న్యూఢిల్లీ: భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, శ్రీలంకలపై జరిగే మ్యాచుల్లో భారత్ కావాలని ఓడిపోతుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరుకోవడం ఇండియాకు ఇష్టం ఉండదని, పాక్ ను అడ్డుకోవడానికి భారత్ ఆ రెండు జట్లపై ఒడిపోతుందని అన్నారు.

పాకిస్తాన్ న్యూజిలాండ్ పై విజయం సాధించడానికి ముందు పాకిస్తాన్ కు చెందిన టీవీ చానెల్ ఆరీ న్యూస్ టీవీ షోలో బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆ దేశం జర్నలిస్టు సజ్ సాదిక్ పోస్టు చేశారు పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు రావడం ఇండియాకు ఇష్టం ఉండదని అటూ బంగ్లాదేశ్, శ్రీలంక జట్లను భారత్ ఎదుర్కోబోతోందని, అఫ్గనిస్తాన్ పై భారత్ ఆడిన తీరును అందరూ చూశారు కదా అని అలీ అన్నారు. 

ఏమి జరిగిందనేది ఎవరికీ తెలియకుండా అఫ్గానిస్తాన్ తో ఇండియా ఆడిందని అన్నారు. అఫ్గానిస్తాన్ తో ఇండియా మ్యాచ్ ఏమైందని ప్రశ్నించారు. ఇండియాపై మ్యాచులో ఆస్ట్రేలియా ఏం చేసిందని, డేవిడ్ వార్నర్ ఏం చేశాడని ఆయన ప్రశ్నించారు అఫ్గానిస్తాన్ పై కావాలనే భారత్ చెత్తగా ఆడిందని, ఇండియాపై మ్యాచులో డేవిడ్ వార్నర్ సరిగా ఆడలేదని ఆయన అన్నారు.

భారత్ పై 89 పరుగుల తేడాడో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఆ తర్వాతి మ్యాచుల్లో విశేషమైన సత్తా చూపింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండులను ఓడించింది. పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. సెమీ ఫైనల్ కు చేరుకోవాలంటే పాకిస్తాన్ అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లపై జరిగే మ్యాచుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.