Top Stories
live cricket updates
specials
world cup 2019:   Fan screams insults at Pakistan captain sarfaraz
Point Table
  • teams
rankteamplayedwonlostn/rnrrpoints
1England54101.8628
2Australia54100.8128
3New Zealand43012.1637
4India43011.037
5Bangladesh52211.3395
6Sri Lanka5122-1.7784
7West Indies51310.2723
8South Africa5131-0.213
9Pakistan5131-1.933
10Afghanistan5050-2.0890
venue
today's star

Eoin Morgan

England


Runs - 148

Wickets -

most runs

Shakib Al Hasan

Bangladesh

384

most wickets

Mohammad Amir

Pakistan

13

most sixes

Eoin Morgan

England

22

world cup 2019 teams
world cup timeline
  • champions:  west indies
  • runners-up:  australia
  • most runs:  Glenn Turner (333)
  • most wickets:  Gary Gilmore (11)
1975

క్రికెట్ క్రీడకు ప్రసిద్ధి చెందిన లండన్ లోని లార్డ్స్ మైదానంలో తొలి క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ పోటీ జూన్ 21వ తేదీన జరిగింది. ఈ మ్యాచులో ఒక్కో జట్టుకు 60 సీక్స్ - బాల్ ఓవర్సును నిర్దేశించారు. ఈ మ్యాచు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి వెస్టిండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. జెఫ్ థామ్సన్, డెనిస్ లిల్లీ బౌలింగ్ కు దిగడంతో కరేబియన్లు కంగు తిన్నారు. గ్యారీ గిల్మోర్ తన స్పిన్ తో మాయాజాలం చేస్తుండడంతో మ్యాచ్ పూర్తిగా ఆస్ట్రేలియాకు అనుకూలంగా మారింది. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ క్లైవ్ లాయిడ్ బ్యాటింగ్ కు దిగాడు. మరో వైపు వికెట్ల వద్ద రోహణ్ కన్హాయ్ ఉన్నాడు. ఇక వెనక్కి తిరిగి చూడలేదు.లాయిడద్ 85 బంతుల్లో 102 పరుగులు చేశాడు.అందులో 12 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. లాయిడ్ పరుగుల ధాటికి స్కోరు బోర్డు మీద 291 పరుగులు నమోదయ్యాయి.
ఆస్ట్రేలియా బౌలర్లలో గ్యారీ గిల్మోర్ 48 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండింది. అయితే 25 పరుగుల వద్ద బాయిస్ బౌలింగ్ లో స్లిప్స్ లో కాళీచరణ్ రిక్ మెకోస్కర్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టడంతో ఆస్ట్రేలియా కష్టాలు ప్రారంభమయ్యాయి. బాయిస్ నాలుగు వికెట్లు పడగొట్టడంతో వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన కరేబియన్ ఫీల్డింగ్ ఆస్ట్రేలియా పాలిటి శాపంగా మారింది. ఐదుగురు రన్నవుట్ కావడంతో ఆస్ట్రేలియా చేతులెత్తేయక తప్పలేదు. కెప్టెన్ ఇయాన్ చాపెల్ 62 పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 50 పరుగులు చేసిన అలన్ టర్నర్ తప్ప ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఎవరూ స్కోరు బోర్డును పరుగులెత్తించలేకపోయారు. కెప్టెన్ కు అండగా నిలిచిన డగ్ వాల్టర్ 35 పరుగులు చేశాడు. ఆ రకంగా కరేబియన్లు తొలి ఐసిసి ప్రపంచ కప్ టైటిల్ విజేతలుగా నిలిచారు. సెంచరీ చేయడంతో పాటు ఓ వికెట్ తీసుకున్న క్లైవ్ లాయిడ్ బెస్ట్ ఫెర్మార్ గా నిలిచాడు.

  • champions:  west indies
  • runners-up:  england
  • most runs:  Gordon Greenidge (253)
  • most wickets:  Mike Hendrick (10)
1979

మరోసారి లార్డ్స్ మైదానంలోనే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. తొలి ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్, ఇంగ్లాండు జట్లు ఫైనల్ లో తలపడ్డాయి. ఇంగ్లాండు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్ కు దిగింది. వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిండ్ కేవలం 13 పరుగులకే పెవిలియన్ చేరుకున్నప్పటికీ ఆ జట్టులో మరో హీరో ముందుకు వచ్చాడు. వివియన్ రిచర్డ్స్ పేరు మైదానంలో మారుమోగింది. అతను 157 బంతుల్లో 138 పరుగులు చేయడమే కాకుండా కొల్లిస్ కు బలమైన మద్దతు ఇచ్చాడు. కౌల్లిస్ 66 బంతుల్లో 86 పరుగులు చేశాడు. దాంతో వెస్టిండీస్ నిర్ణీత 60 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండుకు ఓపెనర్లు మైక్ బ్రీయర్లే (64), జెఫ్ బాయ్ కాట్ (57) శుభారంభాన్ని అందించారు. గ్రాహమ్ గూచ్ బలమైన స్ట్రోక్స్ తో 32 పరుగులు జోడించాడు. దీంతో ఆతిథ్య ఇంగ్లాండు జట్టు 2 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆ తర్వాత జోయెల్ వెస్టిండీస్ బౌలర్లు ఇంగ్లాండుకు చుక్కలు చూపించారు. 11 ఓవర్లలో 5 వికెట్లు తీసుకుని జోయెల్ గార్నర్ ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ కు సింహస్వప్నంగా మారాడు. దీంతో 194 పరుగులకే ఇంగ్లాండు ఆలవుటై పరాజయాన్ని మూటగట్టుకుంది. గార్నర్ కు జత కూడి మైఖైల్ హోల్డింగ్ ఇద్దరిని పెవిలియన్ కు చేర్చాడు. కేవలం 11 ఓవర్లలో ఇంగ్లాండు 8 వికెట్లు కోల్పోయింది. చివరి ఏడుగురు బ్యాట్స్ మెన్ లో ఐదుగురు డకౌట్ అయ్యారు. వెస్టిండీస్ ఇంగ్లాండుపై 92 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో సారి కప్ ను సొంతం చేసుకుంది. రిచర్డ్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

  • champions:  india
  • runners-up:  west indies
  • most runs:  David Gower (384)
  • most wickets:  Roger Binny (18)
1983

మూడో ప్రపంచ కప్ పోటీల్లో కపిల్ డెవిల్స్ అద్భుతం చేశారు భారత క్రికెట్ చరిత్రను తిరగరాశారు. భారత క్రికెట్ ముఖచిత్రమే దాంతో మారిపోయింది. వన్డే క్రికెట్ లో దిగుదుడుపుగా ఉంటూ వచ్చిన భారత క్రికెట్ జట్టు 1983లో విశ్వవిజేతగా నిలిచింది. లార్డ్స్ మైదానంలో జూన్ 25వ తేదీన జరిగిన ఫైనల్ మ్యాచులో అభేద్యమని పేరు మోసిన వెస్టిండీస్ ను భారత్ ఓడించింది. ప్రపంచంలో మేటి బాలర్లు ఉన్న జట్టుగా ప్రసిద్ధి చెందిన వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత భారత్ బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. భారత్ కేవలం 183 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేసింది. నిర్ణీత 60 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 54.4 ఓవర్లలోనే ఆలవుటయింది. మొహిందర్ అమర్నాథ్ 80 బంతుల్లో 26 పరుగులు చేయగా, క్రిష్ణమాచారి శ్రీకాంత్ 57 బంతుల్లో 38 పరుగులు చేశాడు. వీరిద్దరు మాత్రమే వెస్టిండీస్ బౌలింగ్ ను ప్రతిఘటించగలిగారు. భారత బ్యాట్స్ మెన్ లో 20 పరుగులకు మించి పరుగులు చేసిన బ్యాట్స్ మన్ సందీప్ పాటిల్ మాత్రమే. అతను 27 పరుగులు చేశాడు. మూడు వికెట్లు తీసిన ఆండీ రాబర్ట్స్, మాల్కమ్ మార్షల్, జోయెల్ గార్నర్, మైఖైల్ హోల్డింగ్ నిప్పులు చెరిగే బంతులకు భారత బ్యాట్స్ మెన్ నిలదొక్కుకోలేకపోయారు.

అయితే, భారత బౌలర్ల అద్భుతమైన బౌలింగ్ ను వెస్టిండీస్ ఏ మాత్రం ఊహించలేకపోయింది. రిచర్డ్స్ ను కపిల్ దేవ్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ కు చేర్చాడు. అది ఊహకు అందని విషయం కూడా. ఆ తర్వాత కరేబియన్ బ్యాట్స్ మెన్ వరుసగా చేతులెత్తేస్తూ వచ్చారుడు. లాయిడ్ (8), గోమ్స్ (5), బచ్చుస్ (8) రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. డెస్మండ్ హెయిన్స్ (13), జెఫ్ డుజోన్ (25), మాల్కమ్ మార్షల్ (18) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు మొహిందర్ అమర్నాథ్ మైఖెల్ హోల్డింగ్ (6)ను పెవిలియన్ కు పంపించడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ 52 ఓవర్లకే ముగిసింది. వెస్టిండీస్ 140 పరుగులు మాత్రమే చేసింది. మొహిందర్ అమర్నాథ్ 7 ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఇంగ్లాండుకు చెందిన డేవిడ్ గ్రోవర్ 384 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. శ్రీలంకపై జరిగిన మ్యాచులో అతను 120 బంతుల్లో 130 పరుగులు చేశాడు. కప్ ను సాధించడమే కాకుండా భారత్ కు పలు అవార్డులు దక్కాయి. ప్రపంచ కప్ పోటీల్లో 18 వికెట్లు తీసిన రోజర్ బిన్నీ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఓ మ్యాచులో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా భారత కెప్టెన్ కపిల్ దేవ్ నిలిచాడు. జింబాబ్వేపై జరిగిన మ్యాచులో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

