MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Business
  • అదే జరిగిందో.. బంగారం ధర టక్కున రెండు లక్షలు..!

అదే జరిగిందో.. బంగారం ధర టక్కున రెండు లక్షలు..!

"బంగారం ధర తగ్గుతుంది అన్నారు .. తగ్గలేదు ఏంటి?" అని ఒకరి ప్రశ్న… ‘’ఇరాన్ తో అమెరికా యుద్ధం చేస్తుందా ? లేదా ?అనేది బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనేది నిర్ణయిస్తుంది'' అని చెప్పానుగా..

2 Min read
Author : Amarnath Vasireddy
Published : Feb 26 2026, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగారం ధర పెరుగుతుందా..?
Image Credit : Getty

బంగారం ధర పెరుగుతుందా..?

ఒకప్పుడు చదువుకోని వారి సంఖ్య ఎక్కువ..!

ఇప్పుడు చదవలేని వారి సంఖ్య ఎక్కువ..!

ఆ రోజుల్లో నిరక్షరాస్యులయినా...

కుతూహలం, కుశాగ్ర బుద్ధి, వివేకం ఎక్కువ.

మరి నేడు... రోజంతా డిజిటల్ పరికరాల ద్వారా జిగాబైట్ల సమాచారం.

చూసి చూసి ఏది నిజమో ఏది కాదో తెలుసుకొనే ఆసక్తి, ఆ శక్తి తగ్గిపోయింది.

వార్తా పత్రిక చదవలేరు .

నిడివి ఎక్కువ అయితే పోస్ట్ కూడా చదవలేరు.

"బంగారం ధర తగ్గుతుంది అన్నారు .. తగ్గలేదు ఏంటి?" అని ఒక ప్రశ్న.

"ఇరాన్ తో యుద్ధం జరిగే అవకాశం మొన్నటి దాకా ఉంది. ఇప్పుడు జరగదు అని ప్రపంచం భావిస్తోంది. అందుకే స్టాక్ మార్కెట్ స్థిరత్వం దిశగా అడుగుల... బంగారం ధర తగ్గే అవకాశం.. అయినా బంగారం అమ్మొద్దు .." ఇదీ పోస్ట్.

ఒక్క లైన్ చదివి మిగతావి వదిలేసే డిజిటల్ యుగ నిరక్షరాస్యత.

ఇరాన్ తో అమెరికా యుద్ధం చేస్తుందా ? లేదా ?అనేది... బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనేది నిర్ణయిస్తుంది అని కూడా అర్థం చేసుకోలేని స్థితికి బ్రెయిన్ లు పాడై పోయాయి.

చిన్న మెదడు చితికి పోయింది.

పెద్ద మెదడు పగిలి పోయింది.

ట్రంప్ కు ఏమి బుద్ధి పుట్టిందో.. మళ్ళీ ఇరాన్ కు యుద్ధ విమానాలు పంపుతున్నాడు. నిజంగా యుద్ధం అంటూ జరిగితే బంగారం టక్కున రెండు లక్షలు అయినా అయిపోతుంది.

యుద్ధం జరగకపోతే మాత్రం కాస్త తగ్గొచ్చు.

ఎంత తగ్గొచ్చు ?

ఎంత తగ్గినా అమ్మొద్దు .. రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం తప్పదు. బంగారం... కవచకుండలం.. ఇదీ నా మాట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జెన్ z, జెన్ ఆల్ఫా సంగతి..?????
Image Credit : X

జెన్ z, జెన్ ఆల్ఫా సంగతి..?????

జనాల్లో ఇంగిత జ్ఞానం, కుశాగ్ర బుద్ధి లోపించింది .

దీనితో మోసగాళ్లకు హద్దు పద్దు లేకుండా పోతోంది .

ఒక వృద్ధ జంట.

డిజిటల్ అరెస్ట్ కు భయపడి బ్యాంకు నుంచి లక్షల రూపాయిలు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేశారు.

