Asianet News TeluguAsianet News Telugu

వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్


కేంద్ర ప్రభుత్వం  గత వారంలో ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ లో కొత్త పన్నులు, కొత్త పథకాలు లేవు. 
 

Viewpoint: Interim Budget 2024-2025  lns
Author
First Published Feb 8, 2024, 12:39 PM IST

న్యూఢిల్లీ: గత వారం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్ధిక సంవత్సరం  మధ్యంతర బడ్జెట్ ను  పార్లమెంట్ కు సమర్పించారు. మధ్యంతర బడ్జెట్ లో  కొత్త పన్నులు లేదా కొత్త రాయితీలు ప్రకటించకూడదు.ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రభుత్వం  పూర్తిస్థాయి బడ్జెట్ ను సమర్పించనుంది.  మధ్యంతర బడ్జెట్ గతానికి సంబంధించిన ఖాతా అవుతుంది. 

2014లోనే మధ్యంతర బడ్జెట్ వార్తగా మారింది. ఎందుకు? 2014-15లో పి.చిదంబరం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి రాయితీలు, ఖర్చులను ప్రకటించి వార్తల్లోకి ఎక్కింది. 2019-20 లో మోడీ ప్రభుత్వం కొత్త ఖర్చులను ప్రకటించింది.  దీంతో  మధ్యంతర బడ్జెట్ పై చర్చ మొదలైంది.

సంప్రదాయాలను పునరుద్దరించడం

మధ్యంతర బడ్జెట్‌లో కొత్త పన్నులు, రాయితీ ఖర్చులు మొదలైన వాటిని ప్రకటించవద్దని సంప్రదాయం వెనుక హేతుబద్దత ఏమిటంటే, ఎన్నికల ముందు పాలక ప్రభుత్వం, ఎన్నికల తర్వాత ప్రజలతో ఎన్నుకొన్న ప్రభుత్వంపై ఎటువంటి భారం మోపకూడదు. 2014లో  అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి పి. చిదంబరం మధ్యంతర బడ్జెట్ లో  పన్ను రాయితీలు ప్రకటించి మంచి సంప్రదాయానికి  బ్రేక్ వేశారు. ఈ విషయమై అప్పటి  ముఖ్యమంత్రి జయలలిత ఖండించారు.

2019లో మధ్యంతర బడ్జెట్ ను మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. సంప్రదాయాన్ని తుంగలో తొక్కి రైతులకు రాయితీలు ప్రకటించింది. 2014లో సంప్రదాయాన్ని కాంగ్రెస్ ఉల్లంఘించింది. 2019లో  మోడీ ప్రభుత్వం కూడ అదే పనిచేస్తే అభ్యంతరం చెప్పలేకపోయింది.  ఈ విషయాన్ని మీడియా కూడ విమర్శించలేదు.

మధ్యంతర బడ్జెట్  2024-25 సంప్రదాయాల ప్రకారం పన్ను రాయితీలు, ఖర్చులను నివారించింది.అయితే  ఈ మధ్యంతర బడ్జెట్ విమర్శల్లో కూడ ఖర్చును మినహాయించి లోటు తగ్గించి ప్రభుత్వం బాధ్యతాయుతంగా బడ్జెట్ ను సమర్పించిందన్న సాధారణ వ్యాఖ్య తప్ప..ఈ  మధ్యంతర బడ్జెట్  సంప్రదాయబద్దమైనదని ఎవరూ ఎత్తిచూపలేదు.  ఈ మధ్యంతర బడ్జెట్ సంప్రదాయాలకు కట్టుబడి ఉందని చెబుతూ ఆ మంచి సంప్రదాయాన్ని గుర్తు చేస్తున్నారు.

బడ్జెట్ 2024-25

 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో  కొత్త పథకాలు లేవు, కొత్త పన్నులు లేవు. రాయితీలు లేవు, ఖర్చులు లేవు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాన మంత్రి గృహనిర్మాణ పథకం కింద 3 కోట్లు నిర్మించారు. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకానికి  రూ. 80,600 కోట్లు కేటాయించారు.  ప్రస్తుత సంవత్సరంతో పోల్చితే రూ.1000 కోట్లు ఎక్కువ.  2019-20 బడ్జెట్ లో రైతులకు మోడీ ప్రభుత్వం ఎలాంటి రాయితీలు కల్పించలేదు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ విశ్వాసానికి అద్దం పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

10 ఏళ్ల పురోగతి

2024-25 మధ్యంతర బడ్జెట్  బీజేపీ తన 10 ఏళ్ల విజయాలను ప్రజలకు హైలైట్ చేయడానికి అవకాశంగా మారింది. 2004-14 వరకు  కాంగ్రెస్ పాలనతోనే  కాకుండా  అంతకుముందు పార్టీల పాలన ప్రగతితో పోలుస్తున్నారు.  ఈ అవకాశాన్ని బీజేపీ పూర్తిగా ఉపయోగించుకుంటుంది.

