MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • National
  • Toll Pass : కేవలం రూ.340 టోల్ పాస్.. నెెలంతా ఫ్రీగా తిరగొచ్చు..!

Toll Pass : కేవలం రూ.340 టోల్ పాస్.. నెెలంతా ఫ్రీగా తిరగొచ్చు..!

నెలంతా టోల్ కట్టకుండానే ప్రయాణించవచ్చని చెప్తే మీరు నమ్ముతారా..? ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే ఈ అవకాశం అందరికి కాదు కొందరికి మాత్రమే… అలాగనీ ఎవరో విఐపిలకు కాదు సామాన్య ప్రజలకే…  

1 Min read
Author : Arun Kumar P
Published : Feb 26 2026, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ టోల్ పాస్ ఉంటే.. మీకు ఫ్రీ జర్నీ
Image Credit : Getty

ఈ టోల్ పాస్ ఉంటే.. మీకు ఫ్రీ జర్నీ

జాతీయ, రాష్ట్ర రహదారులపై రోజూ లక్షల వాహనాలు టోల్ ప్లాజాలు దాటుతుంటాయి. ప్రతి వాహనం టోల్ కట్టడం తప్పనిసరి. కానీ కేవలం రూ.340 చెల్లించి నెలంతా ఎన్నిసార్లైనా టోల్ దాటొచ్చనే విషయం చాలామందికి తెలియదు. ఇది వీఐపీలకు మాత్రమే కాదు, సాధారణ ప్రజలకు కూడా వర్తిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రయాణంలో డబ్బులు ఆదా..
Image Credit : iSTOCK

ప్రయాణంలో డబ్బులు ఆదా..

అయితే ఈ రూ.340 నెలవారీ పాస్ టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి మాత్రమే లభిస్తుంది. పని మీద రోజూ రెండు, మూడు సార్లు టోల్ దాటే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రోజుకు రూ.60-100 టోల్ చెల్లిస్తే నెలకు రూ.2000-3000 ఖర్చవుతుంది. కానీ ఈ పాస్‌తో రూ.340కే నెలంతా తిరగొచ్చు.

35
ఈ టోల్ పాస్ ఎలా పొందాలి..?
Image Credit : Gemini

ఈ టోల్ పాస్ ఎలా పొందాలి..?

ఈ సదుపాయం ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ట్యాక్సీలు, కమర్షియల్ వాహనాలకు ఇది వర్తించదు. పాస్ కోసం నేరుగా టోల్ ప్లాజా ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు లేదా రేషన్ కార్డుతో అడ్రస్ వెరిఫై చేస్తారు. ఆ తర్వాత రూ.340 చెల్లిస్తే నెలవారీ పాస్ ఇస్తారు.

45
టొల్ ప్లాజాల్లో ఈ సదుపాయాలు ఫ్రీ..
Image Credit : stockphoto

టొల్ ప్లాజాల్లో ఈ సదుపాయాలు ఫ్రీ..

టోల్ ప్లాజాలు కేవలం రుసుము వసూలు చేయడమే కాదు, కొన్ని ఉచిత సేవలు కూడా అందిస్తాయి. ప్రయాణికుల కోసం తాగునీరు, మగవారికి, మహిళలకు వేర్వేరు టాయిలెట్ల సౌకర్యం ఉచితంగా ఉంటుంది. కొద్దిసేపు వాహనాలు పార్క్ చేసుకునేందుకు స్థలం ఉంటుంది, కానీ ఎక్కువ సేపు ఆపడానికి అనుమతి లేదు.
55
టోల్ ప్లాజా కల్పించే సౌకర్యాలు..
Image Credit : iSTOCK

టోల్ ప్లాజా కల్పించే సౌకర్యాలు..

అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్), అంబులెన్స్ సర్వీస్, వాహనం బ్రేక్‌డౌన్ అయితే క్రేన్ సహాయం వంటివి కూడా ఉచితంగా అందిస్తారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద ఒక హెల్ప్‌లైన్ నంబర్ ఉంటుంది. అత్యవసర సహాయం కావాలంటే ఆ నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈ విషయాలు తెలుసుకుంటే డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, కష్టకాలంలోనూ ఉపయోగపడతాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Toll Charges: వాహనదారులకు అదిరిపోయే న్యూస్‌.. ఆ రూట్లలో 50 శాతం టోల్ ఫీజు తగ్గింపు!
Recommended image2
Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved