రైల్వే ప్లాట్ ఫారం టిక్కెట్ల ధర 50కి పెంపు: మొదటికే మోసం, అడ్డదార్లు ఇవీ...
ఇక భారతీయ రైల్వే శాఖ కరోనా వైరస్ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకుంది దేశంలోని దాదాపుగా 250 స్టేషన్లలో ప్లాట్ ఫారం టికెట్ ధరను 10 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచారు. ఇలా ప్లాట్ ఫారం టికెట్ ధరను పెంచినంత మాత్రాన ప్రజల జనసమ్మర్దత తగ్గుతుందా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న.
కరోనా కరాళ నృత్యానికి ప్రపంచమంతా విలవిల్లాడిపోతోంది. అన్ని దేశాలు, ప్రజలు కుల మత వర్ణ బేధాలు లేకుండా చివురుటాకుల్లా వణికి[పోతున్నారు. ప్రభుత్వాలన్నీ ఇంకా మందు కూడా లేని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ప్రజల కదలికలపై ఆంక్షలువై విధిస్తు తమ పరిధిలోని చర్యలన్నింటిని చేయగలిగినంత మేర చేస్తుంది.
భారతదేశంపై కూడా కరోనా పంజా బలంగా పడింది. ఇప్పటికే ఒకరకంగా భారతదేశమంతటా షట్ డౌన్ వాతావరణం కనబడుతుంది. కరోనా మహమ్మారి దెబ్బకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయ్యాయి.
Also read: కరోనాకు వ్యాక్సిన్ : మనుషులపై ‘‘mRNA-1273’’ ట్రయల్స్ ప్రారంభం
ఇక భారతీయ రైల్వే శాఖ కరోనా వైరస్ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకుంది దేశంలోని దాదాపుగా 250 స్టేషన్లలో ప్లాట్ ఫారం టికెట్ ధరను 10 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచారు. ఇలా ప్లాట్ ఫారం టికెట్ ధరను పెంచినంత మాత్రాన ప్రజల జనసమ్మర్దత తగ్గుతుందా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న.
మనదేశంలో ఎన్ని స్టేషన్లలో ప్లాట్ ఫారం టిక్కెట్లు కొంటున్నారు అనేది ప్రధాన ప్రశ్న. మెట్రో నగరాల్లో ఉన్నంత కట్టుదిట్టంగా వేరే నగరాల్లో చెకింగ్ ఉండదు. దక్షిణాదిలో ఉన్నంత స్ట్రిక్ట్ చెకింగ్ మనకు ఉత్తరాదిలో కనబడదు.
ఇది ఇలా ఉంచితే.... ప్లేట్ ఫారం టికెట్ ను 50 రూపాయలు చెల్లించి కొనుక్కునే బదులు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎం ఎం టి ఎస్ టికెట్ ను కొంటె సరిపోతుంది కదా! దాని ధర 5 రూపాయలు మాత్రమే! వాస్తవానికి ప్లాట్ ఫారం టికెట్ ధర కన్నా తక్కువ.
మరి లోకల్ ట్రైన్స్ లేకపోతే... ఆ అక్కడికే వస్తున్నాను. ఏదైనా ఒక పాసెంజర్ రైలుకి నెక్స్ట్ స్టేషన్ టికెట్ కొనుక్కోండి. అప్పుడు ఎవరు ఆపగలరు? ఒక ప్రయాణీకుడు గనుక చేయాలనుకుంటే ఏమైనా చేయగలడు.
Also read: కరోనా ఎఫెక్ట్: పూర్తి స్థాయి షట్ డౌన్ దిశగా భారత్, ఎక్కడికక్కడ కట్టడి
ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలు చేయాల్సింది రేట్లను పెంచడం కాదు. ప్రజల్లో మరింత అవగాహన పెంచడం. ప్రజలే తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అవసరముంటే తప్ప రావడం లేదు. బస్సులు వెలవెల బోతున్నాయి. రైల్వే స్టేషన్ల పరిస్థితి కూడా ఇదే!
ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రజలకు మేలు చేయాలి అనుకుంటే... థర్మల్ స్కానర్లు పెట్టి ప్రజలను స్క్రీనింగ్ చేస్తే మంచిది. అప్పుడు ఎవరైనా తెలియకుండా ఆ వైరస్ బారినపడ్డ కూడా కనుక్కునే ఆస్కారం ఉంటుంది.
ఇంత పెద్ద భారతదేశంలో టెస్టింగ్ కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. హ్యాండ్ శానిటైజర్లు కొరత కనబడుతుంది. ఈ అన్ని పరిస్థితులను కూడా అడ్రస్ చేయాలి. ప్రజలను బయట తిరగొద్దని చెప్పడం అత్యంత అవసరం. కానీ దానికి ఇలా రేట్లు పెంచడం మాత్రం ఆన్సర్ కాదు.