MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ‘కంగువ’:చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా నష్ట నివారణా చర్యలు

‘కంగువ’:చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా నష్ట నివారణా చర్యలు

వీకెండ్ కూడా గడిచిపోయింది. ఇప్పటికే మౌత్ టాక్ అంతటా స్ప్రెడ్ అయ్యిపోయింది.  రిలీజ్ కు ముందే చూసుకుని ఈ ట్రిమ్మింగ్ నిర్ణయం తీసుకుని ఉంటే ఇంత బ్యాడ్ టాక్ అయితే వచ్చేది కాదంటున్నారు.

2 Min read
Author : Surya Prakash
Published : Nov 19 2024, 06:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Kanguva

Kanguva

కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందు భారీగా బజ్ క్రియేట్ చేస్తాయి. సినిమా రిలీజయ్యాక ఆ స్దాయిని చాలా వరకూ అందుకోలేక చతికిల పడతాయి. అలా రీసెంట్ గా భారీ బిల్డప్ తో వచ్చిన చిత్రం కంగువా. సూర్య (Suriya) హీరోగా ‘సిరుతై’ శివ (Siva) దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ (Kanguva) .

’దిశా పటాని (Disha Patani)  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’, ‘స్టూడియో గ్రీన్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. భారీ హైప్ తో నవంబర్ 14న విడుదలైన ‘కంగువా’ చిత్రం మార్నింగ్  షోతోనే డివైడ్  టాక్ ను మూటగట్టుకుంది. దీంతో ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచాయి. మొదటి రోజు సూర్య కు ఉన్న క్రేజ్ తో పర్వాలేదు అనిపించినప్పటికీ.. రెండో రోజు బాగా డౌన్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Kanguva Collection

Kanguva Collection

 కంగువా  సినిమాకు పెద్ద డ్రా బ్యాక్ లలో ప్రధానంగా చెప్పుకునేది స్లో పేస్ తో నడిచే ఫస్టాఫ్. ఆడియన్స్ పీడ్ బ్యాక్ తీసుకున్న నిర్మాతలు, దర్శకుడు టీమ్ ఈ సినిమా ని 12 నిముషాలు కట్ చేసి, రీ సెన్సార్ చేసి థియేటర్స్ కు ఇస్తున్నారు. ఈ అప్డేట్ వెర్షన్ 143 నిముషాలు ఉంటుంది. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ కొత్త వెర్షనే ప్లే కానుంది. 

36
Suriyas Kanguva

Suriyas Kanguva

 నిర్మాత ఎలర్ట్ అయ్యి సినిమాని ట్రిమ్ చేసినా ఇప్పటికే లేటు అయ్యింది. వీకెండ్ కూడా గడిచిపోయింది. ఇప్పటికే మౌత్ టాక్ అంతటా స్ప్రెడ్ అయ్యిపోయింది.  రిలీజ్ కు ముందే చూసుకుని ఈ ట్రిమ్మింగ్ నిర్ణయం తీసుకుని ఉంటే ఇంత బ్యాడ్ టాక్ అయితే వచ్చేది కాదంటున్నారు.

ఇప్పటికే లేటై పోయిందని, ఇంక పికప్ అవటం కష్టం అంటోంది ట్రేడ్ . మళ్లీ వచ్చి కంగువా ట్రిమ్మింగ్ చేసిన వెర్షన్ చూడాలని అభిమానులు కూడా అనుకోవటం లేదని అంటున్నారు. చేతులు కాలాల ఆకులు పట్టుకున్న రీతిలో ఉందని అంటున్నారు.

46
Kanguva

Kanguva

కంగువా కు పూర్ స్టోరీ టెల్లింగ్, వీక్ నేరేటివ్ సినిమాని దెబ్బ కొట్టాయని తేల్చారు. దాంతో ఎంత మంచి విజువల్స్ ఉన్నా కలిసి రాలేదని, బాహుబలితో పోల్చి రెండు వేల కోట్లు వస్తాయని నిర్మాత చెప్పి హైప్ క్రియేట్ చేయాలని చూసారు కానీ వాస్తవానికి దూరంగా ఉన్న ఎక్సపెక్టేషన్స్ ని అందుకోలేకపోయారని తేల్చారు. 

56
Suriyas Kanguva

Suriyas Kanguva

 
తమిళ పరిశ్రమ తరుపున మొదటి 1000 కోట్ల సినిమా అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర… మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది….నాలుగు రోజుల వీకెండ్ లో ఏ దశలో కూడా అంచనాలను అందుకునే కలెక్షన్స్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ తో వీకెండ్ ని ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది…

సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అతి కష్టం మీద 1 కోటి షేర్ మార్క్ ని దాటింది…వరల్డ్ వైడ్ గా మరోసారి 3వ రోజు లెవల్ లో 14.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది .

66
Kanguva Movie

Kanguva Movie

సూర్య (Suriya) హీరోగా దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా తెరకెక్కిన  చిత్రం ‘కంగువా’ (Kanguva). ఈ  చిత్రం భారీ అంచనాల నడుమ శుక్రవారం తమిళ,తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు సినిమాకి భారీ హైప్ ఉంది. కానీ మార్నింగ్ షేక్  టాక్ మాత్రం నెగిటివ్ గా వచ్చింది.

దర్శకుడు శివ (Siva)  మంచి కథని తీసుకున్నప్పటికీ దానిని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు అనే కంప్లైంట్ ఆడియన్స్ నుండి అందింది. అయితే ముందు నుండి ఉన్న హైప్ కారణంగా  మొదటి రోజు  అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్ బాగా ఉన్నాయి.
   

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image2
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image3
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved