బీజేపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ని కించపరుస్తూ... ఓ పాకిస్తాన్ నెటిజన్ చేసిన కామెంట్ కి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

మంగళవారం రాత్రి సుష్మా స్వరాజ్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా... ఆమె మృతిపట్ల కేటీఆర్ ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి... సంతాపం తెలియజేశారు. అంతేకాకుండా గతంలో ఆమెను కలిసిన సమయంలో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఈ పోస్టుకు స్పందించిన పాకిస్తాన్‌కు చెందిన ఓ నెటిజన్.. కశ్మీర్‌పై భారత ప్రభుత్వ తీసుకున్న చర్యల ఫలితంగా ఆవిడ చనిపోయారనే ఉద్దేశాన్ని వ్యక్త పరుస్తూ.. నరకం ఎదురుచూస్తోందంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. 

‘‘సుస్మాస్వరాజ్ ఆకస్మిక మృతిపై మీరు చేసిన కామెంట్ హాస్యాస్పదం. ఈ కామెంట్ మీ వక్రబుద్ధికి అద్దం పడుతోంది. మీ ప్రొఫైల్ చూస్తుంటే పాకిస్తాన్‌కు చెందినవారిలా ఉన్నారు. మీరు ఎవరైనా సరే.. జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించటానికి కొంత ధైర్యం సంపాదించుకోగలరు’’ అని వ్యాఖ్యానించారు.

related news

ట్విట్టర్ ఫైటర్ ని కోల్పోయా...సుష్మామృతి పై పాక్ మంత్రి కామెంట్

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత

సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే...

సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

విద్యార్ధి నేత నుండి విదేశాంగ మంత్రిగా: సుష్మా స్వరాజ్ ప్రస్థానం

చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు