Film Shootings Cancelled in Kashmir: ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో సినిమా షూటింగ్‌లు అన్నీ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. టాలీవుడ్‌తోపాటు, బాలీవుడ్, కోలీవుడ్‌, మాలివుడ్‌ ఇలా అన్ని రాష్ట్రాలకు చెందిన సినిమా షూటింగ్‌లను పూర్తిగా రద్దు చేసుకుని ప్రత్యామ్నాయ లోకేషన్లను ఎంచుకుంటున్నారు. దీంతో భవిష్యత్తులో ఇక కశ్మీర్‌ అందాలను కనీసం సినిమాల్లో అయినా చూస్తామా లేదా అన్న అనుమానం కలుగుతోంది. 

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై దేశంలోని ప్రతి పౌరుడు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కశ్మీర్‌లో ఆర్మీ వర్సెస్‌ తీవ్రవాదులు అన్నట్లు మారిపోయింది. ఈ దాడులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌ల కోసం ఇప్పటికే ప్లాన్‌ చేసుకున్న దర్శకులు, నిర్మాతలు వారి ప్లాన్‌ను మార్చేసుకున్నారు. 

కశ్మీర్‌లోని లోయలు అక్కడి సహజ సిద్ద అందాలు అందరినీ ఆకర్షిస్తాయి. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున సినిమా షూటింగ్‌లు అక్కడ జరుగుతుంటాయి. ఈ సమ్మర్‌ రెండు నెలలుపాటు నిరివిరామంగా పలు సినిమాల షూగింగ్‌లు జరిపించేలా పలువురు నిర్మాతలు ప్లాన్‌ చేశారు. ఇక తాజాగా ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వాటిని పూర్తిగా రద్దు చేసుకున్నారు. 

ఇప్పటికే జమ్మూకశ్మీర్‌ నుంచి సుమారు 3వేల మంది పర్యాటకులు వారి ఇళ్లకు చేరుకున్నారు. చాలా మంది వెళ్లాలనుకున్న వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. టాలీవుడ్ విషయంలో కూడా ఇదే పరిస్థితి, రాబోయే రెండు నెలలపాటు కాశ్మీర్‌లో జరగాల్సిన షూటింగులు రద్దు చేసుకున్నారు. పహల్గామ్, సమీపంలోని ప్రాంతాలలో కొన్ని సినిమాలకు షూటింగ్‌లు ప్లాన్‌ చేసుకోవగా.. కానీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో వాటిని పూర్తి రద్దు చేసుకున్నారు. 

తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ బడా హీరో సినిమా కూడా జమ్మూ కశ్మీర్‌లో చిత్రీకరించాల్సి ఉండగా.. దాన్ని రద్దు చేసుకుని మరో లోకేషన్‌లో షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారంట. దీనినిబట్టి అసలు సమీప భవిష్యత్తులో కశ్మీర్‌ అందాలను కనీసం సినిమాల్లో చూడాలనుకునే వారి ఆశలుసైతం అడియాసలు అయ్యాయని భావించవచ్చు.