న్యూఢిల్లీ:  మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు నివాళులర్పించారు.  సుష్మాస్వరాజ్ పార్థీవదేహం వద్ద ప్రధాని మోడీ నరేంద్ర మోడీ కన్నీళ్లు పెట్టుకొన్నారు.

బుధవారం నాడు ఉదయం సుష్మాస్వరాజ్ ఇంటికి వెళ్లి ప్రధానమంత్రి మోడీ కుటుంబసభ్యులను ఓదార్చారు. సుష్మా స్వరాజ్ పార్థీవదేహం వైపు తదేకంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకొన్నారు. మరోవైపు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు  రాష్ట్రపతి కోవింద్ , ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులు ఆమె పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సుష్మతో తమకు ఉన్న అనుబంధాన్ని నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. మాజీ కేంద్ర మంత్రి అద్వానీ కూడ సుష్మాస్వరాజ్ పార్ధీవ దేహం వద్ద భావోద్వేగానికి గురయ్యాడు.వాజ్‌పేయ్ మంత్రివర్గంలో అద్వానీ, సుష్మాస్వరాజ్ మంత్రులుగా పనిచేశారు.

మంగళవారం రాత్రి సుష్మాస్వరాజ్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుష్మా స్వరాజ్ గుండెపోటుకు గురి కావడంతో ఆమెను ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే.

సంబంధిత  వార్తలు

సుష్మాని కించపరుస్తూ కామెంట్... పాక్ నెటిజన్ కి కేటీఆర్ కౌంటర్

ట్విట్టర్ ఫైటర్ ని కోల్పోయా...సుష్మామృతి పై పాక్ మంత్రి కామెంట్

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత

సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే...

సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

విద్యార్ధి నేత నుండి విదేశాంగ మంత్రిగా: సుష్మా స్వరాజ్ ప్రస్థానం

చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు