India  

(Search results - 3278)
 • Ashwin

  Cricket16, Oct 2019, 3:56 PM IST

  దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు: అశ్విన్ 9 వికెట్లు తీస్తే హర్భజన్ ఇక వెనక్కే

  స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానంలో ఉన్న హర్భజన్‌ను వెనక్కినెట్టేందుకు అశ్విన్‌ ప్రయత్నిస్తున్నాడు

 • joker movie

  News16, Oct 2019, 12:22 PM IST

  ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై జోకర్ దండయాత్ర

  ఇండియన్ సినీ మార్కెట్ గడిచిన పదేళ్లలో చాలానే పెరిగింది. దీంతో ఎప్పుడు లేని విధంగా హాలీవుడ్ లో తెరకెక్కిన ఇంగ్లీష్ సినిమాలు భారతీయ భాషల్లోకి అనువాదమవుతున్నాయి.  ఇక రీసెంట్ గా వచ్చిన జోకర్ సినిమా కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. 

 • benz

  News16, Oct 2019, 11:42 AM IST

  నేడు విపణిలోకి బెంజ్ ‘ఏఎంజీ’ ‘జీ350డీ’

  ఆఫ్ రోడ్డు వాహనంగా ఎఎంజీ మోడల్ కారును మెర్సిడెస్ బెంజ్ జీ 350 డీ కారును విపణిలోకి ప్రవేశపెట్టనున్నది. దీని ధర రూ.1.20 కోట్లు ఉంటుందని అంచనా. 3.0 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్ 282 బీహెచ్పీ, 600 ఎన్ఎం టార్చిని ఆవిష్కరిస్తుంది.

 • imf

  business16, Oct 2019, 11:25 AM IST

  భారత్ వృద్ధిలో నో చేంజ్: వరల్డ్ బ్యాంక్ మాటే ఐఎంఎఫ్ బాట

  అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ప్రపంచ బ్యాంకు బాటే పట్టింది. భారత్​ సహా, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై అందోళన వ్యక్తం చేసింది. 2019లో భారత వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్​ అంచనా వేసింది. ఈ సంవత్సరం వృద్ధి మందగించినా వచ్చే ఏడాది తిరిగి 7.0 శాతానికి వృద్ధి పుంజుకుంటుందని ఐఎంఎఫ్​ పేర్కొంది. ప్రపంచ బ్యాంకు మాత్రం భారత వ్రుద్దిరేటు ఆరుశాతానికే పరిమితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

 • Cricket16, Oct 2019, 7:39 AM IST

  బీజేపీలోకి గంగూలీ..? అమిత్ షా తో భేటీ రహస్యం ఏంటి..?

  ఇదిలా ఉండగా...భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చీఫ్ గా ఎన్నిక కావడం లాంఛనం కానుంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది

 • cricketers

  News15, Oct 2019, 3:14 PM IST

  గ్రౌండ్ లోనే కాదు.. సిల్వర్ స్క్రీన్ పై కూడా సిక్స్ లే..!

  ఇండియన్ క్రికెటర్లు చాలా మంది సినిమాల్లో కూడా కనిపించారు. కొందరు ఇష్టంతో సినిమాల్లో నటిస్తే.. మరికొందరు సరదా కోసం నటించేవారు. 

 • ఎందుకంటే ఈ వ్యాసం రాసింది స్వయానా ఆర్ధిక మంత్రి భర్త పరకాల ప్రభాకర్ కాబట్టి. ఆర్ధిక మంత్రేమో ఒక పక్క ఆర్ధిక పరిస్థితి బాగుందంటూ, తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్ధిక ప్రగతి పథంలో దేశం దూసుకుపోతుందని చెబుతుంటే, ఇలా ఆమె భర్త ఆర్ధిక వ్యవస్థ దిగజారిందనడంతో ఈ వ్యాసం వివాదాస్పదమయ్యింది.

  Opinion15, Oct 2019, 12:33 PM IST

  భర్త పరకాల వ్యాఖ్యలు: నిర్మలా సీతారామన్ కు చిక్కులు?

  ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో నిన్న ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్థికంగా దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా కనీసం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదనేది ఈ వ్యాసం సారాంశం. ఇలా దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న అమర్త్య సేన్ నుండి మొదలు ఎందరో ఆర్థికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి కేవలం ఈ వ్యాసమే ఎందుకింత హైలైట్ అయ్యింది? 

 • Shoaib Akhtar Virat Kohli

  Cricket15, Oct 2019, 12:24 PM IST

  విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తిన షోయబ్ అక్తర్

  న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన డబుల్ సెంచరీ ద్వారా దక్షిణాఫ్రికాపై జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ విజయం సాధించి రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్సు 137 పరుగుల తేడాతో విజయం సాధించి, మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. తద్వారా స్వదేశంలో 11 టెస్ట్ సిరీస్ లను వరుసగా గెలుచుకున్న ప్రపంచ రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది.

 • Red Magic 15

  News15, Oct 2019, 11:29 AM IST

  17న ఇండియాలోకి గేమింగ్ ‘రెడ్ మ్యాజిక్ 3ఎస్’

  అక్టోబర్ 17వ తేదీన భారతదేశ విపణిలోకి నూబియా రెడ్ మ్యాజిక్ 3 ఎస్ ఫోన్ రానున్నది. ఫ్లిప్ కార్ట్ ద్వారా మాత్రమే వినియోగదారులకు లభ్యం కానున్నది. గేమ్స్ ప్రధానంగా ఉన్న ఈ ఫోన్‌లో 48 ఎంపీల కెమెరా ఉంది.

 • ravishastri ganguly

  Cricket15, Oct 2019, 11:15 AM IST

  బిసిసిఐలో "దాదా" గిరి: గంగూలీతో వైరం, రవిశాస్త్రికి చిక్కులే

  ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టడం ఇక లాంఛనమే. బిసీసీఐ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ ఒక్కటే దాఖలైంది. బ్రిజేష్ పటేల్ పోటీ పడినప్పటికీ చర్చల ద్వారా, రాయబారాల ద్వారా గంగూలీ ఏకగ్రీవమయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఈ స్థితిలో బిసిసిఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎదుర్కునే సవాళ్లు, ఆయన చేపట్టే సంస్కరణలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.

 • Pranjal Patil

  NATIONAL15, Oct 2019, 7:50 AM IST

  జిల్లా కలెక్టర్ గా అంధురాలు.... అందరికీ ఆదర్శం ఈ ప్రాంజల్

  తిరువనంతపురం సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పట్టుదలతో కష్టపడి చదివి సాధించిన విజయాలు ఇవి. ఫలితంగా దేశంలోనే మొట్టమొదటి అంధ ఐఏఎస్‌ అధికారిణిగా ప్రాంజల్‌ రికార్డుల్లోకెక్కారు. 2018 నుంచి ఇప్పటివరకు ఎర్నాకుళంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు.

 • Cricket14, Oct 2019, 6:04 PM IST

  దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం: టీమిండియాపై సచిన్ ప్రశంసలు

  మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన పుణే టెస్టులో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరుసగా 11 సిరీస్ విజయాలు సాధించినందుకు అభినందనలు తెలిపారు. 

 • Nobel prize

  INTERNATIONAL14, Oct 2019, 3:45 PM IST

  ఆర్ధిక శాస్త్రంలో భారతీయుడికి నోబెల్: అభిజిత్ బెనర్జీ‌ని వరించిన పురస్కారం

  ఆర్ధిక శాస్త్రంలో భారతీయుడికి మరోసారి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో‌, మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది

 • world bank

  business14, Oct 2019, 1:51 PM IST

  భారత్‌ వృద్ధి అంతంతే: 6 శాతానికే పరిమితం అన్న ప్రపంచ బ్యాంక్

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వ్రుద్ధిరేటు అంతంత మాత్రమేనని ప్రపంచ బ్యాంకు తేల్చేసింది. నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్దీపన చర్యలు చేపట్టినా పెద్దగా పురోగతి ఉండక పోవచ్చునని, జీడీపీ వ్రుద్దిరేటు ఆరు శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. డిమాండ్ లేకపోవడమే దీనికి కారణమని.. అయితే వచ్చే ఏడాది నుంచి క్రమంగా పుంజుకోనున్నదని వెల్లడించింది.

 • airindia

  business14, Oct 2019, 12:57 PM IST

  సంక్షోభంలో ‘మహారాజా’: మాకుమ్మడి రాజీనామాలకు ఎయిరిండియా పైలట్లు?

  ప్రైవేటీకరణ అంచుల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియా సంస్థను వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వేతనాల పెంపు, పదోన్నతుల కల్పన విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పైలట్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చమురు సంస్థలకు భారీగా ఎయిరిండియా బకాయిలు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 18వ తేదీ వరకు బకాయిలు చెల్లిస్తామని హామీలు ఇచ్చింది ఎయిరిండియా.