  • champions:  australia
  • runners-up:  england
  • most runs:  Graham Gooch (471)
  • most wickets:  Craig Mcdermott (18)
1987

ప్రపంచ కప్ పోటీలకు కేంద్రంగా ఉంటూ వచ్చిన లండన్ నుంచి వేదిక మారింది. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ కప్ పోటీలను ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ గా కూడా పిలుస్తూ వచ్చారు. ఈ పోటీలు ఇంగ్లాండులో మాత్రమే జరిగాయి. నాలుగో ప్రపంచ కప్ పోటీలను రిలయన్స్ కప్ 1987గా పిలిచారు. స్పాన్సరర్స్ పేరు మీద దాన్ని ఆ విధంగా పిలిచారు. దాంతో క్రికెట్ కాస్తా వ్యాపార క్రీడగా మారి ప్రజాదరణకు పాత్రమైంది. వన్డే ఫార్మాట్ లో ఏ విధమైన మార్పులు జరగలేదు కానీ ఓవర్లను 60 నుంచి 50కి తగ్గించారు. అప్పటి నుంచి వన్డే మ్యాచ్ 50 ఓవర్లకే పరిమితమవుతూ వస్తోంది. ఆతిథ్యం ఇవ్వడం వల్ల, ప్రపంచ కప్ టైటిల్ హోల్డర్స్ వల్ల భారత్ విజేతగా నిలుస్తుందని భావించారు. కానీ, భారత్ సెమీ ఫైనల్ లోనే ఇంగ్లాండు చేతిలో పరాజయం పాలైంది. నవంబర్ 5వ తేదీన వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ ఇంగ్లాండుపై 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లాండు 254 పరుగులు చేయగా, భారత్ 219 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండు ఫైనల్ కు చేరుకుంది. సెమీ ఫైనల్స్ లో పాకిస్తాన్ ను 18 పరుగుల తేడాతో ఓడించి మరో వైపు ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకుంది.
నవంబర్ 8వ తేదీన ఈడెన్ గార్డెన్స్ లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా డేవిడ్ బూన్స్ 75 పరుగుల వ్యక్తిగత స్కోరు సాయంతో 253 పరుగులు చేసింది. అయితే, నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. బూన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ప్రపంచ కప్ పోటీల్లోనే భారత బౌలర్ చేతన్ శర్మ హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు. ప్రపంచ కప్ పోటీల్లో ఇదే తొలి హ్యాట్రిక్. నాగపూర్ లో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ పై జరిగిన మ్యాచులో అతను హ్యాట్రిక్ సాధించాడు. ఇంగ్లాండుకు చెందిన గ్రాహం గూచ్ 471 పరుగులు చేసి టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన క్రెయిగ్ మెక్ డెర్మట్ 18 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

  • champions:  pakistan
  • runners-up:  england
  • most runs:  Martin Crowe (456)
  • most wickets:  Wasim Akram (18)
1992

బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ కప్ పేరుతో క్రికెట్ ప్రపంచ క్రీడ ఆకర్షణీయమైన రంగులను అద్దుకుంది. తెలుపు రంగు దుస్తుల స్థానంలో ఈ ప్రపంచ కప్ పోటీల్లో తొలిసారి క్రికెటర్లు రంగు రంగుల జెర్సీలు ధరించడం ప్రారంభమైంది. టెస్ట్ క్రికెట్ కు క్రీడాకారులు వాడే తెల్ల దుస్తుల స్థానంలో అవి వచ్చాయి. భారత క్రికెటర్ల జెర్సీని ముదురు నీలం రంగులో తయారు చేశారు. జెర్సీపైన నాలుగు స్ట్రిప్స్ ఉంటాయి. కింద మాత్రం ప్లెయిన్ గా ఉంటుంది. డే/ నైట్ మ్యాచులు కూడా ఈ టోర్నమెంటులోనే ప్రారంభమైంది. దాంతో తెల్ల బంతి స్థానంలో ఎరుపు రంగు బంతిని ప్రవేశపెట్టారు. విశ్వ విజేత ఆస్ట్రేలియా ఫేవరైట్ గా బరిలోకి దిగింది. వివక్ష ముగియడంతో తొలిసారి దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంటులో బరిలోకి దిగింది.

