Asianet News TeluguAsianet News Telugu

సాహో ప్రమోషన్స్ .. మీడియాకు మండుతోంది?

సాహో లాంటి పెద్ద సినిమా వస్తోందంటే సిని లవర్స్ ఉత్సాహం పట్టలేనంతంగా ఉంటుంది. ఇక ఫ్యాన్స్ సంగతి అయ్యితే చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో తమ హీరో ఏ పాత్ర వేస్తున్నాడు. సినిమా కాన్సెప్ట్ ఏమిటి...సినిమా విశేషాలు ఏమిటి అన్నవాటి గురించి ఎదురుచూస్తూంటారు. అయితే సాహో దర్శకుడు సుజీత్ మాత్రం తెలుగు మీడియాతో మాట్లాడటానికి ఇంట్రస్ట్ చూపటం లేదు. 

Saaho director Sujeeth ignore telugu media?
Author
Hyderabad, First Published Jun 28, 2019, 8:05 AM IST

సాహో లాంటి పెద్ద సినిమా వస్తోందంటే సిని లవర్స్ ఉత్సాహం పట్టలేనంతంగా ఉంటుంది. ఇక ఫ్యాన్స్ సంగతి అయ్యితే చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో తమ హీరో ఏ పాత్ర వేస్తున్నాడు. సినిమా కాన్సెప్ట్ ఏమిటి...సినిమా విశేషాలు ఏమిటి అన్నవాటి గురించి ఎదురుచూస్తూంటారు. అయితే సాహో దర్శకుడు సుజీత్ మాత్రం తెలుగు మీడియాతో మాట్లాడటానికి ఇంట్రస్ట్ చూపటం లేదు.  రన్ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ ‘సాహో’కి దర్శకుడు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. 

వరల్డ్‌వైడ్‌గా ఉన్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న  ఈ చిత్రం గురించి  సుజీత్  ముంబై మీడియాతో అక్కడ పత్రికలతో మాట్లాడుతున్నాడు. కేవలం హిందీ వెర్షన్ ప్రమోషన్ పైనే దృష్టి పెట్టినట్లుగా అనిపిస్తోంది. ఇది తెలుగు మీడియాకు ఇబ్బందిగా ఉంది. ఓ తెలుగు దర్శకుడు ఇక్కడ మీడియాకు ప్రయారిటీ ఇవ్వటం పోవటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. కేవలం హిందీలో ఆడితే చాలు అన్నట్లుగా భారీగా అక్కడ ప్రమోట్ చేస్తున్నారు.

ఇక్కడ కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లోకల్ మీడియాతో కూడా ఇంట్రాక్ట్ అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిందీ మీడియాకు కొత్త కాబట్టి అక్కడ ప్రమోట్ చేయాలి,ఇక్కడ ఎలాగైనా ప్రమోషన్ దానంతట అదే జరుగుతుందనే అభిప్రాయంతో సుజీత్ ఇలా చేస్తున్నాడంటున్నారు. రిలీజ్ కు ముందు ప్రభాస్ తోనూ, సుజీత్ తోనూ ఇంటర్వూలు తీసుకునే అవాకాసం ఇస్తారని పీఆర్ టీమ్ చెప్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

పాన్ ఇండియా సూప‌ర్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా మూడు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం సాహో.  ట్రైలర్‌ విడుదలయ్యాక సినిమాకు మరింత క్రేజ్‌ పెరిగింది. ఈ ఏడాదిలో అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిన చిత్రమిది. అంతర్జాతీయ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ రూపొందించిన పోరాట ఘట్టాలను వీక్షించడానికి ప్రభాస్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు . ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మన్స్, సుజిత్ వరల్డ్ క్లాస్ విజన్, శ్రద్ధా కపూర్ అందచందాలు, గిబ్రాన్ మ్యూజిక్, మధి గ్రాండియర్ విజువల్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి అని చెప్తున్నారు.  ఆగస్టు 15న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ‘సాహో’ విడుదలకానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios