ఓ ఉపాధ్యాయుడు ఘోరంగా ప్రవర్తించాడు. ఇష్టంవచ్చినట్టు కొడుతూ.. నేలమీద పడేసి చితకబాదాడు. గొంతు నులుముతూ.. జుట్టు పట్టుకుని కొట్టాడు. 

మధ్యప్రదేశ్ : విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్.. బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. ఓ విద్యార్థిని అత్యంత దారుణంగా చితకబాదాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. నేలమీద పడుకోబెట్టి పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీచర్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో చోటు చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రేవా లోని ఖజుమా కాలాలోని హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థి ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. విద్యార్థిపై ఉపాధ్యాయుడు సందీప్ భారతి దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. ఈ క్రమంలో విద్యార్థి టీచర్ దెబ్బలకు తాళలేక విలవిలలాడి పోయాడు. ఒకానొక సమయంలో ఎదురుతిరిగే ప్రయత్నం కూడా చేశాడు. అయితే, కొట్టడం ఆపేసిన కాసేపటికి విద్యార్థి కింది నుంచి పైకి లేవడంతో అతని దుస్తులకు బురద అంటుకోవడం వీడియోలో కనిపిస్తుంది.

దృశ్యం సినిమా పదిసార్లు చూసి.. తల్లితో కలిసి తండ్రిని దారుణంగా హత్య చేసిన కూతురు.. ఎందుకంటే..

ఇక విద్యార్థి లేచి, ముందుకు వెళుతున్న క్రమంలో టీచర్ మరోసారి అతడిని చితకబాదాడు. మెడ పట్టుకుని ముందుకు నెట్టి వేశాడు. ఇదంతా చూస్తున్న మిగతా టీచర్లు విద్యార్థులు మాత్రం, అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కాగా, ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదించిన తర్వాత టీచర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. పూర్తి విచారణ జరిపిన తరువాత.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Scroll to load tweet…