లను నామినేట్ చేసింది. ఈ క్రమంలో వాడి వేడి వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. మెజారిటీ మాజీ కంటెస్టెంట్స్ కన్నడ బ్యాచ్ ని టార్గెట్ చేశారు. 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8


నామినేషన్స్ ప్రక్రియ ముగియగా.. నిఖిల్, ప్రేరణ, యష్మి, నబీల్, పృథ్వి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయినా సంచలనమే అవుతుంది. నిఖిల్, నబీల్ టైటిల్ ఫేవరేట్స్ గా ఉన్నారు. ప్రేరణ, యష్మి, పృథ్విరాజ్ సైతం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ వారం నామినేషన్స్ నుండి తప్పుకున్నారు. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూడాలి.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Recommended image2
Suma Kanakala: కారు దిగి నడిరోడ్డు మీద పరిగెత్తిన యాంకర్ సుమ, కారణం ఏంటో తెలుసా?
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో చివరి సినిమా.. బ్యానర్ ను క్లోజ్ చేయబోతున్న నిర్మాత ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved