పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరు దేశాల నాయకుల మధ్య మాటలయుద్దం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి సీరియస్ కామెంట్స్ చేసారు. 

పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ భారత్ కు కౌంటర్ ఇచ్చారు. 'దుస్సాహసం' చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారత్ ను హెచ్చరించారు. తమ సైన్యం ఏ సవాళ్లకైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. 

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు. భారత దాడిలో ఒక్క పాకిస్తాన్ పౌరుడు చనిపోయినా భారత్‌కు తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించాడు. ఇండియాకు తగిన బుద్ధి చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామంటూ కవ్వించేలా మాట్లాడారు. 

ఇదిలావుంటే భారత నౌకాదళం మధ్యస్థ శ్రేణి ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. భారత వైమానిక దళం రాఫెల్ జెట్‌లతో సహా ప్రధాన యుద్ధ విమానాలతో సమగ్ర కార్యాచరణ విన్యాసాన్ని నిర్వహించింది. ఇలా భారత్ ఆయుధాలను సిద్దం చేసుకోవడం పాాకిస్థాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అందువల్లే అంతర్జాతీయ సమాజం ముందు భారత్ రెచ్చగొడుతోందని చూపించే ప్రయత్నం చేస్తోంది పాక్.