న్యూఢిల్లీ:కుల్‌భూషణ్  జాదవ్ కేసును వాదించినందుకు తనకు రావాల్సిన ఫీజు ఒక్క రూపాయిని తీసుకొనేందుకు ఇంటికి రావాలని మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తనను ఇంటికి ఆహ్వానించారని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరయ్యారు.

మంగళవారం రాత్రి చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేతో  మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడారు.సుష్మాతో తనతో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకొని ఆయన కన్నీరుమున్నీరయ్యారు.

కుల్‌భూషణ్ జాదవ్ కేసును హరీష్ సాల్వే వాదించారు. ఈ కేసులో పాక్ తీరును అంతర్జాతీయ న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ కేసు వాదించినందుకుగాను  హరీష్ సాల్వే ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకొన్నాడు.  

కుల్ భూషణ్ జాదవ్ కేసు గెలవడంతో  తనకు చెల్లించాల్సిన ఫీజు ఒక్క రూపాయిని తీసుకోవడానికి ఇంటికి రావాలని సుష్మా స్వరాజ్ చనిపోవడానికి ఒక్క గంట ముందు హరీష్ సాల్వేకు ఫోన్ చేసి మాట్లాడింది. ఈ ఫీజు తీసుకోవడానికి  రేపు ఇంటికి రావాలని ఆమె ఆహ్వానించింది.

కుల్‌భూషణ్  కేసు గెలిచినందుకు మీకు నేను ఒక్క రూపాయి ఇవ్వాలి, రేపు ఆరు గంటలకు వచ్చి ఒక్క రూపాయి తీసుకోవాలని  ఆమె తనను కోరినట్టు హరీష్ సాల్వే గుర్తు చేసుకొన్నారు.  

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్‌ జైల్లో ఉన్నభారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాక్‌ న్యాయస్థానం విధించిన మరణశిక్షణను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో హరీశ్‌ వాదనలే కీలకంగా మారాయి. ఈ కేసును వాదించేందుకు పాక్ తరపున బ్రిటన్ కు చెందిన ఖురేషీ వాదించారు. సాదారణంగా ఒక్కో రోజుకు హరీష్ సాల్వే రూ. 30 లక్షలు ఫీజుగా తీసుకొంటాడు. 

సంబంధిత వార్తలు

దీదీ..నాకిచ్చిన ప్రామిస్ నెరవేర్చలేదు... ఎమోషనల్ అయిన స్మృతీ ఇరానీ

సుష్మా స్వరాజ్ మృతి: బోరున ఏడ్చిన అద్వానీ

సుష్మా స్వరాజ్ ను గద్దె దింపిన ఉల్లిఘాటు

సుష్మా స్వరాజ్ ప్రేమ పెళ్లి ఓ సంచలనం

సుష్మా స్వరాజ్ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

సుష్మాని కించపరుస్తూ కామెంట్... పాక్ నెటిజన్ కి కేటీఆర్ కౌంటర్

ట్విట్టర్ ఫైటర్ ని కోల్పోయా...సుష్మామృతి పై పాక్ మంత్రి కామెంట్

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత

సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే...

సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

విద్యార్ధి నేత నుండి విదేశాంగ మంత్రిగా: సుష్మా స్వరాజ్ ప్రస్థానం

చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు