కేరళ నరబలి: ప్రైవేట్ పార్ట్ లో కత్తి దించి.. వక్షోజాలను కోసి..
కేరళ నరబలి ఉదంతం దేశవ్యాప్తంగా సంచలన రేపుతోంది. నరబలి ఇస్తే...డబ్బు వస్తుందనే మూఢనమ్మకంతో దంపతులతో సహా ముగ్గురు వ్యక్తులు ఇద్దరు మహిళలను అత్యంత దారుణంగా హింసించి హత్య మార్చారు. ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దారుణాలను పరిశీలిస్తే.. ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంది.
కేరళ నరబలి ఉదంతం.. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. మూఢనమ్మకాలతో ఆర్థికంగా చితికిపోయిన ఇద్దరు మహిళలకు డబ్బు ఆశ చూపి.. అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులు(దంపతులతో సహా) తమ నేరాన్ని అంగీకరించడంతో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడుతున్నాయి. పోర్న్ చిత్రంలో నటిస్తే.. భారీ మొత్తంలో నగదు ఇస్తామని ప్రలోభపెట్టి మహిళలను అత్యంత దారుణంగా హింస పెట్టి.. శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ ను కోసి హత్య చేశారు. అనంతరం వారి రక్తాన్ని ఇంట్లో.. ఇంటి చూట్టు చల్లారు. అనంతరం వారి శరీర భాగాలను వండుకుని తిన్నారట.
మొదటి నరబలి..
జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. బాధితుల్లో ఒకరైన రోజ్లిన్ ని షామీ కలిసి.. పోర్న్ మూవీలో నటిస్తే.. రూ. 10 లక్షలు ఇస్తాననీ ఆఫర్ చేశారట. అందుకు అంగీకరించిన రోజ్లిన్ ని పతనంతిట్టలోని
భగవంత్ సింగ్ ఇంటికి రప్పించారు. ఆమె తమ ఇంటికి చేరుకోగానే, షూట్‌లో భాగమని చెప్పి.. ఆమెను వివస్త్రను చేసి.. చేతులు మరియు కాళ్లను జంట కట్టేశారు. నిందితుల్లో ఒకరు లైలా బాధితురాలి తలపై రాడుతో బలంగా కొట్టింది. దీంతో రోజ్లిన్ సృహా కోల్పోయింది. అనంతరం బాధితురాలి ప్రైవేట్ భాగాలలో కత్తిని చొప్పించి.. చిత్రహింసలకు గురి చేసింది. తర్వాత బాధితురాలి గొంతు కోసి అత్యంత క్రురంగా హతమొందించింది. రెండవ నిందితుడు భగవాల్ క్షుద్ర కర్మలో భాగంగా బాధితురాలి ఎద భాగాన్ని కోసి..భద్రంగా పరిచాడు. మహిళను ప్రలోభపెట్టి ఇంట్లోకి రప్పించిన మహ్మద్ షఫీతోపాటు నిందితులందరూ బాధితురాలి మృతదేహాన్ని ముక్కలుగా నరికి... ఇంటి సమీపంలోని గుంతల్లో పాతిపెట్టారు.
రెండో నరబలి..
రెండో బాధితురాలు పద్మ సెప్టెంబరు 26న కనిపించకుండా పోయిందని, అదే రోజు పద్మను కారులో తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆమెను కూడా పోర్న్ సినిమాలో నటిస్తే.. రూ.15వేలు ఇస్తానని ఆఫర్ చేశాడు. అందుకు బాధితురాలు పద్మ అంగీకరించింది. దీంతో ఆమెను షఫీ.. భగవాల్ ఇంటికి తీసుకెళ్లాడు. అయితే.. ఇంటికి చేరుకోగానే పద్మ డబ్బులు అడగడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో నిందితుడు భగవాల్ ఆమె మెడకు ప్లాస్టిక్ తాడుతో ఉరిబిక్కించారు. దీంతో ఆ మహిళ అపస్మారక స్థితిలో పడిపోయింది, ఆ బాధితురాలిని గదికి తరలించారు. ఆ తర్వాత షఫీ తన ప్రైవేట్ భాగాల్లోకి కత్తిని చొప్పించి.. ఆ తర్వాత ఆమె గొంతు కోశాడు. అనంతరం.. ముగ్గురు నిందితులు ఆమె మృతదేహాన్ని 56 ముక్కలుగా నరికి గుంతల్లో పాతిపెట్టారు.
ఈ దారుణ హత్యకు ప్రధాన సూత్రధారి షఫీ అని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ నాగరాజు చకిలం బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ నేరానికి పాల్పడేలా దంపతులను ఒప్పించాడనీ, గతంలో షఫీ పై అత్యాచారం కేసులో నమోదు అయ్యిందని పోలీసులు తెలిపారు. కాగా, ముగ్గురు నిందితులు భగవాల్, లైలా, షఫీలకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. తదుపరి విచారణ జరుగుతోంది.