తొలిసారి సదర్న్ హాంప్ షైర్ లో ప్రపంచ కప్ పోటీలకు వేదిక అయింది. గేమ్ ఫార్మాట్ కూడా తొలిసారి మారింది. రెండు క్వాలిఫయింగ్ మ్యాచుల స్థానంలో పోటీ పడే జట్లు రౌండ్ - రాబిన్ ను పూర్తి చేసే విధంగా ఫార్మాట్ మారింది. వర్షం కురిస్తే లక్ష్యఛేదనకు బ్యాటింగ్ కు దిగే జట్టు స్కోరును లెక్కించే విధానం కూడా మారింది. మోస్ట్ ప్రొడక్టివ్ ఓవర్స్ మెథడ్ తో స్కోరును లెక్కించే విధానం అమలులోకి వచ్చింది. అంతకు ముందు సగటు రన్ రేటును ఆధారం చేసుకుని అంతకు ముందు స్కోరును లెక్కించేవారు. గత టోర్నమెంటులో విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్ కు చేరుకోలేకపోయింది. భారత్ కూడా అత్యంత నిరాశజనకమైన ఫలితాన్ని చూసింది. రౌండ్ - రాబిన్ దాటి వెళ్లలేకపోయింది. న్యూజిలాండ్ అనూహ్యంగా అద్భుతమైన ఆటను ప్రదర్శించి తొలి ఏడు మ్యాచులను వరుసగా గెలుచుకుంది. రౌండ్ రాబిన్ దశ తర్వాత పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను మట్టికరిపించి సెమీ ఫైనల్ లోకి అడుగు పెట్టింది. న్యూజిలాండ్ ను సెమీ ఫైనల్ లో పాకిస్తాన్ ఓడించి తొలిసారి ఫైనల్ కు చేరుకుంది. మరో సెమీ పైనల్ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండు 253 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు నష్టపోయి 232 పరుగులు చేసిన దశలో వర్షం కురిసింది. దాంతో పది నిమిషాల పాటు వర్షం ఆటకు ఆటంకంగా మారింది. దాంతో లక్ష్యాన్ని సవరించారు. సవరించిన లక్ష్యం మేరకు దక్షిణాఫ్రికా 13 బంతుల్లో 22 పరుగుల చేయాల్సి ఉండింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడం దక్షిణాఫ్రికాకు సాధ్యం కాలేదు. ఫైనల్ లో పాకిస్తాన్ ఇంగ్లాండును 22 పరుగులతో ఓడించి కప్ ను ఎగురేసుకుపోయింది. ఫైనల్ మ్యాచులో ఇమ్రాన్ ఖాన్ 72 పరుగులు చేయగా, జావేద్ మియందాద్ 58 పరుగులు చేశాడు. ాపకిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా, ఇంగ్లాండు 49.2 ఓవర్లలో 227 పరుగులు చేసి చేతులెత్తేసింది. వసీం అక్రమ్, ముస్తాక్ అహ్మద్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. అకిబ్ జావేద్ 2 వికెట్లు తీసుకున్నాడు. టోర్నమెంటులో 456 పరుగులు చేసిన మార్టిన్ క్రో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు. వసీం అక్రమ్ అత్యధిక వికెట్లు 18 తీసుకున్నాడు.

  • champions:  sri lanka
  • runners-up:  australia
  • most runs:  Sachin Tendulakar (523)
  • most wickets:  Anil Kumble (15)
1996

ప్రపంచ కప్ టోర్నమెంట్ రెండోసారి భారత ఉపఖండంలో జరిగింది. శ్రీలంక, పాకిస్తాన్, భారత్ చేతులు కలిపి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చాయి. తొలి మ్యాచ్ అహ్మదాబాద్ లో ఇంగ్లాండు, న్యూజిలాండ్ మధ్య జరిగింది. నాథన్ అస్లే సెంచరీ చేయడంతో ఇంగ్లాండుపై న్యూజిలాండ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. గేమ్స్ ప్రారంభం కావడానికి ముందే టోర్నమెంట్ ను వివాదాలు చుట్టుముట్టాయి. 1996 జనవరిలో తమిళ టైగర్లు సెంట్రల్ బ్యాంక్ పై బాంబులు వేయడంతో భద్రతా కారణాల రీత్యా శ్రీలంకకు తమ జట్లను పంపించడానికి వెస్టిండీస్, ఆస్ట్రేలియా నిరాకరించాయి. అయితే, అందుకు శ్రీలంక తీవ్ర అభ్యంతరాలు తెలియజేసింది. విస్తృతమైన సంప్రదింపుల తర్వాత ఐసిసి ఆ రెండు గేమ్ ల విషయంలో శ్రీలంకకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించింది. దీంతో క్వాలిఫయింగ్ రౌండ్ శ్రీలంక క్వార్టర్ ఫైనల్ లోకి చేరుకుంది.

శ్రీలంక మూడు వేదికలతో మూడు మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వగా, ఇండియాలో 17 మ్యాచులు, పాకిస్తాన్ లో 16 మ్యాచులు జరిగాయి. క్వార్టర్ ఫైనల్ లో ఇంగ్లాండును ఓడించి శ్రీలంక సెమీ ఫైనల్ కు చేరుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో భారత్ పాకిస్తాన్ ను ఓడించింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేయగా, పాకిస్తాన్ పాకిస్తాన్ 39 పరుగులకే చేతులెత్తేసింది. మందకొడి బౌలింగ్ కారణంగా పాకిస్తాన్ కు ఓ ఓవరు జరిమానా పడింది. అనిల్ కుంబ్లే, నవజోత్ సింగ్ సిద్ధు, వెంకటేష్ ప్రసాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్ పై విజయం సాధించి ఆస్ట్రేలియా చిట్టచివరకు ఫైనల్ ఫోర్ లోకి అడుగు పెట్టింది. శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్ లో భారత్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆదిలోనే సిద్ధు అవుటైనప్పటికీ, సచిన్ టెండూల్కర్ సంజయ్ మంజ్రేకర్ తో కలిసి ఇన్నింగ్సును చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఒక్క వికెట్ నష్టానికి 98 పరుగుల స్కోరు వద్ద భారత్ సచిన్ వికెట్ ను కోల్పోయింది. సచిన్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టంపవుట్ అయ్యాడు. ఆ తర్వాత భారత బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కడుతూ వెళ్లారు. దీంతో భారత క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు. సాఫ్ట్ డ్రింక్ కంటెనర్లను, వాటర్ బాటిల్స్ ను మైదానంలోకి విసరడం ప్రారంభించారు. దాదాపు అర గంట సేపు ఈ విధ్వంసం కొనసాగింది. ఆ సమయంలో భారత్ 8 వికెట్ల నష్టానికి 120 పరుగుల స్కోరు చేసింది, ఓటమి ఖాయమని తేలిపోయింది. ప్రేక్షకుల తీరు వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. ఆ తర్వాత మళ్లీ ప్రేక్షకులు బాటిల్స్ విసరడం ప్రారంభించారు. ముత్తయ్య మురళీధరన్ తన ఓవరులో రెండు బంతిని వేసే సమయంలో ఈ గలాటా ప్రారంభమైంది. పరిస్థితి విషమించడంతో శ్రీలంక విజయం సాధించినట్లుగా ప్రకటించి మ్యాచును ఆపేశారు. దీంతో శ్రీలంక ఫైనల్ కు చేరుకుంది. వెస్టిండీస్ ను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. కెప్టెన్ మార్క్ టైలర్, రికీ పాంటింగ్ శుభారంభాన్ని అందించినప్పటికీ స్పిన్ అటాక్ తో ఆస్ట్రేలియాను శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 241 పరుగులకు కట్టడి చేయగలిగింది.

శ్రీలంక బ్యాటింగ్ దిగి ఆరంభంలో తడబాటుకు గురైంది. అయితే, అరవింద డిసిల్వా 124 బంతుల్లో 107 పరుగులు చేయడంతో శ్రీలంక విజయం సాధించి, కప్ ను కొట్టేసింది. అతనికి అసంక గురు సింఘ (65), కెప్టెన్ రణతుంగ (47 నాటౌట్) మంచి మద్దతుగా నిలిచారు. డిసిల్వా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు. జయసూర్యకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. దాంతో శ్రీలంక తొలిసారి విశ్వ విజేతగా నిలిచింది. సచిన్ టెండూల్కర్ 7 ఇన్నింగ్సుల్లో 523 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనిల్ కుంబ్లే 15 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

  • champions:  australia
  • runners-up:  pakistan
  • most runs:  Rahul Dravid (461)
  • most wickets:  Geoff Allott (20)
1999

ప్రపంచ కప్ పోటీలు ఈసారి తిరిగి హోం గ్రౌండ్స్ లో జరిగాయి. స్కాట్లాండ్, వేల్స్, ఐర్లాండ్ కు టోర్నమెంటుకు ఇంగ్లాండుతో పాటు ఆతిథ్యం ఇచ్చాయి. ప్రారంభ దశలో జట్టలను పూల్ 'ఎ', పూల్ 'బీ'గా విభజించారు. తొలిసారి ఈ టోర్నమెంటు ఐసిసి ప్రపంచ కప్ పోటీలుగా పిలిచారు. అంతకు ముందు స్పాన్సరర్ పేర్ల మీద సాగాయి. విశ్వవిజేత శ్రీలంకను ఓడించడం ద్వారా ఇంగ్లాండు టోర్నమెంటులో శుబారంభం చేసింది. సచిన్ టెండూవల్రక్ తన తండ్రి మరణంతో భారత్ తిరిగి వెళ్లిన స్థితిలో భారత్ జింబాబ్వేపై ఓటమి పాలైంది. భారత్, అస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, న్యూజిలాండ్ సూపర్ సిక్స్ దశకు చేరుకున్నాయి. మూడేసి విజయాలు సాధించిన పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. రెండు విజయాలు సాధించిన న్యూజిలాండ్ కూడా సెమీ ఫైనల్ కు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో స్టీఫెన్ ఫ్లెమింగ్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. అయితే, షోయబ్ అక్తర్ నిప్పులు చెరిగే బంతులకు న్యూజిలాండ్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఏడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అయితే, పాకిస్తాన్ ముందు ఆ జట్టు చేతులెత్తేసింది. మరో సెమీ ఫైనల్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా 213 పరుగులు చేసింది. అలన్ డోనాల్డ్, షాన్ పొలాక్ వికెట్లను పంచుకున్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తన ఇన్నింగ్సును నిలకడగా ప్రాంభించినప్పటికీ 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ టై అయింది. సూపర్ సిక్స్ ఓవరులో ఆస్ట్రేలియా ఎక్కువ పరుగులు చేసి ఫైనల్ చేరుకుంది. లార్డ్స్ లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగింది. పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. షేన్ వార్న్ ధాటికి పాకిస్తాన్ బ్యాటింగ్ తుత్తునియలైంది. 132 పరుగులకే పాకిస్తాన్ చేతులెత్తేసింది. షేన్ వార్న్ 9 ఓవర్లలో 33 పరుగులు సమర్పించుకుని నాలుగు వికెట్లు తీశాడు. పాకిస్తాన్ బౌలర్లను అవహేళన చేస్తూ ఓపెనర్ గిల్ క్రిస్ట్ 36 బంతుల్లో 54 పరుగులు చేసాడు. కేవలం 20.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పాకిస్తాన్ ను మట్టి కరిపించి విశ్వ విజేతగా నిలిచింది. షేన్ వార్న్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలువగా, దక్షిణాఫ్రికాకు చెందిన లాన్స్ క్లుసెనర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంటుగా నిలిచాడు. భారత్ కు చెందిన రాహుల్ ద్రావిడ్ 461 పరుగులు చేసి టోర్నమెంటులో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. న్యూజిలాండ్ కు చెందిన జెఫ్ అలాట్, షేన్ వార్న్ 20 చొప్పున వికెట్లు తీశారు.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా (SA-ZM-KY)

  • champions:  australia
  • runners-up:  india
  • most runs:  Sachin Tendulkar (673)
  • most wickets:  Chaminda Vaas (23)
2003

ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ఆటను పరిశీలిస్తే ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది. ఓపెనర్లు ఆడం గిల్ క్రిస్ట్ (57), మాథ్యూ హెడెన్ (37) శుభారంభాన్ని అందించారు. ఎట్టకేలకు ఓపెనర్లను భారత్ పెవిలినయన్ చేర్చినప్పటికీ రికీ పాటింగ్ (121 బంతుల్లో 140 పరుగులు) డామైన్ మార్టిన్ (84 బంతుల్లో 88 పరుగులు)తో కలిసి స్కోరును పరుగులెత్తించాడు. దాంతో 30.1 ఓవర్లలో ఆస్ట్రేలియా 234 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 359 పరుగుల వద్ద ముగిసింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఓవరుకు 7.18 పరుగులు రికార్డు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఓవరులోనే సచిన్ టెండూల్కర్ పెవిలియన్ దారి పట్టాడు. లక్ష్యాన్ని ఛేదించడం భారత్ కు కనాకష్టంగా మారింది. వీరేంద్ర సెహ్వాగ్ ఆశలు రేకెత్తించాడు. అయితే, 81 బంతుల్లో 82 పరుగులు చేసి సెహ్వాగ్ రన్నవుట్ అయ్యాడు. రాహుల్ ద్రావిడ్ 57 బంతుల్లో 47 పరుగులు చేశాడు. భారత్ ఓవరుకు 7 పరుగుల రన్ రేటును సాధిస్తూ వచ్చినప్పటికీ వికెట్లు కోల్పోతూ వచ్చి మ్యాచ్ ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