బ్యాంకువారికి అనుమానం వచ్చి పోలీస్ లకు చెప్పారు.

పోలీస్ లు వచ్చి ..."డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. వాళ్ళు మోసగాళ్లు" అని చిలక్కి చెప్పినట్టు చెప్పారు.

నలబై రోజుల్లో సైబర్ క్రిమినల్స్ మళ్ళీ ఫోన్.

ఈ సారి బ్యాంకువారిని దబాయించి మరీ డబ్బు ట్రాన్ఫర్ చేసేసారు ఆ వృద్ధ జంట.!

బేబీ బూమెర్స్, జెన్ x ... వాళ్ళ బ్రెయిన్ చిప్స్ ఇలా చితికి పోయి ఉంటే ఇక జెన్ z.. జెన్ ఆల్ఫా సంగతి ?????

Related Articles

Related image1
Gold Price: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు, ఎంత పెరిగిందంటే...?
Related image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
34
చిప్ప కూళ్ళవారి సంఖ్య పెరుగుతోంది..
Image Credit : Getty

చిప్ప కూళ్ళవారి సంఖ్య పెరుగుతోంది..

సాక్షాతూ ప్రధాన మంత్రి "డిజిటల్ అరెస్ట్ లేదు" అని చెప్పినా ప్రతిరోజు కోట్ల రూపాయిల మోసం.

భర్తనో.. భార్యనో చంపిన వారు... పట్టుబడుతూనే ఉన్నారు.

హైటెక్ యుగంలో క్రిమినల్స్ తప్పించుకొనే అవకాశమే లేదు .

అయినా హత్యలు ఆగవు .

చిప్ప కూళ్ళవారి సంఖ్య పెరుగుతూనే పోతోంది

44
క్యాన్సర్ వ్యాక్సీన్ మంచిదేనా..?
Image Credit : Getty

క్యాన్సర్ వ్యాక్సీన్ మంచిదేనా..?

"సెర్వికల్ కాన్సర్ .. వాక్సీన్ కు సంభందించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.. వివాదాలు లేవు .." అని ఈ రోజు అన్ని పత్రికల్లో బరి తెగించి రాతలు .

గూగుల్ లో ఆ వాక్సీన్ పేరు సైడ్ ఎఫెక్ట్స్.. legal cases అని కొడితే వచ్చేస్తాయి.

ఇంత సులభంగా నిజాలు తెలుసుకొనే అవకాశం ఉన్నా జనాలు తెలుసుకోరు .

ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.. పురుషులు కూడా లైన్ లో నిల్చొని వేసుకొంటున్నారట.

కొంపలు ఏమీ అంటుకు పోవు . సంవత్సరం ఆగండి. ఇప్పుడు వేసుకొంటున్నవారిని కనీసం పది మందిని కలవండి. "వేసుకున్నాక ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవా?" అని అడగండి . అందరూ.." లేవు" అంటే వేసుకోండి . పది మందిలో ఇద్దరు సమస్య ఉందన్నా .. వేసుకోవద్దు . ఇది నా మాట.

"లేదు... వేసుకొంటాము" అని కొందరు ..

మంచిదే కదా . వేసుకోండి . వేసుకొని ఆరోగ్యంగా ఉంటే ఆ మాట ఆరు నెలల తరువాత అందరికీ చెప్పండి . సమాజానికి మంచి చేసిన వారవుతారు కదా !

లైఫ్ చాలా సింపుల్ .

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Biryani Business: బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే
Recommended image2
ATM: భారతదేశంలో మొట్టమొదటి ATM ఎక్కడ ఏర్పాటైంది? దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటో తెలుసా.?
Recommended image3
Gold Price Crash: 10 రోజుల తర్వాత దిగొచ్చిన బంగారం.. ఎంత తగ్గిందంటే?
Related Stories
Recommended image1
Gold Price: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు, ఎంత పెరిగిందంటే...?
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved