Jammu Kashmir  

(Search results - 240)
 • one police shot dead by a terrorist in jammu kashmir

  NATIONALSep 12, 2021, 4:01 PM IST

  జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఒక పోలీసు అధికారి దుర్మరణం

  జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రకలకలం రేగుతున్నది. ఉగ్రవాద చర్యలు శృతిమించుతున్నాయి. తాజాగా, ఓ పోలీసు అధికారిని గుర్తుతెలియని ఓ టెర్రరిస్టు తుపాకీతో కాల్చి చంపాడు. శ్రీనగర్‌లోని ఖాన్యర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 • Iam myself a Kashmiri pandit says congress MP rahul gandhi

  NATIONALSep 10, 2021, 3:15 PM IST

  నేను స్వయంగా కశ్మీరీ పండిత్‌.. జమ్ము కశ్మీర్ పర్యటనలో రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

  జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ తాను స్వయంగా కశ్మీర్ పండిత్ అని తెలిపారు. తన కుటుంబానికి జమ్ము కశ్మీర్‌తో సుదీర్ఘమైన సంబంధమున్నదని వివరించారు. తన కశ్మీరీ పండిత్ సహోదరుల కోసం ఏమైనా చేస్తానని హామీనిచ్చారు. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్రహోదా వెనక్కి ఇవ్వాల్సిందేనని అన్నారు.
   

 • rapid changes in afghanistan made india and world need to worry more about terror

  OpinionSep 7, 2021, 3:11 PM IST

  ఆఫ్ఘనిస్తాన్: భారత్ సహా ప్రపంచదేశాలు ఉగ్రవాదంపై ఎలా వ్యవహరించాలి?

  2019 ఏప్రిల్ 21న శ్రీలంకలో చోటుచేసుకున్న ఈస్టర్ బీభత్సం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో జరిగిన అడపాదడపా ఘటనలు మినహాయిస్తే మోసుల్, రక్కాలలో ఐఎస్‌ను ఓడించిన తర్వాత వ్యవస్థీకృత ఉగ్ర దాడులు జరగలేవు. ఈ కాలంలో ఇతర ప్రాంతాల్లో నెలకొన్న శాంతియుత వాతావరణం అందరిలో ఒక భావన తెచ్చింది. ఉగ్రవాదంపై పోరు ముగిసిందని, ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముఠాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించామనే అభిప్రాయం ఏర్పడింది. కానీ, జమ్ము కశ్మీర్ ప్రజలకు నేను ఎప్పుడూ ఒక పాతకాలపు సామెత చెబుతుండేవాడిని. హింస కనిపించడం లేదంటే శాంతి ఉన్నట్టు కాదని వివరించేవాడిని.

 • no normalcy in jammu kashmir, Iam under house arrest claims Mehbooba Mufti

  NATIONALSep 7, 2021, 12:17 PM IST

  కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. నన్ను గృహనిర్బంధం చేశారు: మాజీ సీఎం ముఫ్తీ

  జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, వేర్పాటువాద నేత గిలానీ మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సహా పలు ఆంక్షలను ఎత్తేసినట్టు జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. కానీ, ఈ వాదనను తప్పుపడుతూ జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, తనను గృహనిర్బంధం చేశారని వెల్లడించారు.

 • centre to send at least 70 ministers to jammu kashmir for a new outreach programme

  NATIONALSep 3, 2021, 4:12 PM IST

  జమ్ము కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. అక్కడికి 70 మంది కేంద్ర మంత్రులను పంపనున్న ప్రభుత్వం

  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్ ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కనీసం 70 మంది కేంద్ర మంత్రులను జమ్ము కశ్మీర్ పర్యటనకు పంపనుంది. వీరంతా అక్కడి ప్రజలు, అధికారులు, ప్రముఖలతో చర్చలు జరిపి కేంద్ర హోం శాఖ, పీఎంవోకు తమ నివేదికను సమర్పించనున్నారు.

 • pakistna PM imran khan blames india using with Hurriyat leader Syed Ali Geelan death gets sharp counter from congress leader abhishek manu singhvi

  NATIONALSep 2, 2021, 1:54 PM IST

  వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ మరణం సాకుగా భారత్‌పై పాకిస్తాన్ బురదజల్లే యత్నం

  వేర్పాటువాద నేత, హురియత్ లీడర్ సయ్యద్ అలీ గిలానీ మరణాన్ని సాకుగా చూపి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై బుదరజల్లే పనిచేశారు. కశ్మీరీల స్వయం నిర్ణాయధికారం సహా వారి హక్కుల కోసం పోరాడిన సయ్యద్ అలీ గిలానీని భారత ప్రభుత్వం వేధించిందని ట్వీట్ చేశారు. గిలానీ మరణానికి సంతాపం ప్రకటిస్తూ పాకిస్తాన్ జాతీయ జెండాను సగం మేరకు అవనతం చేయనున్నట్టు తెలిపారు. అమాయకపు కశ్మీరీలను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్, దాని ముసుగుదారులందరూ చరిత్రలో కలిసిపోతారని కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీ గట్టి కౌంటర్ ఇచ్చారు.

