న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్‌ ఉల్లి ధరల కారణంగా తన పదవిని కోల్పోయారు. ఉల్లి ధరలే  మూడు రాష్ట్రాల్లో ఆనాడు బీజేపీని గద్దె దింపాయి. కాంగ్రెస్ పార్టీకి  ఈ ఎన్నికల్లో మంచి విజయం లభించింది.

హర్యానా రాష్ట్రానికి చెందిన సుష్మా స్వరాజ్ దక్షిణ ఢిల్లీ నుండి రెండు దఫాలు ఎంపీగా విజయం సాధించారు. 1998లో  సుష్మ స్వరాజ్ ను బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమించింది.

ఢిల్లీలో శాంతి భద్రతల రక్షణతో పాటు  పాలనలో సుష్మా స్వరాజ్ తన ముద్రను వేశారు. పోలీసు వాహనంలో కూర్చొని ఢిల్లీ వీధుల్లో ఆమె పర్యటించేవారు.ప్రజలు ఏం కోరుకొంటున్నారో ఆ రకమైన సేవలను అందించేందుకు ఆమె ప్రయత్నించారు.

ఉల్లిధరలు గణనీయంగా పెరగడంతో  1998 ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ అధికారానికి దూరమైంది. బీజేపీ అవలంభించిన కారణాల వల్లే  బీజేపీ అధికారానికి దూరమైందని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

న్యూఢిల్లీలో 1993లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో మదన్ లాల్ ఖురానా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సాహెబ్ సింగ్ ఈ పదవిని చేపట్టారు. వీరిద్దరి తర్వాత సుష్మా స్వరాజ్ ఢిల్లీలో సీఎం పీఠాన్ని ఎక్కారు. 

కానీ, ఆమె ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలోనే ఉల్లి ధరలు పెరిగాయి. ఉల్లి ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల బీజేపీ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయ్యారు. షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో సీఎం పదవిలో కొనసాగారు.

సంబంధిత వార్తలు

సుష్మా స్వరాజ్ ప్రేమ పెళ్లి ఓ సంచలనం

సుష్మా స్వరాజ్ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

సుష్మాని కించపరుస్తూ కామెంట్... పాక్ నెటిజన్ కి కేటీఆర్ కౌంటర్

ట్విట్టర్ ఫైటర్ ని కోల్పోయా...సుష్మామృతి పై పాక్ మంత్రి కామెంట్

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత

సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే...

సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

విద్యార్ధి నేత నుండి విదేశాంగ మంత్రిగా: సుష్మా స్వరాజ్ ప్రస్థానం

చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు