- Home
- National
- Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా పేదరికం అడ్డొస్తుందా? ఇలాంటి విద్యార్థుల కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ అదిరిపోయే స్కాలర్‌షిప్ తెచ్చింది. దీని ద్వారా నెలకు రూ.1000 చొప్పున ఏటా రూ.12,000 పొందొచ్చు.

స్కూల్ విద్యార్థులకు స్కాలర్షిప్
NMMS Scholarship Scheme : చాలామంది విద్యార్థులు పేదరికం వల్ల చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు మోదీ ప్రభుత్వం 'నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS)' పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు ఏటా రూ.12,000 అంటే నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఇలా 9వ తరగతి నుండి 12 తనగతి వరకు అంటే నాలుగేళ్లపాటు ఈ సాయం పొందవచ్చు. దీనికి సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ప్రభుత్వ స్కాలర్ షిప్ కు కావాల్సిన అర్హతలు..
కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఈ 'నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్' పథకాన్ని నిర్వహిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 05 (శనివారం) అంటే ఇవాళే చివరి తేదీ.
- ఈ స్కాలర్‌షిప్ పొందాలంటే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలి.
- ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసే విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో 7, 8 తరగతులల పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి (SC/ST విద్యార్థులకు మార్కుల్లో 5% సడలింపు ఉంటుంది)
వీరు స్కాలర్షిప్ పొందేందుకు అనర్హులు
- కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకం కింద స్కాలర్‌షిప్‌లు పొందేందుకు అర్హులు కారు.
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలచే నడపబడుతున్న రెసిడెన్షియల్ పాఠశాలల్లో (అంటే తెలంగాణలో గురుకులాల వంటివాటిలో) చదివే విద్యార్థులు అనర్హులు.
- ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పథకం కింద స్కాలర్‌షిప్‌కు అర్హులు కారు.
- విదేశాలలో ఏ కోర్సు చదువుకోవడానికి స్కాలర్‌షిప్ లభించదు.
- ఈ దశలో డిప్లొమా/సర్టిఫికేట్ స్థాయి కోర్సులు చదవడానికి ఎలాంటి స్కాలర్‌షిప్ చెల్లించబడదు.
పరీక్షా విదానం
రాత పరీక్ష ఆధారంగా ఈ స్కాలర్షిప్ కోసం విద్యార్థులకు ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ లో రెండు పేపర్లు ఉంటాయి... ఒక్కో పేపర్ కు 90 మార్కుల చొప్పున 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 40 శాతం మార్కులతో ఉత్తీర్థణ సాధించాలి.. ఎస్సి, ఎస్టిలకు 32 శాతం మార్కులు వస్తే చాలు.
మెంటల్ ఎబిలిటి టెస్ట్ (MAT) : 90 ప్రశ్నలు - 90 మార్కులు - 90 నిమిషాల సమయం (Multiple Choice Questions)
స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) : 90 ప్రశ్నలు - 90 మార్కులు - 90 నిమిషాల సమయం (7,8 తరగతిలోని సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ కు సంబంధించిన ప్రశ్నలుంటాయి)
పరీక్ష ఫీజు
ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి విద్యార్థులకు రూ.50
మిగతా విద్యార్థులకు రూ.100
స్కాలర్ షిప్ ఎంపిక ప్రక్రియ
ప్రతి ఏటా 9వ తరగతి చదివే లక్ష మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు. సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నిర్వహించే పరీక్షలో పాసైతేనే ఈ సాయం అందుతుంది.
ఈ స్కాలర్ షిప్ కోసం విద్యార్థులు తాము చదివే పాఠశాల హెడ్ మాస్టర్ (HM) ద్వారా ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్లను రెండు దశల్లో వెరిఫై చేస్తారు. మొదట ఇన్‌స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్, తర్వాత జిల్లా నోడల్ ఆఫీసర్ పరిశీలిస్తారు. విద్యార్థులు అన్ని అర్హతలు సాధిస్తే స్కాలర్షిప్ లభిస్తుంది.
ప్రతిభ ఉన్నప్పటికీ, చాలామంది పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. అలాంటి వారు తమ చదువును కొనసాగించేందుకే ఈ స్కాలర్‌షిప్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు
విద్యా ధృవపత్రాలు/ మార్క్‌షీట్
కుల ధృవీకరణ పత్రం
తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం
వర్తిస్తే వైకల్య ధృవీకరణ పత్రం
నివాస ధృవీకరణ పత్రం
అవసరమైన ఇతర సహాయక పత్రాలు

