ట్విట్టర్ లో తనతో ఫైట్ చేసే గొప్ప వ్యక్తిని కోల్పోయాను అంటూ ఎంతో భావోద్వేగంతో ఆయన ట్వీట్ చేశారు. హక్కుల కోసం పోరాడే గొప్ప దిగ్గజం సుష్మా అంటూ కొనియాడారు. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆమె కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలుపుతున్నట్లు వివరించారు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం రాత్రి ఆమె గుండె పోటు కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా... ఆమె మరణం పట్ల పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌద్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సుష్మా హఠాన్మరణంపై ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ట్విట్టర్ లో తనతో ఫైట్ చేసే గొప్ప వ్యక్తిని కోల్పోయాను అంటూ ఎంతో భావోద్వేగంతో ఆయన ట్వీట్ చేశారు. హక్కుల కోసం పోరాడే గొప్ప దిగ్గజం సుష్మా అంటూ కొనియాడారు. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆమె కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలుపుతున్నట్లు వివరించారు.
కాగా పాకిస్తాన్‌లో హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా మత మార్పిడి చేయించిన వ్యవహారంపై సుష్మాకు, ఫవాద్ చౌద్రీల మధ్య అప్పట్లో ట్వీటర్‌లో వాగ్యుద్ధం జరిగింది. ఈ ఘటనపై సమాచారం ఇవ్వాలని ఇస్లామాబాద్‌లోని ఇండియన్ కమిషనర్‌ను సుష్మా ఆదేశించారు.
దీనిపై ఫవాద్ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్‌లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్ పాలనలోని కొత్త పాక్. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్‌లో బదులిచ్చారు.
