MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • ప్రధాని మోడీని చంపుతాం.. ల‌ష్క‌రే తోయిబా వార్నింగ్.. వీడియో వైరల్

ప్రధాని మోడీని చంపుతాం.. ల‌ష్క‌రే తోయిబా వార్నింగ్.. వీడియో వైరల్

Warning to kill Modi: పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారత్-పాకిస్తాన్ మ‌ధ్య ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ పై భార‌త్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఉగ్ర‌వాద సంస్థ‌ లష్కరే తోయిబా అధినేత, ముంబై దాడుల సూత్రధారి అయిన‌ హఫీజ్ సయీద్.. ప్రధాని మోడీని చంపేస్తామంటూ వార్నింగ్  ఇచ్చిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 25 2025, 08:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Lashkar -e -Taiba chief Hafiz Saeed Warning to kill Modi: భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. డ‌జ‌న్ల మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ దాడుల  వెనుక పాకిస్తాన్ హ‌స్తం ఉంద‌ని గుర్తించిన భార‌త్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. పాకిస్తాన్ తో చేసుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1960 సింధు జలాల ఒప్పందాన్ని కూడా భార‌త్ ర‌ద్దు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే పాక్ కు అన్ని వివ‌రాలు అందించిన‌ట్టు స‌మాచారం. దీంతో  ఇరు దేశాల మ‌ధ్య   ఉద్రిక్త‌త‌లు మ‌రింత ముదిరాయి. పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం ర‌ద్దుతో పాటు భారత్ కు గ‌గ‌న‌త‌లం మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. స‌రిహ‌ద్దుల‌కు యుద్ధ విమానాలు మోహ‌రించ‌డం, పాక్ నేత‌ల వ్యాఖ్య‌ల‌తో భార‌త్ ను మ‌రింత రెచ్చ‌గొట్టే చర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. 

35

దీంతో భార‌త్ పాకిస్తాన్ తో అన్ని ఒప్పందాలు క‌ట్ చేసుకోవ‌డంతో పాటు దేశంలో ఉన్న పాకిస్తానీలు వెంట‌నే వెళ్లిపోవాల‌నీ, వారి వీసాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ఇప్పుడు సింధు జ‌లాల విష‌యం హాట్ టాపిక్ గా మారింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలైతే, సింధు నదిపై అధికంగా ఆధారపడే పాకిస్తాన్ నీటి కొరతతో అల్లాడే పరిస్థితిలోకి జారుకుంటుంది. 

45

ఈ క్ర‌మంలోనే గ‌తంలో సింధు జ‌లాల విష‌యంలో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌లు పెరిగిన‌ప్పుడు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన పాత‌ వీడియోలు వైర‌ల్ గా మారాయి. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గ‌తంలో మోడీ శ్వాస ఆపుతామంటూ హెచ్చ‌రిక‌లు చేశారు. "మీరు పాకిస్తాన్‌కు నీళ్లు ఆపితే, మేము మీ శ్వాస ఆపుతాం" అంటూ కామెంట్స్ చేశాడు. 

"మీరు కాశ్మీర్ లో డ్యామ్ కట్టి నీళ్లు ఆపితే మేము మీ శ్వాస ఆపుతాం.. ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుందంటూ" హఫీజ్ గతంలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ ఉగ్రవాదులు ఇప్పుడు ఆ వీడియోను వైరల్ చేస్తూ పాకిస్తానీలను రెచ్చగొడుతున్నారని సమాచారం. 

మోడీని చంపుతామంటూ హఫీజ్ వార్నింగ్ వీడియో ఇక్కడ చూడండి

55

భారత్-పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందం ఏమిటి? 

1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ లు సింధు జ‌లాల‌పై సంతకం చేశారు. ఇందులో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌పై పాక్‌కు ఎక్కువ హక్కులు ఇచ్చారు. భారత్ ఈ నదులపై కేవలం నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి కోసం పరిమిత ప్రాజెక్టులు చేపట్టగలదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
పాకిస్తాన్
నరేంద్ర మోదీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
Recommended image2
Now Playing
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood
Recommended image3
Now Playing
నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved