ఈ రాశివాళ్లు స్మార్ట్ ఫోన్ కు బానిసలు..
చాలా కొద్ది మంది మాత్రమే స్మార్ట్ ఫోన్ ను అవసరానికే వాడుతారు. కానీ చాలా మంది మాత్రం ఫోన్ అవసరం లేకున్నా పొద్దంతా వాడుతూనే ఉంటారు. అసలు రోజంతా ఫోన్ లోనే గడుపుతారు. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారు స్మార్ట్ ఫోన్ కు బానిసలు. వీళ్లు ఫోన్ ను వాడకుండా అస్సలు ఉండలేరు.
astrology
మనుషుల మధ్య సంబంధాలు తగ్గి.. స్మార్ట్ ఫోన్ కు మనిషికి విడదీయరాని సంబంధం ఏర్పడింది ప్రస్తుత కాలంలో. స్టార్ట్ ఫోన్ లేకుండా నిమిషం కూడా గడవని వారు లోకంలో చాలా మందే ఉన్నారు. అవసరానికి వాడితే సమస్యేం లేదు కానీ అవసరం లేకున్నా వాడితేనే పెద్ద ప్రాబ్లం. ఈ సంగతి పక్కన పెడితే స్మార్ట్ ఫోన్ ను తెగవాడేసే రాశివారు ఎవరని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈ రోజు ఫోన్ బాగా అలవాటు పడిన టాప్ 5 రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Aries daily horoscope
మేష రాశి
ఫోన్ బానిసలుగా మారిన రాశుల్లో మేషరాశి వారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. లోకంతో పాటుగా తాము పరుగెత్తడానికి ఈ రాశివాళ్లు ఎప్పుడూ కూడా ఫోన్లపైనే ఆధారపడతారు. వాటిని విడిచి ఈ రాశివారు ఉండలేరు. మేష రాశి వారు జీవితాంతం సందేశాలు, ట్వీట్లకు కట్టుబడి ఉంటారు. వీళ్లకు ఫోన్లు లేకుండా ఉండటం క్షణమొక యుగంలా ఉంటుంది.
Gemini daily horoscope
మిథున రాశి
ఫోన్లకు బాగా అడిక్ట్ అయిన రాశుల్లో మిథున రాశి వారు రెండో ప్లేస్ లో ఉన్నారు. మిథున రాశి వారు సోషల్ మీడియా ప్రపంచంలో బాగా గడుపుతారు. ఈ రాశివారికి సోషల్ మీడియా పట్ల కుతూహలం, ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. దీంట్లోనే వీళ్లు ఓదార్పు పొందుతారు. స్క్రోలింగ్ నుంచి అంతులేని ఫీడ్ల వరకు వీళ్ల ఆలోచనలను పంచుకోవడం వీరికి చాలా ఇష్టం. అందులో మిథున రాశి వారు తమ సమయాన్నంతా ఫోన్లోనే గడుపుతారు. వీరి ద్వంద్వ స్వభావం వారి ఆన్లైన్ ప్రపంచంలో ప్రతిబింబిస్తుంది. ఇది వీరిని ఫోన్ వ్యసనపరుల జాబితాలో చేరుస్తుంది.
సింహ రాశి
అందరి దృష్టిని ఆకర్షించడంలో సింహ రాశి వారు ముందుంటారు. సింహరాశి వారికున్న దృష్టిని ఆకర్షించే స్వభావం వారిని సహజంగానే సెల్ఫీ ఔత్సాహికులను చేస్తుంది. లైకుల కోసం వీరి ఆరాటం మామూలుగా ఉండదు. ఇందుకోసం వీరు వారి పర్సనల్ ఇమేజెస్ ను పెడతారు. సెల్ఫీలు తీసుకోవడంలో వీరికి తిరుగులేదు.
తులారాశి
సమతుల్యత, సామరస్యానికి ప్రతీక అయిన తులారాశి వారు ఫోన్ కు అడిక్ట్ అయిన రాశుల్లో నాల్గో స్థానంలో ఉన్నారు. తులారాశి వారు సంబంధాలను నిర్మించడంలో ముందుంటారు. కానీ వీరికి ఫోన్ పట్ల అమితమైన ప్రేమ. ఫోన్ లేనే స్నేహితులతో చాట్ చేస్తారు. వీళ్లకు డిజిటల్ సంభాషణలోనే ఓదార్పు లభిస్తుంది.
Daily Aquarius Horoscope
కుంభ రాశి
కుంభరాశివారికి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. అందుకే టాప్ 5 ఫోన్ వ్యసనపరుల్లో కుంభరాశివారు ఉన్నారు. ముందుచూపు, సృజనాత్మక ఆలోచనలకు పేరుగాంచిన ఈ రాశివారు సాంకేతిక పరిజ్ఞానాన్ని రెండు చేతులతో స్వీకరిస్తారు. వీళ్లు ఎప్పటికప్పుడు లేటెస్ట్ యాప్స్, గ్యాడ్జెట్లను అన్వేషిస్తూ డిజిటల్ పోకడలను ముందుగానే అనుసరిస్తారు. కుంభ రాశి వారికి ఫోన్ అనేది కేవలం ఒక పరికరం మాత్రమే కాదు. ఇది వారి భవిష్యత్ ఆలోచనలకు ప్రవేశ ద్వారంగా భావిస్తారు.