తమ అభిమాన హీరోని తక్కువ చేసే విధంగా చిన్న సంఘటన జరిగినా ఫ్యాన్స్ ఫీలైపోతుంటారు. ముఖ్యంగా ఇలాంటివి సౌత్ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా చూస్తుంటాం. తెలుగు,  తమిళ చిత్ర పరిశ్రమల్లో అభిమానుల మధ్య వివాదాలు జరుగుతుంటాయి. యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం శుక్రవారం విడుదలయింది. రాజేశేఖర గరుడవేగ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇదిలా ఉండగా ఈ చిత్ర టీజర్ నుంచే వివాదాలు మొదలయ్యాయి. కల్కి టీజర్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఇమిటేట్ చేస్తూ కొన్ని సీన్స్ చూపించారు. దీనితో పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఈ వివాదం గురించి జీవిత మాట్లాడారు. గబ్బర్ సింగ్ చిత్రంలో తమని అవమానించినప్పుడు తామేమి మాట్లాడలేదని అన్నారు. 

తాజాగా ఇలాంటి వివాదమే మహర్షి చిత్ర విషయంలో చోటు చేసుకుంది. ఇటీవల కల్కి చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టర్ లో రాజశేఖర్ పోలీస్ యూనిఫామ్ లో నాగలి మోస్తూ కనిపిస్తున్నాడు. 'ఈ మధ్యన కమర్షియల్ చిత్రాల్లో నాగలి పోస్టర్ కామన్ అయిపోయింది' అంటూ ప్రశాంత్ వర్మ కామెంట్ పెట్టాడు. 

ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా మహర్షి చిత్రాన్ని ఉద్దేశించినవే అని మహేష్ ఫ్యాన్స్ భావించారు. దీనితో కల్కి చిత్రపై మరోసారి ట్రోలింగ్ జరుగుతోంది. టీజర్, ట్రైలర్స్ తో ఆసక్తిని రేపిన కల్కి చిత్రం ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.