పుష్ప vs పుష్ప 2 : రెండు సినిమాల మధ్య నాలుగు తేడాలు.. అవేంటో తెలుసా
Pushpa vs Pushpa 2: 'పుష్ప: ది రైజ్' అఖండ విజయంతో 'పుష్ప-2' పై అంచనాలు కొత్త శిఖరాలను తాకాయి. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న అద్భుతమైన కథాంశాలు, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో 'పుష్ప-2' విడుదలకు సిద్ధంగా ఉంది.
allu arjun movie pushpa 2
Pushpa vs Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ భారత సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పుష్ఫ ది రైజ్ సూపర్ హిట్ తో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే విడుదల తేదీని ప్రకటించిన మూవీ యూనిట్.. ట్రైలర్ ను విడుదల చేయగా రికార్డుల మోత మోగిస్తోంది. ట్రైలర్ తోనే మళ్లీ అల్లు అర్జున్ పుష్ప మేనియా తీసువచ్చాడు.
తగ్గేదే లే అంటూ మరోసారి నిరీక్షణ తెరదించుతూ ట్రైలర్ తో మూవీ లవర్స్ ఉత్సాహాన్ని నింపాడు. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే, పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ ఈ రెండు సినిమాల్లో కూడా వాటి గ్రిప్పింగ్ కథనాలు, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలున్నాయి. అయితే, ఈ రెండు చిత్రాల మధ్య చాలా తేడాలే ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం..
Pushpa 2 Movie
పుష్ప vs పుష్ప 2: తారాగణం-పాత్రలు
పుష్ప: ది రైజ్‌లో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించాడు. దారుణ పరిస్థితుల నుంచి పైకి ఎదుగుతాడు. ఈ పాత్ర చిత్రణ, అందులో అల్లు అర్జున్ నటన విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం అందించింది. ఇక హీరోయిన్ రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో తన పాత్రకు తగిన న్యాయం చేసింది. కథాంశానికి భావోద్వేగ అంశాలను అందించింది. సునీల్ తో పాటు భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర, ఫహద్ ఫాసిల్ లు తమ పాత్రలకు జీవం పోశారని చెప్పాలి. వారి అద్భుత నటన ఈ చిత్రాన్ని మరో రేంజ్ కు తీసుకెళ్లింది.
పుష్ప 2: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వారి పాత్రలతో మరోసారి తిరిగి రావడం పుష్ప రూల్ లో డబుల్ ధమాకా అని సినీ వర్గాల టాక్. అయితే, సీక్వెల్ పాత్రల నేపథ్యాలు, ప్రేరణలను లోతుగా పరిశోధించి, మరింత క్లిష్టమైన, విస్తారమైన కథనంతో ముందుకు సాగుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. సహాయక తారాగణంలో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. కథకు తాజా డైనమిక్స్‌ని తీసుకువస్తూ.. జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌లు కీలక పాత్రల్లో పుష్ప 2లో కనిపించనున్నారు.
Sreeleela remuneration for pushpa 2 song kissik allu arjun fahadh faasil sukumar
పుష్ప vs పుష్ప 2: అదరిపోయే సంగీతం.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్
పుష్ప: ది రైజ్ సంగీతం దాని విజయంలో కీలక పాత్ర పోషించింది, దేవి శ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్ పవర్ ను మరోసారి చూపిస్తూ.. హిట్ కొట్టింది. దక్కో దక్కో మేక, శ్రీవల్లి, ఊ అంటావా వంటి పాటలు చార్ట్‌బస్టర్‌లు మాత్రమే కాకుండా సినిమా కథాకథనానికి అంతర్లీనంగా ఉన్నాయి.
పుష్ప 2: ది రూల్ కోసం, దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా మరోసారి తిరిగి వచ్చాడు. పుష్ప ది రైజ్ లో తన సంగీతంతో మాయాజాలం వేసిన దేవిశ్రీ మరోసారి అదే టార్గెట్ గా బాణం వేశాడు. సినిమా కఠినమైన, తీవ్రమైన పరిస్థితుల వాతావరణంతో ప్రతిధ్వనించే కొత్త ట్రాక్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ అదరగొట్టలాడు. పుష్పలో ఊ అంటావాతో సమంత రూత్ ప్రభు అదరగొడితే.. పుష్ప 2లో శ్రీలీల నటించిన ఐటెం నంబర్ కనిపిస్తుంది.
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2
పుష్ప vs పుష్ప 2: బడ్జెట్ అండ్ బుజినెస్ ఎలా ఉంది?
పుష్ప: ది రైజ్ దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అల్లు అర్జున్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చింది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ రికార్డుల మోత మోగించింది. ఈ భారీ పెట్టుబడి సరైన నిర్ణయమని ఈ విజయం రుజువు చేసింది. ఇది ఆ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
పుష్ప 2: ది రూల్ వాటాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. సీక్వెల్ కోసం బడ్జెట్ రెట్టింపు అయింది. ఏకంగా రూ. 500 కోట్లు బడ్జెట్ అనే టాక్ నడుస్తోంది. విస్తృతమైన సెట్‌లు, క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్సులు, లెటెస్ట్ విజువల్ ఎఫెక్ట్‌ల కోసం భారీగా ఖర్చు చేసినట్టు సమాచారం.
actor allu arjun movie pushpa 2 new poster out now, trailer, fahadh faasil
పుష్ప vs పుష్ప 2: నేపథ్యం.. కథనం ఏమిటి?
పుష్ప: ది రైజ్ క్రిమినల్ అండర్ వరల్డ్‌లో పుష్ప రాజ్ ఎదిగే తీరుపై దృష్టి పెట్టిన సంగతి తెలిసందే. అయితే, సీక్వెల్ అతని కొత్త శక్తి, ఈ మార్కెట్ లో తన పవర్, వసూళ్లను హైలెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కథనం పుష్పా ప్రపంచాన్ని నిర్వచించే శక్తి డైనమిక్స్ తో పాటు మరింత లోతైన ప్రయాణాన్ని చూపెట్టనుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి పుష్ప 2 రానుంది. మరీ సారి అల్లు అర్జున్ యాక్షన్ మూవీ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలంటే అప్పటివరకు వేచిచూడాల్సిందే !