ఉదహరణలకు  1950 నుండి  2014 వరకు దేశంలో  16 ఏర్పాటు చేశారు. అయితే  1950-64 మధ్య ఏడు ఎయిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు.   2014 నాటికి దేశంలో  723 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు. మోడీ పాలనలో  390 ఏర్పాటు చేశారు.  1950-2014 వరకు  74 విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయి. అయితే మోడీ పాలనలో  కొత్తగా 74 విమానాశ్రయాలు ఏర్పాటు చేశారు.

 గత 64 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలు సాధించిన దానికంటే  మోడీ 10 ఏళ్లలో  ప్రగతిని సాధించిన విషయాన్ని బీజేపీ పేర్కొంది.   మరో వైపు  గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పదేళ్ల పాలనతో పోలిస్తే  ఆదాయం మూడు రెట్లు పెరిగిందని గుర్తు చేస్తున్నారు.అంతేకాదు  2014లో  పేదలు 29 శాతం నుండి  11.3 శాతానికి తగ్గింది. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  చెప్పారు.

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రభుత్వ పెట్టుబడి 2014లో 4 శాతం నుండి 2022-23 లో  18 శాతానికి పెరిగింది.ఉన్నత విద్యను అభ్యసించే మహిళల సంఖ్య 28 శాతానికి పెరిగింది. సైన్స్ టెక్నాలజీ విద్యను అభ్యసించే మహిళల సంఖ్య 43 శాతంగా పెరిగినట్టుగా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
మహిళా వ్యాపారుల సంఖ్య 50 శాతం పెరిగింది.  43 కోట్ల మందికి  రూ. 22.5 లక్షల కోట్ల ముద్రా రుణాలు అందించారు. 10 కోట్ల కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్, 11 కోట్ల ఇళ్లకు మరుగు దొడ్ల నిర్మాణం, ఉజాలా పథకం కింద గృహాలకు 38 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు అందించారు. ఎల్‌ఈడీ బల్బులు తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. వీధి దీపాల కోసం  1.3 కోట్ల ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లను కేటాయించారు. 1.4 కోట్ల మంది యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, స్వయం సహాయక సంఘాల ద్వారా కోటి మంది మహిళలకు 83 లక్షల రుణాలిచ్చారు.  78 లక్షల మంది వీధి వ్యాపారులకు క్రెడిట్ ఇచ్చారు. 11.8 కోట్ల మంది రైతులకు  రూ. 2.81 లక్షల కోట్లను డీబీటీ ద్వారా చెల్లించారు. ఇతర పథకాల కింద లబ్దిదారులకు రూ.2.7 లక్షల కోట్లు పంపిణీ చేశారు. కరోనా తర్వాత  నిరుద్యోగం  6.1 శాతం నుండి 3.2 శాతానికి తగ్గిందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

బడ్జెట్ పై డిబేట్ పై  బీజేపీ విజయానికి సంబంధించిన ప్రచారంగా మారింది.  2014 లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో  10వ ర్యాంకులో ఉన్న భారత్   పదేళ్లో బ్రెజిల్, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీలను అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది.   20 ఏళ్ల వార్షిక వృద్ది సంఖ్యలలో  భారత దేశం చైనాను అధిగమించింది. 

also read:అయోధ్య రామమందిరం : గుడిని వ్యతిరేకించినవారిని ఇబ్బందుల్లో పడేసిన రామయ్య.. చిక్కుల్లో I.N.D.I.A...

ప్రపంచంలోని 22 మంది  అత్యంత ముఖ్యులైన నాయకులలో  నరేంద్ర మోడీ అత్యంత ప్రజాదరణ పొందారు. ప్రముఖ అమెరికన్ మార్నింగ్ కన్సల్ట్ రీసెర్చ్ అర్గనైజేషన్ గత ఐదేళ్లుగా ఇదే విషయాన్ని చెబుతుంది. ప్రత్యర్ధి పార్టీలు ఆయనను ఎంతగా దూషిస్తే అంత పాపులర్ అవుతాడు. ఇది అలుపెరగని కృషి, మోడీ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాల వల్లనే అనే విషయాన్ని గ్రహించాలి.దీని వల్ల భారతదేశానికి మేలు జరుగుతుంది.    

Note to the Reader: This article originally appeared in Thuglak Tamil Weekly Magazine. It was translated into English by Thuglak Digital for www.gurumurthy.net. It has been reproduced in Asianet News Network.

Follow Us:
Download App:
  • android
  • ios