పాంటింగ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నమెంటులో 14 జట్లు పాల్గొన్నాయి. 54 మ్యాచులు జరిగాయి. జట్లను మూడు విభాగాలు చేశారు. అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్టలు సూపర్ సిక్స్ దశకు చేరుకున్నాయి. ఈ టోర్నమెంటు రౌండ్ రాబిన్, నాకౌట్ పద్ధతుల్లో సాగింది. ఆస్ట్రేలియా ఫైనల్ లో భారత్ పైనే కాకుండా ఆడిన 11 మ్యాచుల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియా మూడోసారి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. మూడు సార్లు విశ్వవిజేతగా నిలిచిన జట్టుగా కూడా రికార్డులకు ఎక్కింది. 673 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. 23 వికెట్లు పడగొట్టిన శ్రీలంక ఆటగాడు చమిండా వాస్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

  • champions:  australia
  • runners-up:  sri lanka
  • most runs:  Mathew Hayden ‍(659)
  • most wickets:  Glenn Mcgrath (26)
2007

భారత క్రికెట్ ప్రేమికులు మరిచిపోలేని హృదయాలను కోత పెట్టే టోర్నమెంట్ ఇది. పాకిస్తాన్ కోచ్ బాబు వూల్మర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన స్థితిలో భారత్, పాకిస్తాన్ గ్రూప్ దశను కూడా దాటలేకపోయాయి. తొలిసారి ప్రపంచ కప్ పోటీలు వెస్టిండీస్ లో జరిగాయి. కరేబియన్లు విజయాల్లో అత్యంత ప్రతిభావంతమైన జట్టుగా ముందుకు వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నమెంటులో 16 జట్లు పాల్గొన్నాయి. జట్లను నాలుగు గ్రూప్ లుగా విభజించారు. టోర్నమెంట్ రౌండ్ రాబిన్, నాకౌట్ పద్ధతుల్లో జరిగింది. ప్రతి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన సూపర్ 8 దశకు చేరుకున్నాయి. ఆరు క్వాలిఫయర్ మ్యాచులు ఆడిన తర్వాత నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. ఈ టోర్నమెంట్ ఫైనల్ 2003 టోర్నమెంట్ ను గుర్తు చేసింది. ఆస్ట్రేలియా, శ్రీలంక ఫైనల్ లో తలపడ్డాయి. ఈ మ్యాచు శ్రీలంకకు రెండో ఫైనల్ కాగా, ఆస్ట్రేలియాకు నాలుగోది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, వర్షం కారణంగా మ్యాచును 38 ఓవర్లకేసి కుదించారు. ఈ మ్యాచులో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ 149 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ ఫైనల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. దాంతో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. కుమార సంగక్కర, సనత్ జయసూర్య 116 పరుగులు చేయడం ద్వారా శ్రీలంక శుభారంభం చేసింది. ఈ స్థితిలో మరోసారి వర్షం ఆటంకంగా మారింది. దాంతో మ్యాచును 36 ఓవర్లకు కుదించి, లక్ష్యాన్ని 269 పరుగులుగా నిర్దేశించారు. 33 ఓవర్లు పూర్తయిన తర్వాత వాతావరణం సరిగా లేకపోవడంతో చీకటిగా ఉండడంతో మ్యాచును అంపైర్ మర్నాటికి వాయిదా వేయడానికి నిర్ణయించాడు. శ్రీలంక కెప్టెన్ మహేలా జయవర్ధనే మ్యాచ్ ను కొనసాగించాలని పట్టుబట్టాడు. ఆస్ట్రేలియా అందుకు అంగీకరించింది. చివరి మూడు ఓవర్లు చిమ్మచీకటిలో వేశారు. ఆస్ట్రేలియా డక్ వర్త్ - లూయిస్ పద్ధతిలో 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మెక్ గ్రాత్ 26 వికెట్లు పడగొట్టి టోర్నమెంటులో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియాకే చెందిన మాథ్యూ హెడెన్ 659 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు.

