న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పార్థీవ దేహం వద్ద మాజీ కేంద్ర మంత్రి అద్వానీ కన్నీళ్లు పెట్టుకొన్నారు. సుష్మా స్వరాజ్ మృతదేహనికి బుధవారంనాడు అద్వానీ ఆయన కూతురు నివాళులర్పించారు.

బుధవారం ఉదయం అద్వానీ ఆయన కూతురు ప్రతిభ సుష్మా స్వరాజ్ కుటుంబసభ్యులను ఓదార్చారు. సుష్మా స్వరాజ్ మృతదేహం వద్దకు చేరుకోగానే  అద్వానీ కన్నీళ్లు పెట్టుకొన్నారు. అద్వానీ కూతురు ప్రతిభ కూడ  బోరున విలపించారు. 

సుష్మా స్వరాజ్ భర్త, కుమార్తెను అద్వానీ ఓదార్చారు. సుష్మా స్వరాజ్ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అద్వానీ భావోద్వేగానికి గురయ్యాడు.  ఈ మేరకు ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఈ మేరకు ఓ లేఖను కూడ ఆయన విడుదల చేశారు.

బీజేపీ ఏర్పాటైన నాటి నుండి ఎంతో చురుకుగా రాజకీయాల్లో ఆమె కొనసాగిన విషయాన్ని  ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా పనిచేసిన సమయంలో  తన టీమ్ లో సుష్మా స్వరాజ్  చురుకుగా  పాల్గొన్నారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

 ఆమె చాలా గొప్ప వక్త. ఆమె తన జ్ఞాపక శక్తితో సందర్భానుసారంగా మాట్లాడేవారని ఆయన ఆ లేఖలో వివరించారు. ఆమె ప్రతిభను చూసి తాను అబ్బుపడేవాడినని ఆయన చెప్పారు.

తన పుట్టిన రోజును గుర్తు పెట్టుకొని చాక్‌లెట్ కేక్ తీసుకొచ్చి తనకు ఇచ్చేవారని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. సుష్మా మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పొయిందని అద్వానీ అభిప్రాయపడ్డారు. ఈ లేఖను ఆయన ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

సుష్మా స్వరాజ్ ను గద్దె దింపిన ఉల్లిఘాటు

సుష్మా స్వరాజ్ ప్రేమ పెళ్లి ఓ సంచలనం

సుష్మా స్వరాజ్ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

సుష్మాని కించపరుస్తూ కామెంట్... పాక్ నెటిజన్ కి కేటీఆర్ కౌంటర్

ట్విట్టర్ ఫైటర్ ని కోల్పోయా...సుష్మామృతి పై పాక్ మంత్రి కామెంట్

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత

సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే...

సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

విద్యార్ధి నేత నుండి విదేశాంగ మంత్రిగా: సుష్మా స్వరాజ్ ప్రస్థానం

చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు