12:13 AM (IST) Apr 26

CSK vs SRH: చెన్నై సూపర్ కింగ్స్ అవుట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

IPL 2025 CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో వరుస ఓటముల తర్వాత స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వ‌చ్చింది. చెన్నై వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ పై స‌న్ రైజ‌ర్స్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 
 

పూర్తి కథనం చదవండి
11:24 PM (IST) Apr 25

పాక్ దుందుడుకు చర్య.. సొంత ట్రాప్ లో పాకిస్తాన్.. రెండు ముక్కలవుతుందా?

Pakistan Trapped Pok Capture Risk Heightens: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలని భారత్ సంకల్పించింది. ఉగ్రవాదులను, వారి సహాయకులను కూడా మట్టికరిపిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా చేసిన ఒక చర్య వల్ల ఇప్పుడు తానే ట్రాప్ లో చిక్కుకుపోయింది.

పూర్తి కథనం చదవండి
10:49 PM (IST) Apr 25

GMC Jammu: జమ్మూకాశ్మీర్ లో హైఅలర్ట్.. దేనికైనా సిద్ధంగా ఉండండి.. మెడికల్ స్టాఫ్ సెలవులు కట్

GMC Jammu on High Alert: జమ్మూ కాశ్మీర్‌లో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (GMC), జమ్మూ లోని సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందంతా విధుల్లో పూర్తిగా హాజరై ఉండాలనీ, అవసరమైతే వెంటనే సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
 

పూర్తి కథనం చదవండి
10:30 PM (IST) Apr 25

Kashmir terror Attack: భారత్‌ను వీడకుంటే క్రిమినల్‌ కేసులు.. పాకిస్తానీయుకు వార్నింగ్‌... ఇప్పటికే 180 మంది! 

Kashmir terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఇండియాకి వీసాపై వచ్చిన పాకిస్తానీయులు తిరిగి వారి దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి పాకిస్తానీయులు స్వదేశానికి పయనమయ్యారు. ఇక పాక్‌లో ఉన్న భారతీయులు సైతం ఇండియాకి వచ్చేస్తున్నారు. 

 

పూర్తి కథనం చదవండి
09:33 PM (IST) Apr 25

సినిమాలు ఫ్లాప్, విడాకులు.. స్టార్ హీరో ఇప్పుడు బిజినెస్ మాగ్నెట్!

తమిళ సినీ నటుడు ప్రశాంత్ త్యాగరాజన్ ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద నగల షాపింగ్ కేంద్రం అయిన ప్రశాంత్ రియల్ గోల్డ్ టవర్ వ్యవస్థాపక అధ్యక్షుడు. సినిమాల నుండి వ్యాపార రంగానికి ఆయన చేసిన ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది.

పూర్తి కథనం చదవండి
08:43 PM (IST) Apr 25

భారత్ దుస్సాహసం చేస్తే ఊరుకోం : పాక్ నేతల కౌంటర్ ఎటాక్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరు దేశాల నాయకుల మధ్య మాటలయుద్దం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి సీరియస్ కామెంట్స్ చేసారు. 

పూర్తి కథనం చదవండి
08:41 PM (IST) Apr 25

రియల్ లైఫ్ లో పర్ఫెక్ట్ కపుల్, కానీ సినిమాల్లో మాత్రం చెత్త రికార్డు ఈ జంట పేరుపైనే..

కాజోల్, అజయ్ దేవగన్ జంటగా నటించిన సినిమాలు కొన్ని సూపర్ హిట్ అయితే, మరికొన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వాళ్ళ సినిమా ప్రయాణం గురించి తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
08:30 PM (IST) Apr 25

జాట్ హీరో మామూలోడు కాదుగా, అప్పట్లో ఎంతమంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నాడో తెలుసా 

డింపుల్ కపాడియా నుండి రవీనా టాండన్ వరకు, సన్నీ దేఓల్ చాలా మంది నటీమణులతో సంబంధాలు కలిగి ఉన్నారు. చివరికి ఎవరు ఆయన హృదయాన్ని గెలుచుకున్నారు? నటుడి కథ తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
08:30 PM (IST) Apr 25

ప్రధాని మోడీని చంపుతాం.. ల‌ష్క‌రే తోయిబా చీఫ్ హ‌ఫీజ్ స‌యీద్ వార్నింగ్.. వీడియో వైరల్

Warning to kill Modi: పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారత్-పాకిస్తాన్ మ‌ధ్య ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ పై భార‌త్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఉగ్ర‌వాద సంస్థ‌ లష్కరే తోయిబా అధినేత, ముంబై దాడుల సూత్రధారి అయిన‌ హఫీజ్ సయీద్.. ప్రధాని మోడీని చంపేస్తామంటూ వార్నింగ్  ఇచ్చిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.
 

పూర్తి కథనం చదవండి
07:55 PM (IST) Apr 25

పాకిస్థాన్ లో బాంబు పేలుడు... ఏడుగురు సైనికులు మృతి

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ దాయాది ఆర్మీకి షాక్ తగిలింది. బాంబు దాడిలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇంతకూ ఈ బాంబు దాడి ఎవరు చేసారో తెలుసా? 

 

 

పూర్తి కథనం చదవండి
07:35 PM (IST) Apr 25

Free DSC Coaching: డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్‌ .. ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌!

Free DSC Coaching in AP: డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తులను అభ్యర్థులు నమోదు చేస్తుండగా.. మరోవైపు కోచింగ్‌కు సిద్దమవుతున్నారు. ఈక్రమంలో అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షకు సన్నద్దం అవుతున్న అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
07:26 PM (IST) Apr 25

బైసరన్ వ్యాలీలో భద్రత ఎందుకు కల్పించలేదు? : కేంద్రం సమాధానమిదే

ఉగ్రదాడుల సమయంలో ఈ బైసరన్‌ వ్యాలీలో సైన్యం లేకపోవడంపై కేంద్రం వివరణ ఇచ్చింది. మరి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో భద్రత ఎందుకు కల్పించలేదో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
06:40 PM (IST) Apr 25

ఇండియాపై ఎయిర్ స్ట్రైక్ కు సిద్ధం: పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Pahalgam Terrorist Attack: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇండియాతో యుద్దానికి సిద్దమంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారతదేశం దాడి చేస్తే ధీటుగా రియాక్ట్ అవుతామని అన్నారు.

పూర్తి కథనం చదవండి
06:21 PM (IST) Apr 25

సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ ఓటీటీలోకి వచ్చేసింది, ఎక్కడ చూడొచ్చో తెలుసా ?

చిన్న పట్ణంలో సినిమా తీయాలనే కలతో, ఆశ, స్నేహం, కథ చెప్పే శక్తిని చాటే హృద్యమైన చిత్రం 'సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్' ఈ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి కథనం చదవండి
06:03 PM (IST) Apr 25

పహల్గాం ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులా..! :  బరితెగించిన పాక్ ఉపప్రధాని

 పహల్గాం దాడిని ఖండిస్తున్నట్లు నటించిన పాక్ తాజాగా తన అసలు రంగు బైటపెట్టారు. పాక్ ఉపప్రధాని ఉగ్రవాదులను మీడియా ముందే పొగుడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.  

పూర్తి కథనం చదవండి
05:36 PM (IST) Apr 25

గుడ్ న్యూస్.. రేపు మీ అకౌంట్లలోకి రూ. 20 వేలు

AP government Rs 20,000 scheme: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని శుక్రవారం ప్రారంభించనుంది. ఈ పథకంతో చాలా మందికి ప్రయోజనం కలగనుంది. రేపు మీ అకౌంట్లలో రూ.20 వేల రూపాయలు జమ అవుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి
05:12 PM (IST) Apr 25

తెలివైన పెట్టుబడి: మ్యూచువల్ ఫండ్‌ను కాలిక్యులేటర్‌తో ఎలా జత చేయాలి

మ్యూచువల్ ఫండ్స్ అనేవి రోజువారీ పెట్టుబడిదారులకు శక్తివంతమైన మరియు అందుబాటులో ఉండే ఎంపిక. ముఖ్యంగా డిజిటల్ MF కాలిక్యులేటర్‌తో కలిపి ఉపయోగించినప్పుడు ఈ కలయిక మీ ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేయడంలో, కట్టుబడి ఉండటంలో మరియు ట్రాక్‌లో ఉండటంలో మీకు సహాయపడుతుంది.

పూర్తి కథనం చదవండి
04:09 PM (IST) Apr 25

భారత్ ను రెచ్చగొడుతున్న పాక్.. 1972 సిమ్లా ఒప్పందం రద్దు.. ఏంటీ ఈ సిమ్లా ఒప్పందం?

1972 Simla Agreement-Impact on India-Pakistan Relations: 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత కుదిరిన చారిత్రాత్మక 1972 సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ తాజాగా రద్దు చేసింది. అసలు ఏంటీ సిమ్లా ఒప్పందం? భారత్ -  పాకిస్తాన్ సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

 

పూర్తి కథనం చదవండి
03:52 PM (IST) Apr 25

Film Shootings in Kashmir: కశ్మీర్‌లో సినిమా షూటింగ్‌లు రద్దు.. ఆ అందాలు ఇప్పట్లో చూడటం కష్టమే!

Film Shootings Cancelled in Kashmir: ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో సినిమా షూటింగ్‌లు అన్నీ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. టాలీవుడ్‌తోపాటు, బాలీవుడ్, కోలీవుడ్‌, మాలివుడ్‌ ఇలా అన్ని రాష్ట్రాలకు చెందిన సినిమా షూటింగ్‌లను పూర్తిగా రద్దు చేసుకుని ప్రత్యామ్నాయ లోకేషన్లను ఎంచుకుంటున్నారు. దీంతో భవిష్యత్తులో ఇక కశ్మీర్‌ అందాలను కనీసం సినిమాల్లో అయినా చూస్తామా లేదా అన్న అనుమానం కలుగుతోంది. 

పూర్తి కథనం చదవండి
03:42 PM (IST) Apr 25

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరంగన్ కన్నుమూత... ప్రధాని మోదీ నివాళి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మాజీ ఛైర్మన్, మాజీ ఎంపీ కస్తూరిరంగన్ కన్నుమూసారు. ఆయన సేవలను గుర్తుచేసుకుని నివాళి అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. 

పూర్తి కథనం చదవండి