Asianet News TeluguAsianet News Telugu

ఇంటికి నోటీసులు, భద్రత తగ్గింపు బాబుకు జగన్ షాక్: టాప్ స్టోరీస్

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

Top stories of the day
Author
Hyderabad, First Published Jun 28, 2019, 6:22 PM IST

చంద్రబాబు నివాసానికి జగన్ ఎసరు.. అధికారుల నోటీసులు

Top stories of the day

చంద్రబాబు నివాసంతోపాటు మరో 20 అక్రమ నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు తగిన సమయంలోగా ఆ అక్రమ నిర్మాణాల యజమానులు స్పందించాల్సి ఉంటుంది. ఈ నోటీసులకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు.  స్పందించకపోతే.. ప్రజా వేదికను కూల్చివేసిటనట్లుగానే వీటిని కూడా కూల్చే స్తామని అధికారులే స్వయంగా చెప్పారు.
 

గోదావరి నీరు శ్రీశైలం తరలింపు: జగన్, కేసీఆర్ నిర్ణయం

Top stories of the day

 కృష్ణా నదిలో  నీటి లభ్యత  తక్కువగా ఉన్న నేపథ్యంలో  గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలని రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు అవసరమైన ప్లాన్‌ను తయారు చేయాలని  సీఎంలు అధికారులను ఆదేశించారు.
 

ముగిసిన విజయనిర్మల అంత్యక్రియలు.. కృష్ణ కన్నీటి వీడ్కోలు

Top stories of the day

చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయ నిర్మల భౌతికకాయానికి హిందూ శాస్త్ర ప్రకారం కుమారుడు నరేష్ దహనసంస్కారాలు నిర్వహించారు. కన్నీటితో విజయనిర్మలకు కృష్ణ తుది వీడ్కోలు పలికారు. ఆయనను ఓదార్చడం ఎవరివల్లా సాధ్యం కావడం లేదు.

 

ప్రముఖ తెలుగు రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ఇక లేరు

Top stories of the day

 ప్రముఖ తెలుగు రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ఇక లేరు. ఆమె శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో 1933 అక్టోబర్ 13వ తేదీన జన్మించారు. 
 

నా కెరీర్ ను మలుపు తిప్పి... ప్రస్తుత సక్సెస్ కు కారణం ఆ సంఘటనలే : షమీ

Top stories of the day

 షమీ తన సక్సెస్ గురించి మాట్లాడుతూ.... ఇలా క్రికెట్లో తాను రాటుదేలడానికి జీవితంలో చోటుచేసుకున్న రెండు సంఘటనలు కారణమయ్యాయని వెల్లడించాడు. 
ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితంలో గతకొన్ని నెలలుగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపాడు. అలాంటి  క్లిష్ట పరిస్థితుల్లో ఎంత మనోవేధనను అనుభవించానో మాటల్లో చెప్పలలేనని అన్నాడు.

 

పదవి అవసరం లేదు.. హరీష్ రావు ఆసక్తికర కామెంట్స్

Top stories of the day

ప్రజా జీవితంలో పదవితో అసలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పనిచేయాలని ఉంటే ఎలాగైనా చేయవచ్చని ఆయన చెప్పారు. రాజకీయాల్లో పదవీ విరమణ అంటూ ఉండదని ఆయన అన్నారు. 
 

చంద్రబాబుకి జగన్ షాక్... భద్రత మరింత తగ్గింపు

Top stories of the day

చంద్రబాబుకు ఉండే ఇద్దరు ప్రధాన భద్రతా అధికారులను తొలగించటంతో పాటు వీరికి అనుబంధంగా ఉండే ముగ్గురు ఆర్‌.ఐల నేతృత్వంలోని దాదాపు 15 మంది సిబ్బందిని పూర్తిగా తప్పించారు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాలకు తావిస్తోంది.
 

కోలుకున్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్

Top stories of the day

 అనారోగ్యం కారణంగా లండన్ వెళ్లిన అక్బరుద్దీన్ ..45 రోజులపాటు అక్కడ  చికిత్స పొందారు. చికిత్స  అనంతరం తిరిగి ఆయన శుక్రవారం  హైదరాబాద్ చేరుకున్నారు. తెల్లవారుజామున అక్బరుద్దీన్ రాకతో అభిమానులు, కార్యకర్తల శంషాబాద్ విమానాశ్రయానికి తరలి వెళ్లారు. అక్కడి నుండి ఆయన నేరుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. 
 

బాబుకు మరో షాక్: జూలై 5న బీజేపీలో చేరనున్న సూరి

Top stories of the day

నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ మారాలని సూరి భావిస్తున్నట్టుగా సమాచారం.వరదాపురం సూరి పార్టీ మారితే తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించినట్టుగా సమాచారం. బీజేపీ అగ్రనేత ఏపీ రాష్ట్ర ఇంచార్జీ రామ్ మాధవ్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సూరి చర్చించినట్టు సమాచారం. జూలై ఐదో తేదీన అమిత్ షా సమక్షంలో సూరి బీజేపీలో చేరే అవకాశం ఉంది. 
 

సాహో ప్రమోషన్స్ .. మీడియాకు మండుతోంది?

Top stories of the day

వరల్డ్‌వైడ్‌గా ఉన్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న  ఈ చిత్రం గురించి  సుజీత్  ముంబై మీడియాతో అక్కడ పత్రికలతో మాట్లాడుతున్నాడు. కేవలం హిందీ వెర్షన్ ప్రమోషన్ పైనే దృష్టి పెట్టినట్లుగా అనిపిస్తోంది. ఇది తెలుగు మీడియాకు ఇబ్బందిగా ఉంది. ఓ తెలుగు దర్శకుడు ఇక్కడ మీడియాకు ప్రయారిటీ ఇవ్వటం పోవటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

 

విజయ్ శంకర్ పని అయిపోయినట్లే... మరో అవకాశం మాత్రమే...: సంజయ్ మంజ్రేకర్

Top stories of the day

సెలెక్టర్ల నమ్మకాన్ని వమ్ముచేస్తూ ప్రపంచకప్ టోర్నీలో విజయ్ శంకర్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచులాడిన శంకర్ కేవలం పాకిస్థాన్ తో మ్యాచ్ లో మాత్రమే 2 వికెట్లు పడగొట్టి పరవాలేదనిపించాడు. ఇక అప్ఘాన్, వెస్టిండిస్ తో జరిగిన మ్యాచుల్లో బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించలేకపోయాడు
 

 

వైఎస్ఆర్ నిర్వాకంతో రూ.8 వేల కోట్ల నష్టం: జగన్ కు లోకేష్ కౌంటర్

Top stories of the day

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేష్  వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. చంద్రబాబును అవినీతి పరుడిగా ముద్ర వేయాలనే ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతోందని లోకేష్  అభిప్రాయపడ్డారు.

 

చిన్నారెడ్డి పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్

Top stories of the day

ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీలపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం తప్పుపట్టింది. ఆయన చేసిన కామెంట్స్ పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
 

సీఎం గారు.. దీనికి సమాధానం చెప్పండి.. కేశినేని నాని

Top stories of the day

నదీ తీర ప్రక్షాళన కేవలం అరవై - డెబ్భై అక్రమ కట్టడాలకు మాత్రమే పరిమితం చేస్తారా? లేకపోతే మన రాష్ట్రంలో కృష్ణా మరియు గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాల్లో మన రాష్ట్ర సరిహద్దు నుండి మొదలుపెట్టి ఆ నదులు సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి అన్ని అక్రమకట్టడాలను రివర్ కన్సర్వేటివ్ యాక్ట్ ప్రకారం తొలగిస్తారా! .. కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరించగలరు" అని కేశినేని పేర్కొన్నారు. 
 

మొన్న పవన్ ఫ్యాన్స్.. నేడు మహేష్ ఫ్యాన్స్.. 'కల్కి' టార్గెట్!

Top stories of the day

కల్కి టీజర్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఇమిటేట్ చేస్తూ కొన్ని సీన్స్ చూపించారు. దీనితో పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఈ వివాదం గురించి జీవిత మాట్లాడారు. గబ్బర్ సింగ్ చిత్రంలో తమని అవమానించినప్పుడు తామేమి మాట్లాడలేదని అన్నారు. 
 

 

ఇదే నా చివరి వరల్డ్ కప్ కావచ్చు...ఇంకా ఆడాలని వున్నా...: బంగ్లా కెప్టెన్ సంచలనం

Top stories of the day

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ ముగియగానే చాలామంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. విండీస్ హిట్టర్ క్రిస్ గేల్, టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఇలా చాలా మంది ఆటగాళ్ల కెరీర్ ఈ ప్రపంచ కప్ తర్వాత ముగియనుంది. అయితే ఈ రిటైర్మెంట్ లిస్ట్ లోకి అనూహ్యంగా ఓ కొత్త పేరు వచ్చి చేరింది. అతడే బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రఫే మోర్తజా. 
 

ఆ మాత్రం నమ్మకం లేదా.. బొండా ఉమ అసంతృప్తి

Top stories of the day

విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశం అనంతరం నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తన మీద ఆ మాత్రం నమ్మకం కూడా లేదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
 

పవర్ పాయింట్ ప్రజంటేషన్: నీటి లభ్యతపై జగన్‌కు వివరించిన కేసీఆర్

Top stories of the day

సి.డబ్ల్యు.సి. లెక్కల ప్రకారం ఏ పాయింట్ వద్ద ఎంత నీటి లభ్యత ఉందో  చూపారు.. గూగుల్ మ్యాపుల సహకారంతో గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సమర్థ వంతంగా వినియోగించుకోవడానికున్న మార్గాలను ప్రతిపాదించారు. 
 

నా హాట్ ఫోటోలకు లైక్స్ ఎక్కువ.. 60 ఏళ్ల నటి!

