Asianet News TeluguAsianet News Telugu

రామసేతు ఉందని చెప్పడం కష్టమే.. : షాకింగ్ ఆన్సర్ చెప్పిన కేంద్రం

రామసేతుపై కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. వాస్తవంగా మాట్లాడుకుంటే అలాంటిది ఒకటి ఉందని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రామసేతుకు దాదాపు 18 వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఉందని తెలిపారు.

Centre On 'Ram Setu' Query In Parliament
Author
First Published Dec 24, 2022, 5:39 AM IST

రామసేతుపై ప్రభుత్వ స్పందన: రామసేతు.. నీటిపై తేలియాడే రాళ్లు.. పునాది లేని వారధి.. భారత్ నుంచి శ్రీలంకలను కలిపే వంతెన.. సున్నపురాయి, ఇసుకతో నిర్మించిన కట్టడం.. ఇది రామయణ కాలం నాటిదని హిందువుల ప్రగాఢ విశ్వాసం. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా రామసేతుపై కేంద్ర ప్రభుత్వం సంచలన కామెంట్స్ చేసింది. రామసేతు ఉనికికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇంకా లభ్యం కాలేదని, ఇది ఉనికిలో ఉందని ఖచ్చితంగా నిరూపించలేమని, కానీ.. అక్కడ నిర్మాణం ఉండవచ్చని కొన్ని సూచనలు చెప్తున్నాయని కేంద్రప్రభుత్వం తెలిపింది.  

హర్యానాకు చెందిన స్వతంత్ర ఎంపీ కార్తికేయ శర్మ ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. మన ఉజ్వల చరిత్రపై ప్రభుత్వం ఏమైనా శాస్త్రీయ పరిశోధనలు చేస్తుందా ? అని తాను అడగాలనుకుంటున్నానని ఆయన ప్రభుత్వాన్ని రామసేతు ఉనికి గురించి అడిగారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆయన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు.

ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది

ప్రభుత్వం తరపున జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. రామసేతు గురించి మా ఎంపీ ఒక ప్రశ్న లేవనెత్తినందుకు సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే ఇది దాదాపు 18 వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర. మనం మాట్లాడుకుంటున్న వంతెన దాదాపు 56 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. స్పేస్ టెక్నాలజీ ద్వారా, సముద్రంలో కొన్ని రాళ్ల ముక్కలు కనుగొనబడినట్లు  కనుగొన్నాము, రామసేతు ఉన్నట్లు చూపించే కొన్ని ఆకారాలు ఉన్నాయి. సముద్రంలో కొన్ని ద్వీపాలు , సున్నపురాయి వంటివి కనిపించాయి. మామూలు మాటల్లో చెబితే .. రామసేతు అసలు రూపం అక్కడ ఉందని చెప్పడం కష్టం. అయితే, అక్కడ నిర్మాణం ఉండవచ్చని సూచించే కొన్ని సూచనలు ఉన్నాయి. పురాతన నగరం ద్వారక వంటి కేసులను పరిశోధించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.  
రామసేతు గురించి ఇప్పటికే చాలా సిద్ధాంతాలు బయటకు వస్తున్నాయని, రామసేతు ఉనికిపై తమకు నమ్మకం లేదని నిరంతరం కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పార్లమెంట్‌లో ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. ఇప్పుడు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చురకలు అంటించింది. 

కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా ట్విట్టర్‌లో ప్రభుత్వం ఈ సమాధానాన్ని పోస్ట్ చేస్తూ.. "భక్తులందరూ చెవులు విప్పి వినండి. కళ్ళు తెరిచి చూడండి. రామసేతు ఉనికికి రుజువు లేదని మోడీ ప్రభుత్వం పార్లమెంటులో చెబుతోంది" అని ట్వీట్ చేశారు.  ‘‘తమ ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది. కానీ, ఆ సమయంలో కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకులు అంటూ బీజేపీ విమర్శించింది’’ అని అన్నారు. పవన్ ఖేదాతో పాటు విపక్ష నేతలంతా ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీ అసలు నిజం బయటపడిందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios