మీరు ఎక్కువ సేపు ఏ విషయంలోనూ సంతోషంగా ఉండేలకపోతున్నా... ఏ విషయంలోనూ సంతృప్తి చెందలేకపోతున్నారన్నా కూడా మీరు తప్పుడు మార్గంలోనే అడుగులు వేస్తున్నారనే అర్థమట.

ఏ ఒక్కరి జీవితం  ఒకేలా ఉండదు. ఒకరి జీవితం ఆనందంగా సాగితే.. మరి కొందరి జీవితం.. అస్తవ్యస్తంగా మారుతుంది. అయితే.. మనం జీవితం ఎలా మారుతుంది అనేది మన చేతుల్లోనే ఉంటుందట. మన జీవితం... సక్రమమైన మార్గంలో వెళ్లడం లేదు అనడానికి.. మనం తప్పుడు మార్గంలోకి వెళ్తున్నాము అనేది మనం ముందుగానే గ్రహించవచ్చట.

మీరు ప్రతి విషయంలో ఒకరిపై ఆధారపడుతున్నారు అంటే.. లేదంటే.. మీకు స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటుకు బానిసలుగా మారుతున్నారు అన్నా.. మీరు తప్పుడు మార్గం వైపు అడుగు వేస్తున్నారనే అర్థమట.

మీరు ఎక్కువ సేపు ఏ విషయంలోనూ సంతోషంగా ఉండేలకపోతున్నా... ఏ విషయంలోనూ సంతృప్తి చెందలేకపోతున్నారన్నా కూడా మీరు తప్పుడు మార్గంలోనే అడుగులు వేస్తున్నారనే అర్థమట.

ఎప్పుడూ డల్ గా ఉండటం, లేదంటే.. నిత్యం అలసిపోయినట్లు ఉంటున్నారు అంటే.. మీరు సరైన మార్గంలో లేరు అనే అర్థం.

మిమ్మల్ని మీరే ప్రతి విషయంలో ప్రశ్నించుకుంటూ.. మీరు తీసుకుంటున్న నిర్ణయాలపై అనుమానం కలుగుతోంది అంటే చాలు మీరు తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారనే అర్థమట.

మీరు చేస్తున్న పని తప్పు అని మీకు తెలుసు.. కానీ దానిని ఎదుటివారు అపార్థం చేసుకోకుండా ఉండేందుకు.. తాము చేసేది కరెక్ట్ అని నమ్మించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

తప్పుడు మార్గంలో వెళ్లేవారిని  ఏ విషయం ప్రేరణ కలిగించదు. అందరికీ ప్రేరణ కలిగించే విషయాలు వీరికి బోరింగ్ గా అనిపిస్తూ ఉంటాయి.

రియాల్టీకి దూరంగా ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. నిజ జీవితానికి దూరంగా.. ఊహించుకుంటూ ఉంటారు. ఊహల్లోనే బతికేస్తూ ఉంటారు.

మీకంటూ ఓ గుర్తింపు ఉండదు. మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా ఎవరూ గుర్తించలేరు. మీకంటూ ఏ ప్రత్యేకత ఉండదు.