Top stories of the day

వెటరన్ నటి నీనా గుప్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా నినా గుప్తా కుర్ర హీరోయిన్లు ధరించే ఫ్యాషన్ డ్రెస్సులతో సందడి చేస్తోంది. దీనితో ఈ ముదురు హీరోయిన్ రచ్చ ఏంటని సోషల్ అభిమానులు చర్చించుకుంటున్నారు. నీనా గుప్తా మాత్రం భిన్నంగా స్పందిస్తోంది.
 

పాక్ పై కుట్ర, కావాలని వారిపై ఇండియా ఓడుతుంది: పాక్ మాజీ క్రికెటర్

Top stories of the day

పాకిస్తాన్ న్యూజిలాండ్ పై విజయం సాధించడానికి ముందు పాకిస్తాన్ కు చెందిన టీవీ చానెల్ ఆరీ న్యూస్ టీవీ షోలో బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆ దేశం జర్నలిస్టు సజ్ సాదిక్ పోస్టు చేశారు పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు రావడం ఇండియాకు ఇష్టం ఉండదని అటూ బంగ్లాదేశ్, శ్రీలంక జట్లను భారత్ ఎదుర్కోబోతోందని, అఫ్గనిస్తాన్ పై భారత్ ఆడిన తీరును అందరూ చూశారు కదా అని అలీ అన్నారు.

 

కల్కి మూవీ రివ్యూ: ఓర్పు తో చూడాల్సిన ..

Top stories of the day

ఎవరు శేఖర్ బాబుని చంపేరన్నది మాత్రం తేలదు. అప్పుడు ఆ కేసుని తేల్చటానికి ఐపీయస్ అధికారి కల్కి (రాజశేఖర్)వస్తాడు. అక్కడనుంచి తనదైన శైలిలో ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఒక్కో చిక్కుముడి ని విప్పుతున్న  ప్రాసెస్ లో అనేక నిజాలు వెలుగులోకి వస్తాయి. కేసులో ఇంకా డెప్త్ కు వెళ్ళేసరికి  మర్డర్ మిస్టరీని మించిన అంశం ఉంటుంది. అదేమిటి...కల్కి ఎలా హ్యాండిల్ చేసాడు.
 

 

టీడీపీకి గుడ్‌బై, వైసీపీలో చేరిక: పోయిన పదవి తిరిగొచ్చింది

Top stories of the day

విశాఖ పట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్‌గా ఉప్పలపాటి సుకుమారవర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరేళ్ల కిందట జరిగిన సహకార ఎన్నికల్లో ఉప్పలపాటి సుకుమారవర్మ డీసీసీబీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
 

'బ్రోచేవారెవరురా' మూవీ రివ్యూ: మంచి కామెడీ క్రైమ్ థ్రిల్లర్

Top stories of the day

ఇంకా ఇంటర్ పూర్తి చేయకుండా ఆకతాయిల్లా తిరిగే ముగ్గురు స్నేహితులు విశాల్ (శ్రీవిష్ణు), విశాక్ (ప్రియదర్శి), ర్యాంబో( రాహుల్ రామకృష్ణ). వీళ్లు చదివే కాలేజిలోనే నివేద థామస్ కూడా జాయిన్ అవుతుంది. కాలేజీ ప్రిన్సిపాల్ కుమార్తె నివేదా థామస్. నివేదా కూడా శ్రీవిష్ణు గ్యాంగ్ తో స్నేహం చేయడం మొదలుపెడుతుంది.తనకున్న కొన్ని సమస్యల వల్ల నివేదా తన తండ్రికి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో శ్రీవిష్ణు గ్యాంగ్ ఆమెకు సహాయపడతారు. అనుకోని సంఘటనలవల్ల వాళ్ళు కూడా సమస్యల్లో చిక్కుకుంటారు. ఆ సమస్యలు ఏంటి.. వాటి నుంచి శ్రీవిష్ణు గ్యాంగ్ ఎలా బయట పడింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 
 

కొత్త జిల్లాలా... స్థానిక ఎన్నికలా: జగన్‌కు చిక్కు ప్రశ్న

Top stories of the day

 స్థానిక సమరానికి సమయం ముంచుకొస్తున్న తరుణంలో ముఖ్యమంత్రికి కొత్త చిక్కొక్కటి వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలను ముందుగా ఏర్పాటు చేయాలా లేక స్థానిక ఎన్నికలను ముందుగా నిర్వహించాలా అనే దానిపై తేల్చుకోలేకే జగన్ మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది
 

బాబు ఎఫెక్ట్: 30 మంది డిఎస్పీలకు నో పోస్టింగ్

Top stories of the day

 రాష్ట్రంలో  37 మంది డిఎస్పీలను బదిలీ చేసింది ప్రభుత్వం. 30 మంది డిఎస్పీలకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఏడుగురు డిఎస్పీలకు ఇంటలిజెన్స్‌లో పోస్టింగులిచ్చారు. చంద్రబాబునాయుడు సర్కార్‌ హాయంలో ఈ డిఎస్పీలంతా టీడీపికి అనుకూలంగా పనిచేశారని సర్కార్  ఈ నిర్ణయం తీసుకొందని చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios