Asianet News TeluguAsianet News Telugu

17 ఏళ్ల వయస్సులో అంజలి ప్రేమలో.. మారువేషంలో డేట్.. సచిన్ టెండూల్కర్ 'లవ్ స్టోరీ'..

Sachin Tendulkar Love Story : భారత క్రికెట్ దేవుడు అని పిలుచుకునే సచిన్ టెండూల్కర్‌కు దేశ‌విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మాస్టర్ బ్లాస్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ క్రికెటర్ 17 ఏళ్ల వయసులో అంజ‌లి ప్రేమవలలో చిక్కాడు. 

Love with Anjali at the age of 17.. Date in disguise.. Sachin Tendulkar's 'Love Story'.. RMA
Author
First Published Apr 26, 2024, 10:13 AM IST

Sachin Tendulkar Love Story : లెజెండ‌రీ క్రికెట‌ర్, టీమిండియా క్రికెట్ దేవుడు అని పిలుచుకునే మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్కర్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు. ఏప్రిల్ 24, 1973 న బొంబాయిలోని దాదర్‌లో మరాఠీ నవలా రచయిత-కవి రమేష్ టెండూల్కర్, అతని భార్య రజనీ దంపతులకు జన్మించిన సచిన్ చిన్నప్పటి నుండి క్రికెటర్ కావాలనుకున్నాడు. 16 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించిన 'మాస్టర్ బ్లాస్టర్' లెక్కలేనన్ని రికార్డులు సృష్టించాడు.

1995లో సచిన్ టెండూల్కర్ అంజలి మెహతాను వివాహం చేసుకున్నాడు. వీరి ల‌వ్ స్టోరీలో చాలా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఉన్నాయి. 1997లో సచిన్-అంజలికి సారా టెండూల్కర్ మొదటి సంతానం, వారి కుమారుడు అర్జున్ టెండూల్కర్ 1999లో జన్మించారు. సచిన్ జీవితంలోని అన్ని ఒడిదుడుకుల్లో అంజలి ఎప్పుడూ పాలుపంచుకునేది. సచిన్ కంటే ఆరేళ్లు పెద్దదైనప్పటికీ వారి బంధానికి వయసు అడ్డురాలేదు.

ఎయిర్‌పోర్ట్‌లో సచిన్‌ను వెంబడించిన అంజ‌లి..

సచిన్ టెండూల్కర్‌తో ఎలా ప్రేమలో పడిందో అంజ‌లి ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు. 'నాకు క్రికెట్‌పై ఆసక్తి లేదు. కానీ సచిన్ చాలా క్యూట్ అని అనుకున్నాను. ఆ రోజుల్లో విమానాశ్రయంలో వీఐపీల‌ను చూడ‌టం కోసం ప్రేక్ష‌కుల గ్యాలరీ ఉండేది. నేను ఇంగ్లండ్ నుండి దిగిన మా అమ్మ కోసం వెతుకుతున్నాను. అయితే సచిన్‌ని చూడగానే సచిన్‌ అని అరుస్తూ అతని వెంటే పరిగెత్తాను. సచిన్ చాలా ఇబ్బందిపడ్డాడు' అని అంజలి తెలిపింది.

హార్దిక్ పాండ్యా చేసిన ఆ ఐదు తప్పులే ముంబై ఇండియ‌న్స్ కొంపముంచాయ్

'నేను మెడిసిన్‌ చదువుతున్నాను. నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా క్రికెట్ ఆడాడు. ఎలాగైనా సచిన్ నంబర్ కావాలని అడిగాను. ఆ తర్వాత సచిన్‌కి ఫోన్ చేసింది. చాలాసార్లు ఫోన్ చేసినా సచిన్ కాల్‌కు హాజరు కాలేదు. ఒకసారి ఫోన్ చేస్తే సచిన్ స్వయంగా హాజరయ్యాడు. ఎయిర్‌పోర్ట్‌లో పరిచయమైన అమ్మాయిగా నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నువ్వు నన్ను గుర్తు పట్టావు అంటున్నాడు సచిన్. అంతేకాదు నువ్వు నారింజ రంగు టీషర్ట్ వేసుకోలేదని గుర్తు చేసుకున్నారు' అంజలి.

మారు వేషంలో అంజలితో డేట్‌కి వెళ్లిన స‌చిన్.. 

సచిన్ చాలా పాపులర్ క్రికెటర్ కావడంతో, అంజలితో డేట్ చేయడం అంత ఈజీ కాదు. ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, అంజలి తమ డేటింగ్ రోజులలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకసారి సచిన్, అంజలి సినిమా చూడ్డానికి వెళ్లారు. ప్రజలకు కనిపించకుండా ఉండేందుకు సచిన్ మారువేషంలో ఉన్నాడు. అతను నకిలీ గడ్డం, మీసాలు ధరించాడు. అయితే, ఆ గ‌డ్డం, మీసాలు సినిమా చూసే మధ్యలో ఊడిపోయాయి. దీంతో అభిమానులు గుర్తుప‌ట్టి చుట్టుముట్టడంతో సచిన్, నేనూ సినిమాను సగంలోనే వదిలేయాల్సి వచ్చిందని అంజలి తెలిపింది.

సచిన్ టెండూల్కర్-అంజలికి వ‌య‌స్సు అడ్డంకి కాలేదు.. 

సచిన్ టెండూల్కర్ కంటే అంజలి ఆరేళ్లు పెద్దది. అయితే వీరిద్దరి మధ్య దాంపత్య జీవితంలో మయస్సు అడ్డంకి కాదు. ఈ జంట ఒకరితో ఒకరు ఐదు సంవత్సరాలు డేటింగ్ చేశారు. మే 24, 1995న వివాహం చేసుకున్నారు. సచిన్‌ను పెళ్లి చేసుకునే ముందు అంజలికి క్రికెట్ గురించి పెద్ద‌గా అవగాహన లేదు. అయితే ఆ తర్వాత అంజలి క్రికెట్ గురించి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. సచిన్ టెండూల్కర్, పిల్లల కోసం అంజలి టెండూల్కర్ తన కెరీర్‌ను విడిచిపెట్టింది. వైవాహిక జీవితం కోసం తన కుటుంబాన్ని విడిచిపెట్టినందుకు తనకు ఎలాంటి నిరాశ‌, బాధ లేదని ఓ ఇంటర్వ్యూలో అంజలి చెప్పింది.

 

 

సారా టెండూల్కర్ తో బ్రేకప్? శుభ్‌మన్ గిల్ కొత్త గర్ల్ ఫ్రెండ్? 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios