భారతదేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా కేసులు బయటపడిన నాటి నుంచి ఆయన సమగ్ర ప్రణాళికతో యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు.

Also Read:ఉద్థవ్‌ను ఎమ్మెల్సీగా నియమించండి: గవర్నర్‌ను కోరిన మహారాష్ట్ర ప్రభుత్వం

ఈ నేపథ్యంలో మరో వినూత్న కార్యక్రమంతో ముందుకొచ్చారు కేజ్రీవాల్. ‘‘SHIELD’’ అనే పేరుతో.. దేశ రాజధాని కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 21 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన సీఎం షీల్డ్ గురించి వెల్లడించారు. 

SHIELD అంటే ఇదే:

* ఇందులో ఎస్ అంటే సీలింగ్.. గుర్తించిన ప్రాంతాలను సీల్ చేస్తాం. అంటే ప్రజలెవ్వరూ బయటకు వెళ్లకూడదు. బయటి  నుంచి ఇక్కడికి రాకూడదు. 
* ‘హెచ్’ అంటే హోం క్వారంటైన్ ... ప్రజలు వారి ఇళ్లలోనే ఉండాలి
* ‘ఐ’ అంటే ఐసోలేషన్ అండ్ ట్రేసింగ్. కరోనా కలిగిన వ్యక్తితో మెలిగిన మొదటి, రెండో కాంటాక్ట్‌ను ఐసోలేషన్ చేయడం, వారిని గుర్తించడం
* ‘ఈ’ అంటే ఎసెన్షియల్ సర్వీస్.. హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి నేరుగా నిత్యావసర సరకులను అందజేయడం
* ‘ఎల్’ అంటే లోకల్ శానిటైజేషన్.. గుర్తించిన ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచడం
* ‘డీ’ అంటే డోర్ టు డోర్ చెకింగ్.. దీని కింద ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబసభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణం పరీక్షలు నిర్వహించడం

Also Read:లాక్‌డౌన్‌తో విషాదం : పుట్టింటికి వెళ్లిన భార్య రాలేదని... భర్త ఆత్మహత్య

ఢిల్లీలోని మొత్తం 21 ప్రాంతాల్లో ఈ షీల్డ్ కార్యక్రమాన్ని చేపడతామని కేజ్రీవాల్ల స్పష్టం చేశారు. ప్రస్తుతం 71 లక్షల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఢిల్లీలో మాస్కు ధరించడం తప్పనిసరి అని అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. కాగా దేశ రాజధానిలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 669కి చేరింది.