న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు ప్రధానమంత్రి మోడీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. 

లోక్ సభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత సుష్మాస్వరాజ్ ట్విట్టర్ వేదికగా ఆమె మోడీపై ప్రశంసలు కురిపించారు. తన జీవితంలో ఈ రోజు కోసమే తాను వేచి చూసినట్టుగా ఆమె ట్వీట్ చేశారు.

 మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో లోక్ సభలో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందింది. భారీ మెజారిటీతో ఈ బిల్లు ఆమోదించారు. ఈ బిల్లు ఆమోదం పొందగానే ఆమె తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.

మోడీని అభినందిస్తూ ఆమె ఈ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ సుష్మా స్వరాజ్ మృతి చెందారు. 

ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ నాలుగు గంటల క్రితం చివరి ట్వీట్ చేశారు. లోక్‌సభలో జమ్మూకశ్మీర్ పునర్‌విభజన బిల్లు ఆమోదం పొందగానే ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందిస్తూ ట్వీట్ కూడా చేశారు. జీవితంలో తాను ఈ రోజు కోసమే ఎదురుచూశానని సుష్మ ట్వీట్ చేశారు.