వరంగల్: తెలంగాణ ఉద్యమంతో పాటు పలు అంశాల్లో తెలంగాణ రాష్ట్రంతో  మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన వంశీరెడ్డిని అమెరికాలో కాల్చి చంపారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా వచ్చిన వినతి మేరకు ఆమె స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఆమె పలు సమస్యలను పరిష్కరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వంగపహాడ్ గ్రామానికి చెందిన వంశీరెడ్డి అనే యువకుడిని 2017 ఫిబ్రవరి 10వ తేదీన అమెరికాలోని మిలిపీటస్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్చిచంపాడు. జాతి విద్వేషం కారణంగానే హత్య చేశాడని తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తమ కొడుకు పార్థీవ దేహం కోసం కుటుంబసభ్యులు ఎదురుచూశారు.

ఈ విషయమై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అప్పట్లో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ ను కోరారు. ఈ మేరకు  ఆయన ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు.. మరో వైపు ఇదే విషయాన్ని అప్పటి బీజేపీ శాసనసభపక్ష నేత కిషన్ రెడ్డి కూడ సుష్మా స్వరాజ్ తో ఫోన్లో మాట్లాడారు.

ఈ విషయమై సుష్మా స్వరాజ్  బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డితో పాటు వంశీ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. జరిగిన ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకొన్నారు. అమెరికా అధికారులతో మాట్లాడారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఆమె  కోరారు.   

వంశీ రెడ్డి తల్లిదండ్రులతో మాట్లాడిన మరునాడే వంశీరెడ్డి మృతదేహం స్వగ్రామానికి చేరుకొంది.ప్రభుత్వమే అన్ని ఖర్చులను భరించి వంశీ మృతదేహన్ని కుటుంబసభ్యులకు అప్పగించింది.

ఈ ఒక్క ఘటనే కాదు తెలంగాణ ఉద్యమంలో కూడ ఆమె బాసటగా నిలిచారు. తెలంగాణ బిల్లు  పాస్ కావడంలో ఆమె కీలకంగా వ్యవహిరంచారు.  తెలంగాణ ఉద్యమంలో ఆమె పాల్గొన్నారు.  తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

సుష్మా స్వరాజ్: ఎయిమ్స్ కు క్యూ కట్టిన ప్రముఖులు

రూపాయి ఫీజుకు సుష్మా ఇలా చేశారు: కన్నీరు మున్నీరైన సాల్వే

దీదీ..నాకిచ్చిన ప్రామిస్ నెరవేర్చలేదు... ఎమోషనల్ అయిన స్మృతీ ఇరానీ

సుష్మా స్వరాజ్ మృతి: బోరున ఏడ్చిన అద్వానీ

సుష్మా స్వరాజ్ ను గద్దె దింపిన ఉల్లిఘాటు

సుష్మా స్వరాజ్ ప్రేమ పెళ్లి ఓ సంచలనం

సుష్మా స్వరాజ్ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

సుష్మాని కించపరుస్తూ కామెంట్... పాక్ నెటిజన్ కి కేటీఆర్ కౌంటర్

ట్విట్టర్ ఫైటర్ ని కోల్పోయా...సుష్మామృతి పై పాక్ మంత్రి కామెంట్

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత

సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే...

సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

విద్యార్ధి నేత నుండి విదేశాంగ మంత్రిగా: సుష్మా స్వరాజ్ ప్రస్థానం

చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

సుష్మా స్వరాజ్: ఎయిమ్స్ కు క్యూ కట్టిన ప్రముఖులు