తన ఫాంహౌజ్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహం నడుపుతున్న బీజేపీ నేత బెర్నార్డ్‌ మరాక్‌ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

లక్నో : ఆదర్శాలు చెప్పాల్సినవారే అక్రమాలకు పాల్పడినట్టు.. జనాలకు తప్పొప్పులు చెప్పాల్సిన బీజేపీ నేత తన ఫామ్ హౌస్ లో అక్రమంగా brothel నడుపుతూ పట్టుబడ్డారు. ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ బిజెపి నాయకుడు Bernard Marakను ఉత్తరప్రదేశ్ పోలీసులు హాపుడ్ జిల్లాలో అరెస్టు చేశారు. అతడిని మేఘాలయ పోలీసులకు అప్పగించినట్లు హాపుడ్ జిల్లా ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు. మేఘాలయ BJP ఉపాధ్యక్షుడైన బెర్నార్డ్ కు చెందిన ఫామ్ హౌస్ కి శనివారం పోలీసులు రైడింగ్ చేశారు. అక్కడ గుట్టుగా నడుపుతున్న వ్యభిచార గృహం నుంచి ఆరుగురు మైనర్ లను కాపాడారు. ఈ కేసులో మొత్తం 73 మందిని అరెస్టు చేశారు.

ఆ తర్వాత బెర్నార్డ్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అయితే, అప్పటికే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బెర్నార్డ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. బెర్నార్డ్ ను మేఘాలయాలోని తురకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు, ఆ రాష్ట్ర పోలీసులు అతన్ని తీసుకువెళ్లేందుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

బిజెపి ఉపాధ్యక్షుడి వ్యభిచార దందా... ఫార్మ్ హౌస్ లో మైనర్ బాలికలతో సహా 73 మంది

ఇదిలా ఉండగా జూలై 24న మేఘాలయలోని పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్‌ మరాక్‌ కు చెందిన ఫాంహౌజ్ లో భారీ ఎత్తున వ్యభిచార దందా సాగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకుడుకి చెందిన వ్యవహారం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరించావారు. పోలీసులు ముందుగా ఫాంహౌజ్ పై ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లుగా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఫామ్ హౌస్కు భారీగా చేరుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. పోలీసుల దాడిలో ఇద్దరు అమ్మాయిలు, నలుగురు యువకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

విదేశీ మహిళలతో వ్యభిచారం.. ఢిల్లీలో బట్టబయలు చేసిన పోలీసులు

అలా మొత్తంగా 37మంది ఈ వ్యభిచార దందాతో సంబంధం ఉన్నవారిని అరెస్టు చేసినట్లు స్థానిక జిల్లా ఎస్పీ వెల్లడించారు. అలాగే భారీగా మద్యం బాటిల్ లు, కండోమ్ ప్యాకెట్లు, 27 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పరిచామని, మైనర్ బాలికలను మాత్రం రెస్క్యూ హోంకు తరలించామని పోలీసులు తెలిపారు. ఈ వ్యభిచార దందాపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే, తన ఫామ్ హౌస్ పై దాడి,వ్యభిచారం జరుగుతున్న దుష్ప్రచారం తదితర వ్యవహారమంతా సీఎం కొన్రాడ్ సంగ్మా ఆదేశాలతో జరిగినట్లు బెర్నార్డ్‌ మరాక్‌ పేర్కొన్నారు. ఇలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండానే ఏకంగా డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు స్వయంగా తన ఫాంహౌస్ పై దాడికి దిగారు.. అంటే దీని వెనుక ఉన్నది ఎవరో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. తనను సీఎం టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నాడని బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్‌ మరాక్‌ అన్నారు.