మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి మృతి చెందారు. మంగళవారం రాత్రి గుండెపోటుకు గురి కావడంతో ఆమెను కుటుంబసభ్యులు ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

1970లో సుష్మా స్వరాజ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీని నిరసిస్తూ ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1952 ఫిబ్రవరి 14వ తేదీన హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో సుష్మా స్వరాజ్ జన్మించారు. ఏడుదఫాలు ఎంపీగా ఆమె విజయం సాధించారు. మరో మూడు దఫాలు ఎమ్మెల్యేగా కూడ ఆమె పనిచేశారు.

విద్యార్ధి సంఘ నాయకురాలిగా ఎబివీపీలో ఆమె చురుకుగా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా సుష్మాస్వరాజ్ పనిచేశారు. సుష్మా స్వరాజ్  భర్త కౌశల్ కూడ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.

కౌశల్ మిజోరం గవర్నర్ గా కూడ పనిచేశారు. సుష్మాస్వరాజ్ కు కూతురు.  సుష్మా స్వరాజ్ పంజాబ్ యూనివర్శిటీలో లా డిగ్రీ పొందారు. 1977లో సుష్మా స్వరాజ్ పంజాబ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు.1977లో 25 ఏళ్ల వయస్సులోనే హర్యానా మంత్రిగా ఆమె బాధ్యతలు నిర్వహించారు.

1996,1998లలో వాజ్‌పేయ్ కేబినెట్ లో ఆమె మంత్రిగా పనిచేశారు. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడ సుష్మా స్వరాజ్ పనిచేశారు.1990లో రాజ్యసభలో అడుగుపెట్టారు. 

1999 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుండి కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీపై సుష్మా స్వరాజ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో ఉత్తరాఖండ్ నుండి ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2000-2003 వరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వాజ్‌పేయ్ కేబినెట్ లో పనిచేశారు. 2006 ఏప్రిల్ లో మధ్యప్రదేశ్ నుండి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2014-19 మోడీ కేబినెట్ లో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ నిర్వహించిన మహిళగా సుష్మా స్వరాజ్ ప్రసిద్ది చెందారు.

2009 నుండి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్షనేతగా సుష్మాస్వరాజ్ వ్యవహరించారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంతోనే ఆమె ఇటీవల జరిిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ఎయిమ్స్ నుండి సుష్మాస్వరాజ్ పార్థీవ దేహన్ని స్వగృహానికి తరలించారు.