సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ ఓటీటీలోకి వచ్చేసింది, ఎక్కడ చూడొచ్చో తెలుసా ?
చిన్న పట్ణంలో సినిమా తీయాలనే కలతో, ఆశ, స్నేహం, కథ చెప్పే శక్తిని చాటే హృద్యమైన చిత్రం 'సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్' ఈ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది.

నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన హృద్యమైన చిత్రం 'సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్' ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. ఇది అమెజాన్ MGM స్టూడియోస్ ఒరిజినల్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ,టైగర్ బేబీ నిర్మాణంలో, రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ మరియు రీమా కాగ్టి వంటి ప్రముఖ నిర్మాతలతో రూపొందింది. ఈ చిత్రానికి రీమా కాగ్టి దర్శకత్వం వహించగా, వరుణ్ గ్రోవర్ రచన చేశారు. ఆదర్శ్ గౌరవ్, వినీత్ కుమార్ సింగ్ ,శశాంక్ అరోరా నటించారు.
కథాంశం : మలేగావ్ అనే చిన్న పట్ణంలోని నాసిర్ షేక్ అనే ఆశావహ సినీ దర్శకుడి చుట్టూ కథ తిరుగుతుంది. బాలీవుడ్ సినిమాలే వారి జీవితాలకు ఆనందాన్నిస్తాయి. తన పట్టణ ప్రజల కోసం ఒక సినిమా తీయాలనే తపనతో, నాసిర్ తన స్నేహితులను సమీకరించి సినిమా తీస్తాడు. స్నేహం, ఆశయం, సినిమా శక్తి వంటి అంశాలను ఈ చిత్రం చర్చిస్తుంది.
ప్రశంసలు, పురస్కారాలు: 49వ టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రపంచ ప్రీమియర్‌లో ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది. 36వ పామ్ స్ప్రింగ్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో యంగ్ సినీస్ట్ అవార్డు విభాగంలో ప్రత్యేక ప్రస్తావన పొందింది. మొదటి నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.