న్యూఢిల్లీ: మహిళలు పరదాలు దాటి రాని కాలంలో సుష్మా ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో అదో సంచలనం. సుష్మా భర్త పేరు స్వరాజ్ కౌశల్. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఇరువురు ప్రేమించుకున్నారు.పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ అంకురించింది.

సుష్మా, స్వరాజ్ ల వివాహానికి ఇరు కుటుంబాలవాళ్లు కూడా అంగీకరించలేదు. అయితే, సుష్మా ధైర్యసాహసాలు ప్రదర్శించి రెండు కుటుంబాలను ఒప్పించారు. దాంతో కౌశల్, సుష్మాల వివాహం 1975 జులై 13వ తేదీన జరిగింది. స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టులో ప్రఖ్యాతి వహించిన న్యాయవాది. ఆయన తన 34 ఏళ్ల వయస్సులోనే అడ్వొకేట్ జనరల్ అయ్యారు. ఆ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడు ఆయనే. 

స్వరాజ్ కౌశల్ తన 37 ఏళ్ల వయస్సులో మిజోరం గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన 1990 నుంచి 1993 వరకు ఆ పదవిలో ఉన్నారు. సుష్మా స్వరాజ్ ఆధునిక భావాలు కలిగిన భారత మహిళగా ప్రఖ్యాతి గాంచారు. 

సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందారు. ఆమె మృతి భారత ప్రజలను తీవ్రమైన ఆవేదనకు గురి చేసింది. ప్రజలతో ఆమె మమేకమైన తీరు ఆమెను ప్రజా నాయకురాలిగా నిలబెట్టింది. 

సంబంధిత వార్తలు

సుష్మా స్వరాజ్ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

సుష్మాని కించపరుస్తూ కామెంట్... పాక్ నెటిజన్ కి కేటీఆర్ కౌంటర్

ట్విట్టర్ ఫైటర్ ని కోల్పోయా...సుష్మామృతి పై పాక్ మంత్రి కామెంట్

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత

సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే...

సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

విద్యార్ధి నేత నుండి విదేశాంగ మంత్రిగా: సుష్మా స్వరాజ్ ప్రస్థానం

చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు