ఆరేళ్ల చిన్నారిపై స్కూల్‌లోనే అత్యాచారం చేసిన ఎలక్ట్రిషియన్.. పంప్‌రూమ్‌కి లాక్కెళ్లి

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 10, Aug 2018, 10:49 AM IST
6 yr old girl raped in Delhi
Highlights

దేశరాజధాని ఢిల్లీలో మైనర్ బాలికలపై, చిన్నారులపై అత్యాచారాలు నానాటికి పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఆరేళ్ల చిన్నారిపై స్కూల్‌లోనే అత్యాచారం చేశాడు అదే స్కూలులో పనిచేస్తోన్న ఎలక్ట్రిషియన్

దేశరాజధాని ఢిల్లీలో మైనర్ బాలికలపై, చిన్నారులపై అత్యాచారాలు నానాటికి పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఆరేళ్ల చిన్నారిపై స్కూల్‌లోనే అత్యాచారం చేశాడు అదే స్కూలులో పనిచేస్తోన్న ఎలక్ట్రిషియన్. గోల్ మార్కెట్‌కు చెందిన ఓ బాలిక ఎప్పటిలాగే పాఠశాల లోపలికి వెళుతుండగా.. మధ్యలోనే అడ్డగించిన ఎలక్ట్రిషయన్ చిన్నారిని స్కూలు ఆవరణలోని పంప్ రూమ్‌లోకి తీసుకెళ్లాడు.. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన చిన్నారి జననావయవాల నుంచి రక్తస్రావం జరుగుతుండటాన్ని గమనించిన తల్లి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. పాపను పరీక్షించిన వైద్యులు చిన్నారి అత్యాచారానికి గురైందని ధ్రువీకరించారు. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు స్కూలులో పనిచేసే ప్రతి ఒక్కరిని బాలిక ముందు నిలబెట్టారు. ఈ క్రమంలో పాప ఆ నిందితుడిని గుర్తించింది. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు.

loader