JPMorgan CEO: "అమెరికాకు ప్రధాని మోడీ లాంటి నాయకుడు కావాలి"
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా, ఆయన ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ప్రధానిపై జేపీ మోర్గాన్ కంపెనీ సీఈవో జేమీ డామిసన్ ప్రశంసలు కురిపించారు. మోదీ లాంటి నాయకుడు అమెరికా కూడా కావాలని అన్నారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఖ్యాతి ప్రపంచంగా వ్యాపిస్తోంది. దేశ విదేశాల్లో ప్రధాని మోదీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా JP మోర్గాన్ కంపెనీ CEO జేమీ డామిసన్.. ప్రధాని మోడీ పేరు కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో మారుమోగిపోతుందని అన్నారు. ప్రధాని మోడీ తన హయాంలో చేసిన అభివ్రుద్దిపై ప్రశంసలు కురిపించారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు అమెరికాకు కూడా ఉండాలని జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ అన్నారు. ఆయన నాయకత్వం అద్భుతమైనది. ప్రధాని మోదీని ప్రశంసించిన జేమీ డామిసన్ మోన్ వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ నిర్వహించిన కార్యక్రమంలో జేమీ డామిసన్ మాట్లాడుతూ .. గత కొన్నేళ్లుగా భారత్‌లో ప్రధాని మోదీ పెనుమార్పులు తీసుకొచ్చారని అన్నారు. భారతదేశం అన్ని రంగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించిందనీ, కరోనా క్లిష్టపరిస్థితుల్లో ప్రధాని మోడీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారని పేర్కొన్నారు. తన దేశాన్ని రక్షించడమే కాకుండా ఇతర దేశాలకు అండగా నిలువడంతో నేడు నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థానంలో నిలిపారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఇలాంటి అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు అమెరికాకు కూడా అవసరమని జేమీ డిమోన్ అన్నారు.
డిజిటల్ ఇండియా
భారతదేశ అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ ఎంతో కృషి చేశారని, తన పాలనలో దాదాపు 400 మిలియన్ల మందిని పేదరికం నుండి బయటకి తెచ్చారనీ, అలాగే..700 మిలియన్ల మందిని అక్షరాస్యులుగా మార్చారని జేమీ డిమోన్ అన్నారు. భారతదేశంలోని డిజిటలైజేషన్ విధానం వల్ల ప్రజలు చాలా ప్రయోజనాలను పొందారనీ, సామాన్యుల కూడా సులభమైన జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు. తాను మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని అన్నారు.