బీజేపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్  మృతిపట్ల కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఇచ్చిన ప్రామిస్ ని నేరవేర్చకుండానే వెళ్లిపోయారు అంటూ... ఎమోషనల్ అయ్యారు.

వయసులోనూ, అనుభవంలోనూ సుష్మా స్వరాజ్.... స్మృతికి కన్నా పెద్ద. అందుకే... స్మృతీ... సుష్మాని ప్రేమగా దీదీని అని పిలేచేది. ఈ క్రమంలోనే... ట్విట్టర్ లో దీదీ అని సంభోదించి భావోద్వేగానికి గురయ్యింది.

‘నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది దీదీ(సుష్మను ఉద్దేశిస్తూ). బన్సూరీ(సుష్మ కుమార్తె)తో కలిసి నన్ను రెస్టరెంట్‌కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ఆ ప్రామిస్‌ను నెరవేర్చకుండానే నువ్వు వెళ్లిపోయావు’ అని స్మృతి ఇరానీ ట్వీట్‌ చేశారు. 

సుష్మా స్వరాజ్.. మంగళవారం రాత్రి గుండెపోటుతో ఎయిమ్స్ లో చేరారు. కాగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆమె కన్నుమూశారు. విషయం తెలియగానే స్మృతి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గత ప్రభుత్వంలో సుష్మ, స్మృతి కేబినెట్‌ మంత్రులుగా పనిచేశారు. అంతకంటే ముందు నుంచే వీరి మధ్య మంచి స్నేహబంధం ఉంది.