  • champions:  india
  • runners-up:  sri lanka
  • most runs:  Tillakaratne Dilshan (500)
  • most wickets:  Zaheer Khan, Shahid Afridi (21)
2011

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించి భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. స్వదేశీ గడ్డపై విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ రికార్డులకు ఎక్కింది. ఒక్కటి కన్నా ఎక్కువ సార్లు ప్రపంచ కప్ ను గెలుచుకున్న జట్టుగా కూడా నిలిచింది. ఫైనల్ మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మహేలా జయవర్ధనే 103 పరుగులు, కుమర సంగక్కర 48 పరుగులు చేయడంతో శ్రీలంక ఆ స్కోరు చేయగలిగింది.

భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. వీరేంద్ర సెహ్వాగ్ ఇన్నింగ్సు రెండో బంతికే పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ జోడీ15 ఓవర్లలో 83 పరుగులు సాధించింది. ఆ తర్వాత గంభీర్ కు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జత కూడాడు. ఈ జోడీ 109 పరుగులు జోడించి ప్రపంచ కప్ ఫైనల్ లో రికార్డు సృష్టించింది. భారత్ 49 ఓవర్లలో తన ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధోనీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచు అవార్డు దక్కించుకోగా, యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంటుగా నిలిచాడు.

రెండు ఆసియా దేశాలు ఫైనల్ కు చేరుకోవడం ద్వారా ప్రపంచ కప్ చారిత్రాత్మకంగా నిలిచింది. 14 జట్లు ఓ టోర్నమెంటులో పాల్గొన్నాయి. తొలి మ్యాచు భారత్, ఇంగ్లాండు మధ్య జరిగింది. జట్లను రెండు గ్రూపులుగా విభించారు. ప్రతి జట్టునుంచి ఒక్కటి చొప్పున క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాయి. ఆ తర్వాత నాకౌట్ దశ జరిగింది. టాప్ స్కోర్ చేసిన జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. సెమీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ ను 29 పరుగుల తేడాతో ఓడించింది. శ్రీలంక న్యూజిలాండ్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్ 500 పరుగులు చేసి టోర్నమెంట్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత్ కు చెందిన జహీర్ ఖాన్, పాకిస్తాన్ కు చెందిన షాహిద్ అఫ్రిదీ 21 చొప్పున వికెట్లు తీసుకుని టోర్నమెంటులో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లుగా నిలిచారు.

  • champions:  australia
  • runners-up:  new zealand
  • most runs:  Martin Guptill (547)
  • most wickets:  Mitchell Starc, Trent Boult (22)
2015

గేమ్ ఫెవరైట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్స్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచులో టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, 45 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలవుట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లను బ్యాట్స్ మెన్ గ్రాంట్ ఇలియోట్ (93), రాస్ టైలర్ (40) మాత్రమే ప్రతిఘటించారు. న్యూజిలాండ్ 36 ఓవర్లలో 150 పరుగుల చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. చివరకు 183 పరుగులకు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఆస్ట్రేలియా ఆరంభం కూడా ఏమీ బాగా లేదు. రెండో ఓవరులోనే ఆరోన్ ఫించ్ డకౌట్ అయ్యాడు. బ్యాటింగ్ మందకొడిగా సాగింది. 20వ ఓవరు ముగిసే సరికి 98 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ మైఖేల్ క్లార్క్ 72 బంతుల్లో 74 పరుగులు, స్టీవ్ స్మిత్ 56 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు. క్లార్క్ అవుటైన తర్వాత స్మిత్ కు షేన్ వాట్సన్ జత కూడి 33.1 ఓవరులోనే విజయాన్ని సాధించి పెట్టాడు.

విశ్వ విజేత భారత్ ను సెమి ఫైనల్లో 95 పరుగుల తేడాతో ఓడించి ఆసీస్ ఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా 328 పరుగులు చేయగా, భారత్ 233 పరుగులకే అన్ని వికెట్లనూ చేజార్చుకుంది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్కులో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. న్యూజిలాండ్ 299 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 281 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచు రోజు వర్షంతో మైదానం తడిసిపోయింది. టోర్నమెంటులో 14 జట్లు పాల్గొనగా రెండు గ్రూపులుగా విభజించారు. అతిథేయ దేశాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పాటు దక్షిణాఫ్రికా, భారత్ సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. అదే దేశానికి చెందిన మార్టిన్ గుప్తిల్ 547 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ కు చెందిన ట్రెంట్ బౌల్ట్ 22 చొప్పున వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా నిలిచారు. భారత ఆటగాళ్లలో ఉమేష్ యాదవ్ 18 వికెట్లు తీయగా, శిఖర్ ధావన్ 412 పరుగులు చేసి తమ పేర్లను ప్రపంచ కప్ పోటీల్లో నమోదు చేసుకున్నారు.