 • al qaeda says kashmir should liberated from islam enemies in its congratulatory note to taliban after US forces withdraw

  INTERNATIONALSep 1, 2021, 1:21 PM IST

  కశ్మీర్‌కు స్వేచ్ఛ కల్పించాలి: తాలిబాన్లకు అల్ ఖైదా స్టేట్‌మెంట్

  ఆఫ్ఘనిస్తాన్‌ను అమెరికా సేనలు ఉపసంహరించుకున్న తర్వాతి రోజు తాలిబాన్లకు అల్ ఖైదా అభినందనలు తెలిపందే. ఇదే ప్రకటనలో కశ్మీర్‌కు విముక్తి కల్పించాలని తెలిపింది. ఇస్లాం వ్యతిరేకుల సంకెళ్ల నుంచి కశ్మీర్ సహా సోమాలియా, ది లెవాంట్, పాలస్తీనా ఇతర ప్రాంతాలకు స్వేచ్ఛ కల్పించాలని పేర్కొంది.
   

 • jasihe mohammad chief masood azhar reportedly sought taliban help in jammu kashmir says sources

  INTERNATIONALAug 27, 2021, 7:22 PM IST

  కశ్మీర్‌లో ఉగ్రవాదానికి సహకరించండి? తాలిబాన్లను కలిసిన జైషే మొహమ్మద్ సంస్థ చీఫ్

  ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లి ప్రయాణికులకు బదులుగా మన దేశం నుంచి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఉగ్రవాదులు విడిపించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి రాగానే మసూద్ అజర్ కాందహార్ చేరుకుని అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నట్టు సమాచారం.
   

 • three jaishe terrorists killed in an encounter in south kashmir's  pulwama

  NATIONALAug 21, 2021, 1:13 PM IST

  కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు హతం

  జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్ ఏరియాలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.

 • slain terrorist burhan wani's father unfurls national flag

  NATIONALAug 15, 2021, 2:17 PM IST

  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కరడుగట్టిన టెర్రరిస్టు తండ్రి

  హిజ్బుల్ ముజాహిదీన్‌కు పోస్టర్ బాయ్‌గా పేరొందిన, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించిన బుర్హన్ వనీ తండ్రి ముజఫర్ వనీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2016లో ఓ ఎన్‌కౌంటర్‌లో బుర్హన్ వనీ మరణించినప్పుడు కాశ్మీర్ లోయ అట్టుడికింది. కొన్ని నెలలపాటు యువత అరాచకం సృష్టించింది.

 • Lashkar terrorist killed at Kulgam in Jammu kashmir

  NATIONALAug 13, 2021, 12:26 PM IST

  జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: లష్కరేతోయిబా టెర్రరిస్ట్ మృతి, నలుగురికి గాయాలు


  కుల్‌గామ్ జిల్లాలోని ఖాజీగుండ్ ప్రాంతంలోని జమ్మూ -శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న మల్బోరా వద్ద బీఎస్ఎప్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు.

 • Pulwama attack key conspirator, aide killed in Jammu and Kashmir lns

  NATIONALAug 1, 2021, 1:06 PM IST

  జమ్మూలో ఎన్‌కౌంటర్: పుల్వామా దాడి ఘటనలో కీలకపాత్రధారి లంబూ సహా అనుచరుడి మృతి

  ఎస్‌పీఓ ఫయాజ్ అహ్మద్ ఆయన భార్యను కూడ కాల్చి చంపిన ఘటనలో లంబూ నిందితుడని  పోలీసులు చెప్పారు.లంబూ  ఎల్ఈడీలు తయారీ చేయడంలో దిట్టగా పోలీసులు చెప్పారు. దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో లంబూ  చాలా కాలంగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు.  భద్రతాదళాలపై పలు దాడుల్లో లంబూ కీలక నిందితుడని పోలీసులు ఈ సందర్భంగా గుర్తు చేశారు

 • NIA arrested izhaar in darbhanga blast lns

  NATIONALJul 26, 2021, 3:12 PM IST

  దర్భాంగా పేలుడులో కీలక పరిణామం: జమ్మూలో మరొకరి అరెస్ట్


  పాకిస్తాన్  కు చెందిన లష్కరే తోయిబా కీలక నేత ఇక్బాల్ తో ఇజార్‌ సంప్రదింపులు జరిపేవాడని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇజార్ ను అరెస్ట్ చేసిన  పోలీసులు పాట్నాలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో విచారణ చేసేందుకుగాను కస్టడీకి అనుమతించాలని  కోర్టులో ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

 • telugu jawan death in jammu kashmir encounter akp

  Andhra PradeshJul 9, 2021, 10:41 AM IST

  ఉగ్రమూకలతో వీరోచిత పోరాటం... జమ్మూకాశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం

  దేశ రక్షణలో భాగంగా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదులతో తలపడ్డ ఓ తెలుగు జవాన్ వీరమరణం పొందాడు. 

 • Army Jawan Killed in Encounter with Militants in J K's Pulwama - bsb

  NATIONALJul 2, 2021, 12:05 PM IST

  జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఆర్మీ జవాన్ మృతి..!

  శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.